సింహపురి సమాచారం

నా పేరు మెయిన్ రోడ్డు, మాగుంట లే అవుట్. గత 10సంవత్సరాల కాలంలో నేను వూహించని స్థాయిలో నా విలువ పెరిగిపోయింది. ముఖ్యంగా 2006 సంవత్సరం నుండి నాకు కళ రావడం మొదలై అది రోజురోజుకీ పెరిగి బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్డుతో పోల్చి నన్ను పిలవడం మొదలుపెట్టారు. నా పరిధిలోకి మోర్ సూపర్ మార్కెట్టొచ్చింది, లాయర్ పత్రిక ఆఫీసొచ్చింది. బెజవాడ గోపాలరెడ్డి విగ్రహమొచ్చింది, సెలబ్రేషన్ హోటళ్లొచ్చాయి. కెనరా బ్యాంకొచ్చింది. మురళీకృష్ణ…
మాగుంటోళ్ళు... ఒకప్పుడు ఈ మాటంటే వాళ్లెవరో ఎవ్వరికీ తెలియదు. మూడు హాల్లోళ్లు... ఈ పేరు చెబితే ఒక్క నెల్లూరుజిల్లాలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ర్టంలో కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గుర్తుకు వస్తాడు. తన కీర్తితో మాగుంట ఇంటి పేరు తెలియని వాళ్లే లేరు అన్న స్థాయిలో ఆ కుటుంబ ప్రతిష్టను పెంచాడు సుబ్బరామరెడ్డి. కృష్ణ, కావేరి, కళ్యాణి పేరుతో మూడుహాళ్ళకు రాఘవ సినీ కాంప్లెక్స్ అని తన తండ్రి పేరు…
జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గంకు ప్రత్యేకత వుంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధి, పథకాల వంటివాటికంటే కూడా ఎమ్మెల్యే తమకు ఎంత దగ్గరగా వున్నాడనేదానికే ప్రాధాన్యతనిస్తారు. ఏడాదికి ఒకట్రెండుసార్లయినా అలా ఊర్లోకి వచ్చి ఏం ఎలమందయ్యా, ఏం కొండయ్యా అంటూ భుజాల మీద చేతులు వేసి పలుకరిస్తుంటే చాలు. ప్రజలు పులకించిపోతారు. మళ్లీ ఎన్నికలకు కూడా ఆ ఎమ్మెల్యేకే ఓట్లను ఎత్తిపెడతారు. ఈ టెక్నిక్ బాగా వాడినవాడు, ఉపయోగించుకున్నవాడు వెంకయ్యనాయుడు. కాబట్టే ఎలాంటి…
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సిపిఐ, తెలుగుదేశం వంటి పెద్ద పార్టీలకే కాదు లోక్ సత్తా వంటి చిన్న పార్టీలకు కూడా నెల్లూరుజిల్లా పార్టీ కార్యాలయాలున్నాయి. పార్టీ ఆఫీసు ఐదంతస్తుల మేడలో వుందా, లేక పెంకుటింట్లో వుందా అన్నది ఎవరూ చూడరు. జిల్లా పార్టీ ఆఫీసు వుందా, లేదా అన్నదే ముఖ్యం. ఈరోజు రాష్ర్టంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిన్నది కాదు. ప్రధాన ప్రతిపక్షం. సభ్యుల సంఖ్యలో దాదాపు అధికార పక్షానికి…
నిన్న మొన్న జరిగినట్లుగావున్నాయి... ఆనాడు జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందే ఇంకా కనబడుతున్నాయి... నగరపాలక సంస్థ ఎన్నికలు... వైకాపాకు మెజార్టీ డివిజన్ లు... ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడం... వైకాపా కార్పొరేటర్లతో ఊటీ, బెంగుళూరులలో క్యాంపులు పెట్టడం, మేయర్ గా అజీజ్ ఎన్నిక.... ఆ తర్వాత ఆయన తెలుగుదేశంపార్టీలో చేరడం... అయితే ఇవన్నీ జరిగి అప్పుడే ఏడాదైంది. కాలం గిర్రున తిరిగిపోయింది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో చేసిన అప్పుల…
నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటి ఆలోచనలకు మళ్లీ ప్రాణం వచ్చింది. రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా నుడాపై చర్చ జరుగుతుంది. కలెక్టర్ గా శ్రీకాంత్ ఉన్నప్పుడు దీనిపై కసరత్తు చేసారు. 33మండలాలలను కలిపి నెల్లూరు అర్బన్ డెవలప్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ సమయంలో నుడా ఛైర్మెన్ పదవి కీలకంగా మారి, ఈ పదవిపై అధికార పార్టీ నాయకులు మనసు పారేసుకున్నారు. అయితే…
సుదీర్ఘాకలం పాటూ తెలుగుదేశంపార్టీని నమ్ముకున్నందుకు బీద సోదరులకు పార్టీలో తగిన గుర్తింపు లభించింది. జిల్లా తెదేపాలో ఈఱోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత బీద సోదరులే కీలకనాయకులు. చంద్రబాబు వారిని ప్రత్యేకంగా గుర్తిస్తుండడం విశేషం. బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రలు ఇప్పుడు పార్టీలో కీలకపాత్రల్లో ఉన్నారు. జిల్లాలో ఇంతవరకు బెజవాడ, మాగుంట, ఆనం, మేకపాటి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రెడ్ల రాజకీయ కుటుంబాలే ఉండేవి. బలహీనవర్గాల నుండి ఒక్క…
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడారు. జెండాలు మోసారు. జిందాబాద్ లు కొట్టారు. బ్యానర్లు కట్టారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టారు. ధర్నాలంటే ఎర్రటి ఎండలో వచ్చారు. బైక్ ల ర్యాలీ అంటే జేబులో డబ్బులతో పెట్రోల్ పోసుకుని వచ్చారు. తెలుగుదేశం పార్టీ మీద గుండెల నిండా అభిమానం నింపుకుని పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉందన్న ఆనందమే లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చాక…
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న పటిష్టచర్యల్లో భాగంగా, ఆయా రీచ్ లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 32ఇసుకరీచ్ లు వుండగా అందులో ముఖ్యమైన పొట్టేపాళెం, పల్లెపాళెం ఇసుకరీచ్ ల వద్ద ప్రయోగాత్మకంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసారు. ఇక్కడ 6సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా పెట్టారు. ఈ ప్రాంతంలో రోడ్డు మార్గాన వచ్చే ఇసుక రవాణాకు సంబంధించిన…
Page 9 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter