సింహపురి సమాచారం

ఒక అడవిలో నక్క కంట్లో నలుసుపడి కాళ్లో ముల్లుగుచ్చుకుని మూలుగుతూ తాటిచెట్టు క్రింద కూర్చుంది. అప్పుడే ఓ పండిన తాటికాయ దాని తలపై పడింది. నక్క బాధ ఎక్కువైంది. ఒకటికి మూడుచోట్ల నొప్పు లయ్యాయి. ఇంతలో తాటికాయల గెల తెగి దీనిమీద పడింది. ఆ దెబ్బకు నక్క యమలోకం ఎంట్రన్స్‌ దాకా వెళ్లిపోయింది. అంటే కోమా స్టేజ్‌ అన్నమాట... ఈసారి ఏకంగా తాటిచెట్టే కూలి దాని మీద పడింది. కోమా…
నెల్లూరు నగరం మళ్ళీ ఒక మురుగు దిబ్బగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కంపే. ఏ రోడ్డు చూసినా చెత్తే. చెత్తకుప్పలు, మురుగు వాసన.. నెల్లూరుకు కొత్తేమీ కాకపోయినా పారిశుద్ద్య కార్మికుల ఆందోళనతో ఆ దుర్వా సన మరింత పెరిగింది. ప్రధాన రోడ్లతో సహా అన్ని రోడ్లు చెత్తాచెదా రంతో నిండిపోతుండడంతో నగరం కుళ్ళుకంపు కొడుతోంది. ఇళ్ళ నుంచి నేరుగా చెత్తబండ్లు వచ్చి చెత్త తీసుకుపోతుండడంతో ఇన్నాళ్ళు ఈ బాధ తెలియలేదు.…
నెల్లూరు నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకోవాలంటే పన్నులు ఒక్కటే మార్గం కాదు, ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. సులభంగా దొరుకుతున్నారు కదా అని చెప్పి ప్రజలను పన్నుల రూపంలో పదేపదే బాదుతుంటే కొన్నాళ్లకు వాళ్లు పన్నులు కట్టడం మానేస్తారు. ముఖ్యంగా నగరంలో ఎన్నో రిజర్వ్‌ స్థలాలున్నాయి. వాటిలో కొన్నింటిని పెయిడ్‌ పార్కింగ్‌ జోన్‌లుగా మార్చొచ్చు. దీనివలన నగరపాలక సంస్థకు ఆదాయమే కాక నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు కొంత పరిష్కారం చూపినట్లు కూడా…
నువ్వు దొంగ... కాదు నువ్వే దొంగవు... అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు నీవే... నాకంటే ఎక్కువ తవ్వకాలు నీవే... ఇదీ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అధికారపక్ష, విపక్షాల మధ్య ఇక్కడ గ్రావెల్‌ యుద్ధం ముమ్మరంగా జరుగుతోంది. నాయకుల పరస్పర విమర్శలతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో గ్రావెల్‌ క్వారీలు ఎక్కువుగా వున్న ప్రాంతాల్లో వెంకటాచలం మండలం ఒకటి! కొన్నేళ్ల క్రితం గ్రావెల్‌కు పెద్దగా విలువ వుండేది కాదు. జాతీయ…
ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం స్వచ్ఛభారత్‌. చాలావరకు ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సూత్రధారి, కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు మన నెల్లూరోడే! రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే మున్సిపల్‌ మంత్రి నారాయణ మన నెల్లూరోడే! స్వచ్ఛభారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎస్‌.పి.బాల సుబ్రహ్మణ్యం మన నెల్లూరీయుడే! ఇంతమంది స్వచ్ఛ నాయకులు, గాయకులున్నా నెల్లూరును మాత్రం స్వచ్ఛంగా ఉంచడంలో విఫలమవుతున్నారు. ఇందులో ప్రధాన బాధ్యతారాహిత్యం…
ఏ పనన్నా సమర్ధవంతంగా పూర్తి చేయాలంటే ధైర్యమన్నా ఉండాలి, పక్కా ప్లానింగ్‌ అన్నా ఉండాలి. దురదృష్టం... మన పాలకుల వద్ద ఆ రెండూ లేకుండా పోయాయి. నెల్లూరు నగరంలో ఆక్రమ ణల తొలగింపు మళ్లీ వాయిదా పడింది. అదేదో పనికి ఆషాఢం సొడ్డు దొరికినట్లు, ఆక్రమణలు తొలగించడానికి మన వాళ్లకు పండుగలు అడ్డొచ్చాయి. 2015 నవంబర్‌లో వచ్చిన వరద లకు నెల్లూరు నగరంలో పలు కాలనీలు ముంపుకు గురికాగా, ముఖ్యమంత్రి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యాన ఆక్రమణల తొలగింపుపై ఏపి ప్రభుత్వం కూడా కళ్లు తెరిచింది. ఏడాది క్రితం గుర్తించిన ఆక్రమణలను తొలగించాలని తాజాగా రెండోసారి నిర్ణయించింది. ఇటీవల భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ముంపుకు కారణం కాలువలను ఆక్రమించి పెద్దపెద్ద భవనాలను కట్టడమేనని గుర్తించిన కేసీఆర్‌ ఆక్రమణలను చాలావరకు కొట్టించాడు. హైదరాబాద్‌లో ఆక్రమణలను కూలగొట్టే సరికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్‌ మంత్రి నారాయణలలోనూ కదలిక…
బండికి ముందు గడ్డి మోపును కడితే... ఎద్దులు ఆ గడ్డిని తినాలన్న ఆత్రుతతో పరుగెడుతుంటాయి. బండి స్పీడ్‌గా ముందుకు పోతుంటుందేగాని ఎద్దులకు మాత్రం ఆ గడ్డి అందదు. బండిని వేగంగా పోనివ్వడానికి, ఎద్దులను పరుగెత్తించడానికి ఇదొక లాజిక్‌ అన్నమాట! చంద్రబాబునాయుడు నామినేటెడ్‌ పదవుల విషయంలో ఈ లాజిక్‌ను బాగానే ఫాలో అవుతున్నట్లుగా వుంది. 2014లో చంద్రబాబు సిఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సంక్రాంతులు, రెండు ఉగాదులు, మూడు…
నెల్లూరు నగరపాలక సంస్థ అవినీతికి అన్నగా అక్రమాలకు తమ్ముడిగా మారిందన్నది నగ్నసత్యం. ఇక్కడ పాలకులకు వ్యాపారం తప్పితే పరిపాలనపై శ్రద్ధలేదు. అసలు పరిపాలనపై దృష్టి కూడా లేదు. నెల్లూరు నగరాన్ని పాడి ఆవుగా చూస్తున్నారు. ఎంత మేరకు పిండుకోవాలన్నదానిపైనే మనసు లగ్నం చేశారు. కార్పొరేషన్‌నే ఒక వ్యాపార సంస్థగా మార్చి ఇక్కడే కలెక్షన్‌ సెంటర్‌లు పెట్టేసినట్లుగా వుంది పరిస్థితి. ఈ అక్రమాల పరాకాష్టకు ఈ నెల 19వ తేదీన జరిగిన…
Page 4 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter