సింహపురి సమాచారం
మంత్రయ్యాడనే గాని జిల్లాకు నారాయణ రూపాయి పని చేయడం లేదు. ఇది జనాభి ప్రాయం. దీనిని పక్కనపెట్టి నేను పని చేస్తు న్నాని చెప్పుకోవడానికి ఆయన అధికారుల మీద చిందులేస్తే ఏం లాభం? ఇద్దరు అధికారులను చెడామడా తిట్టగానే మంత్రి గారు బ్రహ్మాండంగా పని చేస్తున్నారనుకోవాలా? గత నెలలో నెల్లూరులో వరదలు సంభవించడం తెలిసిందే! నెల్లూరులో భారీ వర్షాలు పడతాయని, నగరం ముంపుకు గురవుతుందని ఎవరూ వూహించలేదు. ఊహించనిది అనూహ్యంగా…
రాజకీయాల్లో ఎవరి టైం ఎప్పుడు ఎలావుంటుందో చెప్పలేం. కొందరికి మంచికాలం వచ్చిందనుకుంటే అది బ్యాడ్టైంగా మారొచ్చు. కొందరు బ్యాడ్ టైంలో ఉన్నామనుకున్నప్పుడు వెంటనే మంచికాలం రావచ్చు. ప్రస్తుతం జిల్లా రాజకీయాలలో కొందరికి గుడ్టైం, మరి కొందరికి బ్యాడ్టైంను సూచిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆనం సోదరులు పదేళ్లు జిల్లాను శాసించారు. జిల్లా యం త్రాంగాన్ని తమ కనుసైగలతో నడిపిం చారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆనం సోదరులు కాంగ్రెస్‌లో…
మొన్నటి వానల విజృంభణ ప్రజలను నానా యాతనలకు గురిచేసింది. నెల్లూరు నగరంలోని ప్రధాన వీధుల్లో సైతం జల ప్రళయం వచ్చిందా అన్నంతగా, ఇటీవలి కాలంలో ఎన్నడూ కనీవినీ ఎరుగునంతగా వానలతో వచ్చిన వరదనీటి ప్రవాహం తన విశ్వరూపాన్ని చూపింది. అయితే, ఇలాంటి విపత్తు నవంబర్, డిసెంబర్ నెలలో రానే వస్తాయని, గత అనుభవాల దృష్ట్యా అధికారయంత్రాంగం ముందుగానే అప్రమత్తం కావాలని 'లాయర్' ముందు గానే హెచ్చరించినా ఎవరూ పట్టించుకోక పోవడం…
నెల్లూరులో ఇలాంటి వానలు ఎప్పుడూ చూడలేదు. ఇంత ముంపును ఎవ్వరూ ఊహించలేదు. ఎక్కడెక్కడో పట్టణాలలో వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు వాగులు కావడం టివీల్లో చూసారుగాని, నెల్లూరు నగరంలోనే అంతటి దారుణ పరిస్థితులను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. నగరంలో సురక్షిత ప్రాంతమన్నదే లేదని ఈ వర్షాలు నిరూపించాయి. నగరంలో ఖరీదైన ప్రాంతంగా చెప్పుకోబడే మాగుంట లే అవుట్ సైతం ముంపుకు గురైంది. ఈ కాలనీలో రోడ్లన్నీ జలమయమై ఇళ్లల్లోకి, అపార్ట్మెంట్లలోకి నీళ్లు…
కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది. రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వామిగా వుంది. కాబట్టి రాష్ట్రంలో పెద్దగా కేడర్ లేకపోయినా ఆ పార్టీ లీడర్‌గా మాత్రం చెలా మణి కావచ్చు. ఈ ఆలోచనతోనే బీజేపీ జిల్లా అధ్యక్షపదవి కోసం గట్టిపోటీ నెలకొంది. ఈ నెలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వుంది. గత కొన్నేళ్లుగా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా అదే తరహా ఎన్నికకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొత్త…
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, నెల్లూరుజిల్లా వాడు. నెల్లూరు కేంద్రంగా ఎదిగినోడు. కాబట్టి నెల్లూరుపై కొంతలో కొంతన్నా అభిమానముంటుందనుకోవచ్చు. మంత్రి జిల్లాకు పరిమితం కాదు, అతనికి రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఒక్కటే అనే వాదనలోకి పోయినా ప్రతి మంత్రి కూడా తన శాఖ పరిధిలో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత నిస్తుంటారు. కాని పురపాలక శాఖ మంత్రి నారాయణలో మాత్రం నెల్లూరు నగరం అభివృద్ధి పట్ల ఆ చిత్తశుద్ధి ఏ…
జిల్లాలోకల్లా తెలుగుదేశంపార్టీ బల హీనంగా వుండేది నెల్లూరు నగరంలోనే! ఏ జిల్లా ప్రధాన కేంద్రంలోనూ ఆ పార్టీ ఇంత చచ్చుగా లేదు. ఇది ఒక రకంగా చంద్రబాబు పుణ్యమే. పార్టీ ఇంత అవతా రంగా వుంటే దీనికి ఇప్పుడు వర్గపోరా టాలు, ఆధిపత్య పోకడలు ఎక్కువయ్యాయి. నగరంపై పట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లుంటున్న నేపథ్యంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంపై పెత్తనం కోసం మేయర్‌గా అజీజ్ ఓ పక్క,…
జిల్లాలో ఎక్కడ చూసినా మాయదారి జ్వరాలే. ఈ జ్వరాలతో సామాన్య జనం నానా బాధలు పడుతున్నారు. ఆసుపత్రులన్నీ జ్వరగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. అయినా, ప్రభుత్వ వైద్యసిబ్బంది తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. ముఖ్యంగా, నెల్లూరు నగరంలో ఈ వైరల్ ఫీవర్స్ జనాన్ని మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి వీధినా ఈ జ్వరాలతో వణికిపోయేవారి సంఖ్య గణనీయంగానే వుంటోంది. నగరంలో ఎక్కడ చూసినా మురుగుదిబ్బలు, చెత్తా చెదారాలు పేరుకుని, దోమలు విపరీతంగా ప్రబలిపోయి నానా రోగాలకూ…
భారతదేశంలో రేషన్‌కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి సబ్సిడీ పథకాలకు తప్ప జీవనోపాధికి ప్రభుత్వాల మీద ఆధార పడడం చాలాతక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగా వుంటాయి. ఇటీవల ప్రైవేటీకరణ జోరుతో వున్న అరకొర ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రిక్షా తొక్కడం నుండి టీకొట్టు మొదలుకొని పెద్దపెద్ద వ్యాపారాల వరకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికే ప్రజలు శ్రమ పడుతుంటారు. ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా తమ బ్రతుకు మార్గాన్ని తామే వెతుక్కుంటుంటారు. అది…