సింహపురి సమాచారం

నెల్లూరు నగర కార్పొరేషన్‌ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. నేతల ఆధిపత్యపోరు మధ్యలో ప్రజలకు వాతలు పెడుతున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇద్దరూ నెల్లూరీయులే పట్టణాభివృద్ధి శాఖలకు సారధ్యం వహి స్తున్నా, నెల్లూరు కార్పొరేషన్‌ని మాత్రం బాగుచేయడం ఎవరి తరమూ కాదన్నంత అధ్వాన్నంగా తయారయిపోయింది. మాగుంట లే అవుట్‌లోని ఎస్‌.ఆర్‌.కె స్కూల్‌ నుండి సి.పి.ఆర్‌ కళ్యాణ మండపం వరకూ మంజూరు కాబడిన డ్రైన్‌ నిర్మాణ విషయంలో మరోసారి నగర కార్పొరేషన్‌…
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరా వతిని సింగపూర్‌ రాజధానిని చేసినట్లే నెల్లూరును కూడా స్మార్ట్‌ సిటీ చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌ అన్నది ఒకటికి మూడు సార్లు ప్రకటనలకు పరిమితమైందే తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకు పడ లేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వంద నగరాలను స్మార్ట్‌ సిటీలుగా చేస్తామని ప్రకటించడం తెలిసిందే! కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సొంతూరు నెల్లూరు కాబట్టి, ఆయన సిఫార్సుతో నెల్లూరు…
అవినీతి, అక్రమాల విషయంలో మనం 'అమరావతి' కథలు వింటున్నాం. భూసేకరణ నుండి తాత్కాలిక భూములు, స్విస్‌ ఛాలెంజ్‌పై సింగపూర్‌ కన్సార్టియంకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం, పనులకు అంచనాలు పెంచడం, పనుల్లో నాణ్యత లోపిం చడం... ఇవన్నీ చూస్తుంటే అవినీతి ఇంత దారు ణంగా వుంటుందా అనిపిస్తుంది. అయితే మనం దారుణమైన అవినీతి గురించి తెలుసుకోవడానికి అమరావతి దాకా పోనవసరం లేదు. నెల్లూరులోనే ఎన్నో ఆనవాళ్లున్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ కేంద్రంగా జరిగే…
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వర్లు బదిలీ వ్యవహారం అధికార పార్టీలోనే విభేదాల చిచ్చును రాజేసింది. నెల్లూరు నగరంలో ఏం జరిగినా నాకు తెలియాలి అన్నది మేయర్‌ అజీజ్‌ వ్యవ హారశైలి. నెల్లూరుకు నేను కింగ్‌ను అను కుంటున్నాడాయన! కాగా మంత్రి నారాయణ ఈ రాష్ట్రానికి చంద్రబాబు తర్వాత నేనే కింగ్‌ను అనుకుంటున్నాడు. కాబట్టే మేయర్‌తో పని లేకుండానే అతనికి తెలియకుండానే కమిషనర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.…
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆర్భాటంగా శత్రు దేశాల మీద యుద్ధానికి పోతున్నట్లుగా 'దోమలపై దండయాత్ర' అన్నాడు. దీని పేరుతో ఖర్చు కూడా వ్రాసారు. నెల్లూరులో మాత్రం అదికాస్తా రివర్స్‌లో వుంది. ఇక్కడ ప్రజలపై దోమల దండయాత్రలాగా పరిస్థితి ఉంది. నెల్లూరు టౌన్‌ ముదురుదోమలకు పెట్టింది పేరు. కార్పొరేషన్‌ పారిశుద్ధ్య సిబ్బంది బాగా పని చేస్తున్నారు, ఫాగింగ్‌ చేస్తున్నారు, మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు, మురికి గుంటల్లో ఆయిల్‌బాల్స్‌ వేస్తున్నారంటేనే…
పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను కష్టాలు, కోటీశ్వరులను నష్టాల పాల్జేసిన మాటేమోగాని నెల్లూరు నగర పాలక సంస్థ పాలిట మాత్రం వరంగా మారింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కార్పొరేషన్‌కు రావాల్సిన మొండి బకాయిలు చాలా వరకు వసూలయ్యాయి. నెల్లూరు నగర పాలక సంస్థకు ప్రతి ఏటా 70శాతం కూడా ఆస్థి పన్ను వసూలు కావడం లేదు. కార్పొరేషన్‌కు ఇదే పెద్ద ఆదాయ మార్గం. ఈ ఆదాయంతోనే కార్పొరేషన్‌ నడవాలి.…
ఒక అడవిలో నక్క కంట్లో నలుసుపడి కాళ్లో ముల్లుగుచ్చుకుని మూలుగుతూ తాటిచెట్టు క్రింద కూర్చుంది. అప్పుడే ఓ పండిన తాటికాయ దాని తలపై పడింది. నక్క బాధ ఎక్కువైంది. ఒకటికి మూడుచోట్ల నొప్పు లయ్యాయి. ఇంతలో తాటికాయల గెల తెగి దీనిమీద పడింది. ఆ దెబ్బకు నక్క యమలోకం ఎంట్రన్స్‌ దాకా వెళ్లిపోయింది. అంటే కోమా స్టేజ్‌ అన్నమాట... ఈసారి ఏకంగా తాటిచెట్టే కూలి దాని మీద పడింది. కోమా…
నెల్లూరు నగరం మళ్ళీ ఒక మురుగు దిబ్బగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కంపే. ఏ రోడ్డు చూసినా చెత్తే. చెత్తకుప్పలు, మురుగు వాసన.. నెల్లూరుకు కొత్తేమీ కాకపోయినా పారిశుద్ద్య కార్మికుల ఆందోళనతో ఆ దుర్వా సన మరింత పెరిగింది. ప్రధాన రోడ్లతో సహా అన్ని రోడ్లు చెత్తాచెదా రంతో నిండిపోతుండడంతో నగరం కుళ్ళుకంపు కొడుతోంది. ఇళ్ళ నుంచి నేరుగా చెత్తబండ్లు వచ్చి చెత్త తీసుకుపోతుండడంతో ఇన్నాళ్ళు ఈ బాధ తెలియలేదు.…
నెల్లూరు నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకోవాలంటే పన్నులు ఒక్కటే మార్గం కాదు, ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. సులభంగా దొరుకుతున్నారు కదా అని చెప్పి ప్రజలను పన్నుల రూపంలో పదేపదే బాదుతుంటే కొన్నాళ్లకు వాళ్లు పన్నులు కట్టడం మానేస్తారు. ముఖ్యంగా నగరంలో ఎన్నో రిజర్వ్‌ స్థలాలున్నాయి. వాటిలో కొన్నింటిని పెయిడ్‌ పార్కింగ్‌ జోన్‌లుగా మార్చొచ్చు. దీనివలన నగరపాలక సంస్థకు ఆదాయమే కాక నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు కొంత పరిష్కారం చూపినట్లు కూడా…
Page 5 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
    మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter