సింహపురి సమాచారం

రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు కింగ్‌లవుతారో, ఎవరు తెరమరుగవుతారో అంతే పట్టదు. రాజకీయాలలో ఎల్లకాలం వెలగడం అన్నది ఎవరికీ శాశ్వతం కాదని చాలామంది నాయకుల చరిత్రను పరిశీలిస్తే అర్ధమవుతుంది. నెల్లూరుజిల్లాలో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉం డేది ఆనం కుటుంబానికే! 60ఏళ్ల రాజకీయ చరిత్ర వున్న కుటుంబమది. ఏ పార్టీలో వున్నా జిల్లా అగ్ర నేతలుగా చక్రం తిప్పుతూ వచ్చారు. అధికారంలో వున్నా ప్రతిపక్షంలో వున్నా జిల్లా…
నంద్యాల ఎన్నికల్లో... ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాల ఉప ఎన్నిక భలే టెన్షన్‌ పెడుతోంది. ఇంతవరకు నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోయినా, చంద్రబాబు మాత్రం ఈ ఎన్నిక కోసం సర్వశక్తు లొడ్డుతున్నాడు. ప్రతిరోజూ రాష్ట్ర పరిపాలన కోసం కేటాయిస్తున్న సమయం కంటే కూడా నంద్యాల కోసం ఆయన కేటాయిస్తున్న సమయం ఎక్కువుగా వుంది. నంద్యాలలో గెలుపు కోసం ఆయన పడని తంటాలు లేవు. స్థానిక ముస్లిం…
ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే జిల్లాలో వున్న సమస్యలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ రావచ్చు. జిల్లాలో ఇప్పుడు ఏకకాలంలో ముగ్గురు సమర్ధులైన అధికారు లున్నారు. వీరిమధ్య సహకారం, సమన్వయం నెల్లూరు నగర అభివృద్ధికి…
కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను ఎత్తేస్తే తమ ఆస్తుల విలువ పడిపోతుందని వారి భయం. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో కొందరు సినిమావాళ్లు సినీ పరిశ్రమను హైదరాబాద్‌ నుండి ఏపికి తరలించాలని డిమాండ్‌…
బ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా చూస్తుంది. ప్రపంచంలోనే ఈరోజు క్రికెట్‌ పెద్ద జూదమైపోయింది. ఆ జూదంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. వాస్తవానికి క్రికెట్‌ ఆట ద్వారా ఆయా జట్లకు, ఆయా దేశాల…
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పెద్దగా మాట్లాడడు. మాట్లాడిన చోట ఏదో ఒక వివాదం తెస్తుంటాడు. ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల గడువుంది. అప్పటికి ఎవరు ఏ పార్టీలో వుంటారో, ఏ సీటును ఎవరు తెచ్చుకుంటారో తెలియదు. అప్పటి రాజకీయ పరిణామాలను ఇప్పుడే వూహించలేము. కాబట్టి ఫలానా సీటు ఫలానా ఆయనకే అని చెప్పడం కరెక్ట్‌ కాదు. అది కూడా మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పడం సముచితం కాదు. ఆయన వైయస్సార్‌…
నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం బస్టాండ్‌లో ప్లాట్‌ఫారాలు చాలావరకు ఖాళీగా వుం డేవి. ఇప్పుడు మాత్రం ప్లాట్‌ఫారం మీద ఒక బస్సు వుంటే దానివెనుక ఇంకో రెండు బస్సులు వెయిటింగ్‌లో వుండే పరిస్థితి.…
కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను చెవికెక్కించుకునే చాలామంది ప్రవాసభారతీయులు గాని, స్వదేశంలో వున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు గాని తమ పుట్టిన గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను, అభివృద్ధి…
నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద మస్తాన్‌రావు అనుచరుడు పాలడుగు రంగారావును, నెల్లూరు నగరానికి చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు షేక్‌ ఖాజావలి, సూళ్ళూరుపేట నియోజకవర్గం నుండి బీజేపీకి చెందిన సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిలను డైరెక్టర్‌లుగా…
Page 3 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter