సింహపురి సమాచారం

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ పోస్ట్‌ను. కమిషనర్‌గా వున్న వెంకటేశ్వర్లును గతేడాది డిసెంబర్‌లో బదిలీ చేశారు. విజయవాడ సిసిఎల్‌ఏలో పనిచేస్తున్న హరీష్‌ను కొత్త కమిషనర్‌గా వేసినా ఆయన ఇక్కడకు రావడానికి భయపడ్డారు. బాధ్యతలు…
నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే చాలా ఆలస్యంగా విభేదాలొచ్చాయనుకోవచ్చు. 2014కు ముందు దాకా కూడా ఆనం సోదరులు నలుగురూ కలిసి మెలిసే వున్నారు. ఆనం వివేకానందరెడ్డి పెద్దరికాన్ని, పెత్తనాన్ని మిగతా ముగ్గురూ గౌరవిస్తూ…
నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం చివరి దాకా ప్రయత్నించిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపించాడు. మంత్రి నారాయణ, తనయుడు లోకేష్‌ అండదండలు దండిగా వున్న వాకాటి నారాయణరెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేశారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు నాయకులు కూడా ఆదాల ఎమ్మెల్సీ అయితే నెల్లూరులో మరో పవర్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందని భావించి ఆయనకు సీటు రాకుండా అడ్డుకున్నారు. అదీ కాకుండా ఇప్పటికే…
నెల్లూరు దర్గామిట్టలోని స్వర్ణాల చెరువు తీరాన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతో మంజూరైన రూ.33కోట్లతో నూతనంగా ట్యాంక్‌బండ్‌ నిర్మించి బారాషాహిద్‌ దర్గా ఆవరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అన్నమయ్య సర్కిల్‌, ముత్తుకూరుగేట్‌, విజయమహల్‌గేట్‌ ప్రాంతాల్లో డివైడర్లలో గ్రీనరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరునెలల్లో నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేందుకు డివైడర్లతో పాటు 15కిలోమీటర్ల మేర…
నెల్లూరు మేయర్‌ అజీజ్‌ వైఖరిపై తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక అజీజ్‌ను కొనసాగిస్తే నగరంలో తెలుగుదేశం మనుగడ సాగించడం కష్టమనే భావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అజీజ్‌ ఒంటెత్తు పోకడల మూలంగా నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలు పార్టీకి దూరమవుతున్నారని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మేయర్‌ అజీజ్‌ వైఖరితో నగరంలో పార్టీ నష్టపోతుందని ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ను అవినీతికి నమూనాగా మార్చారు. సామాన్య…
జిల్లాలో మంత్రి నారాయణను మొదలుకొని ఏ ప్రధాన తెలుగుదేశం నాయకుడిని కూడా లెక్కపెట్టకుండా వ్యవహరిస్తున్న మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీ చేయడ మేనని చెప్పుకొచ్చాడు. దీంతో నెల్లూరు నగరంలో సరికొత్త వర్గపోరుకు తెరతీసి నట్లయ్యింది. మేయర్‌ అజీజ్‌ మొదట నుండి కూడా ఎవరినీ పట్టించుకోకుండా, ఏ నాయకుడినీ సంప్రదించకుండా సొం తంగా వ్యవహరిస్తున్నాడు.…
నెల్లూరు నగరపాలక సంస్థ కేంద్రంగా తెలుగుదేశం పార్టీలోనే నాలుగుస్థంభాలాట నడుస్తోంది. మేయర్‌ అజీజ్‌ ఒక స్థంభం కాగా, ఆనం, ఆదాల, ముంగమూరులు మరో మూడుస్థంభాలుగా మారి ఆడుకుంటున్నారు. మిగిలిన ముగ్గురికి కూడా మేయర్‌ అజీజ్‌ చిక్కడం లేదు. ఇప్పటికే ఎస్సీ సబ్‌ప్లాన్‌ పనుల విషయంలో మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరం, రూరల్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలతోనూ అజీజ్‌ విభేదించాడు. ఈ విషయంలో ఆయన…
స్వాతంత్య్ర సమరం నుంచి సారా వ్యతిరేకోద్యమం దాకా ఉద్యమాలకు ఊపిరిపోసిన జిల్లా నెల్లూరుజిల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎందరో చరిత్రాత్మక నాయకులకు, ఉద్ధండ రాజకీయ నేతలకు జన్మనిచ్చిన జిల్లా నెల్లూరుజిల్లా. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగంలో సంచలనాలకు మారుపేరుగా పిలవబడుతున్న జిల్లా నెల్లూరుజిల్లా. దాన కర్ణులకు - దాన ధౌరేయులకు పేరు గాంచిన జిల్లా నెల్లూరుజిల్లా. అలాంటి జిల్లా కేంద్రమైన నెల్లూరు పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. నెల్లూరు నగరం…
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఈ సంక్రాంతి పండుగ కళ తప్పింది. అన్నిరకాల వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. పండుగ ముందు రోజుల్లో కళకళలాడుతుండాల్సిన వ్యాపార దుకాణాలు వెలవెలబోతున్నాయి. పండుగ వ్యాపారాలపై వ్యాపారస్థులు భారీ అంచనాలు పెట్టుకుని వుంటారు. ఈసారి అంచనాలకు తగ్గట్లుగా వ్యాపారాలు లేవు. 50శాతం వ్యాపారాలు పడిపోయాయి. మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో నగదు రాలేదు. నగదు విత్‌డ్రాపై బ్యాంకుల్లో నిబంధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్‌ కరెన్సీ వున్న…
Page 1 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter