సింహపురి సమాచారం

రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వందరోజులు దాటింది. ప్రభుత్వమూ, పరిపాలన అన్నాక అభివృద్ధిలో కొంతన్నా మార్పు కనిపించాలి. అభివృద్ధి పరంగా ఒక అడుగన్నా ముందుకు పడాలి. నెల్లూరుజిల్లాలో అలాంటి వాతావరణమేమీ లేదు. నెల్లూరుజిల్లాలో అసలు పరిపాలన లేనట్లుగానే వుంది. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో జిల్లాలో ఎటువంటి పరిస్థితులున్నాయో, రాష్ర్ట విభజన జరిగి రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకా ఒకరకంగా చెప్పాలంటే పరిస్థితి మునుపటికంటే…
నగరాలు, పట్టణాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్నాయి. చెట్లను నిలువునా నరికేస్తున్నారు. కొత్తగా చెట్లను పెంచకపోతే భవిష్యత్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేదానికి ఇప్పుడు కాస్తున్న ఎండలే ప్రత్యక్ష సాక్ష్యం. చెట్లను పెంచాలనే సంకల్పంతో ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని తెరమీదకు తెచ్చింది. నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం క్రింద లక్ష మొక్కలు నాటుతున్నట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. ఒకట్రెండురోజులు ఈ కార్యక్రమంపై హడావిడి చేశారు. ఆయా…
నెల్లూరు నగరపాలక సంస్థలో అధికారపార్టీ సభ్యుల మధ్య కొనసాగుతున్న అంతర్గతపోరుకు తెరపడింది. వీళ్లల్లో వీళ్లు కుమ్ములాడుకోవడం మాని ఇక ప్రతిపక్షంతో కుమ్ములాటకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీలోనే రెండు గ్రూపులున్నాయి. మేయర్ అజీజ్, అతని వెంట వచ్చిన 12మంది కార్పొరేటర్లను ముందు నుండి తెలుగుదేశంలో వున్న కార్పొరేటర్లు అంటరాని వారి మాదిరిగా చూడసాగారు. తమకే మాత్రం సమాచారం లేకుండా అజీజ్ ను ఆయన…
అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిపై ప్రకటన చేస్తూ రాష్ర్టంలోని 13జిల్లాలకు జిల్లాల వారీగా కొన్నేసి వరాలు కురిపించాడు. తాను సీఎం అయ్యింది మొదలు నెల్లూరుజిల్లాను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు ఈ వరాల విషయంలో కూడా అదే దృష్టితో వెళ్లాడు. నెల్లూరుజిల్లాకు ఆయన ఇచ్చిన కొన్ని హామీలను చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాదు. జిల్లాలో దుగరాజపట్నం పోర్టును ప్రస్తావించారు. ఈ పోర్టు గత యూపిఏ ప్రభుత్వంలోనే మంజూరై…
జిల్లాలో ఇప్పటికే మూడు జాతీయ రహదారులున్నాయి. చెన్నై – కలకత్తా జాతీయ రహదారితో పాటు నెల్లూరు-ముంబై, నాయుడుపేట – పూతలపట్టులు జాతీయ రహదారులుగా ఉన్నాయి. ఎన్ హెచ్ 5ను ఆరులైన్లుగా మారుస్తుండగా, ముంబైరోడ్డు, పూతలపట్టు రోడ్లను నాలుగులైన్లుగా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా జిల్లా మీదుగా మరో జాతీయ రహదారి పోనుంది. చిత్తూరుజిల్లా ఏర్పేడు నుండి నల్గొండ జిల్లా నకిరేకల్ వరకు చెన్నై – బెంగుళూరు హైవేలను కలుపుతూ కొత్త…
అభివృద్ధిలో అధమస్థానం అవినీతిలో ప్రథమస్థానఁ సంపాదించుకున్న నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కి శ్యాంసన్ స్థానంలో కడప మునిసిపల్ కమీషనర్ గా పనిచేస్తున్న ఓబులేశు రానున్నట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషనంటే రిజర్వుబ్యాంకుతో సమానం. ఇక్కడ గతంలో జరిగినంత, ప్రస్తుతం జరుగుతున్నంత అవినీతి బహుశా భారతదేశంలో ఏ కార్పొరేషన్ లోనూ జరగదేమో. ఇక్కడ కోర్టు ఆదేశాలను సైతం లెకక్చేయరు. ప్రజల అవసరాలను పట్టించుకోరు ముఖ్యంగా టొన్ ప్లానింగ్, ఆరోగ్యశాఖ అధికారులైతే నెల్లూరు పోస్టింగ్…
రాజకీయాలలో నేర్పుతో పాటూ ఓర్పు కూడా ముఖ్యం. ఈరోజుతో పాటు రేపు అనేది కూడా ముఖ్యమే. ఆ నేర్పుతో పాటు ఓర్పు కూడా ఉండబట్టే జనంలో బలం లేకపోయినా స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో వుండి ముఖ్యమంత్రి కాగలిగాడు. రాజకీయాలలో ఈరోజు అన్నదానినే కాదు, రేపు ఏంటి అన్న దూరదృష్టి ఉండబట్టే ఉత్తరాది పార్టీ అని ప్రచారంలో వున్న బీజేపీని కనిపెట్టుకుని యం.వెంకయ్యనాయుడు రెండుసార్లు కేంద్రమంత్రి అయ్యాడు.…
హైదరాబాద్ లో ఐఎస్ఐ టెర్రరిజం, కర్నూలుకు ఫ్యాక్షనిజం, కరీంనగర్ కు మావోయిజం ఎటువంటి సమస్యో నెల్లూరు నగరానికి ట్రాఫిక్ అలాంటి సమస్య. నెల్లూరులో ఇది ఎప్పటికీ పరిష్కారం చేయలేని సమస్యే. ఎందుకంటే పెరుగుతున్న ఆటోలను, కార్లను, బస్సులను, బైక్ లను తగ్గించలేం. రోజురోజుకు వాహనాలు పెరిగిపోతున్నాయని చెప్పి రోడ్లను పెంచలేం కదా. ఉన్నరోడ్లను ఇంకా వెడల్పు చేయలేం కదా. పెరిగిపోతున్న ట్రాఫిక్ ను తగ్గించలేం గాని కొంత క్రమపద్ధతిలో పెడితే…
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవిని పట్టుబట్టి సాధించుకున్నాడు అబ్దుల్ అజీజ్. వ్యాపారరీత్యా బాగా స్థిరపడ్డాడు. ఆర్థికంగా లోటులేని మనిషి. కాబట్టి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించాలనే యావ ఉండకపోవచ్చు. కాని నెల్లూరు కార్పొరేషన్ లో ఆయన ఒక్కడే ఇప్పుడు పవర్ పాయింట్ కాదు. ఆయనకంటే ప్రధానమైన పవర్ సెంటర్ గా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నాడు. సొంత జిల్లా మంత్రి పురపాలక శాఖను నిర్వహిస్తుండడం ఆయనకు కొంత…
Page 10 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter