సింహపురి సమాచారం

రాష్ట్రంలో అత్యుత్తమ సేవలందిస్తున్న సెజ్‌ శ్రీసిటీ అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రశంసించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నేతృత్యంలో 70 మంది అసెంబ్లీ బృంద సభ్యులు బుధవారం శ్రీ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, సహజంగా సెజ్‌లంటే చాలామందిలో రియల్‌ఎస్టేట్‌ అనే దురభి ప్రాయం వుండేదని, శ్రీసిటీతో అలాంటి అభిప్రాయం తొలగిపోయిందన్నారు. శ్రీసిటీ ప్రగతికి బాటలు వేసిన శ్రీనిరాజు, రవీంద్ర సన్నారెడ్డిలను ఆయన అభినందించారు.…
ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరులో అశాంతి జాడలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఎక్కడో చోట దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. దొంగలకు, దోపిడీదార్లకు ఏ కోశానా భయం లేకుండా పోయింది. సందు చూసుకుని తమ పని కానిచ్చేస్తున్నారు. దీనికి కారణం పోలీసుల నిఘా నిస్తేజంగా వుండడమే! పోలీసుల రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే వుంటున్నాయి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు…
నా పేరు మెయిన్ రోడ్డు, మాగుంట లే అవుట్. గత 10సంవత్సరాల కాలంలో నేను వూహించని స్థాయిలో నా విలువ పెరిగిపోయింది. ముఖ్యంగా 2006 సంవత్సరం నుండి నాకు కళ రావడం మొదలై అది రోజురోజుకీ పెరిగి బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్డుతో పోల్చి నన్ను పిలవడం మొదలుపెట్టారు. నా పరిధిలోకి మోర్ సూపర్ మార్కెట్టొచ్చింది, లాయర్ పత్రిక ఆఫీసొచ్చింది. బెజవాడ గోపాలరెడ్డి విగ్రహమొచ్చింది, సెలబ్రేషన్ హోటళ్లొచ్చాయి. కెనరా బ్యాంకొచ్చింది. మురళీకృష్ణ…
మాగుంటోళ్ళు... ఒకప్పుడు ఈ మాటంటే వాళ్లెవరో ఎవ్వరికీ తెలియదు. మూడు హాల్లోళ్లు... ఈ పేరు చెబితే ఒక్క నెల్లూరుజిల్లాలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ర్టంలో కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గుర్తుకు వస్తాడు. తన కీర్తితో మాగుంట ఇంటి పేరు తెలియని వాళ్లే లేరు అన్న స్థాయిలో ఆ కుటుంబ ప్రతిష్టను పెంచాడు సుబ్బరామరెడ్డి. కృష్ణ, కావేరి, కళ్యాణి పేరుతో మూడుహాళ్ళకు రాఘవ సినీ కాంప్లెక్స్ అని తన తండ్రి పేరు…
జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గంకు ప్రత్యేకత వుంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధి, పథకాల వంటివాటికంటే కూడా ఎమ్మెల్యే తమకు ఎంత దగ్గరగా వున్నాడనేదానికే ప్రాధాన్యతనిస్తారు. ఏడాదికి ఒకట్రెండుసార్లయినా అలా ఊర్లోకి వచ్చి ఏం ఎలమందయ్యా, ఏం కొండయ్యా అంటూ భుజాల మీద చేతులు వేసి పలుకరిస్తుంటే చాలు. ప్రజలు పులకించిపోతారు. మళ్లీ ఎన్నికలకు కూడా ఆ ఎమ్మెల్యేకే ఓట్లను ఎత్తిపెడతారు. ఈ టెక్నిక్ బాగా వాడినవాడు, ఉపయోగించుకున్నవాడు వెంకయ్యనాయుడు. కాబట్టే ఎలాంటి…
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సిపిఐ, తెలుగుదేశం వంటి పెద్ద పార్టీలకే కాదు లోక్ సత్తా వంటి చిన్న పార్టీలకు కూడా నెల్లూరుజిల్లా పార్టీ కార్యాలయాలున్నాయి. పార్టీ ఆఫీసు ఐదంతస్తుల మేడలో వుందా, లేక పెంకుటింట్లో వుందా అన్నది ఎవరూ చూడరు. జిల్లా పార్టీ ఆఫీసు వుందా, లేదా అన్నదే ముఖ్యం. ఈరోజు రాష్ర్టంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిన్నది కాదు. ప్రధాన ప్రతిపక్షం. సభ్యుల సంఖ్యలో దాదాపు అధికార పక్షానికి…
నిన్న మొన్న జరిగినట్లుగావున్నాయి... ఆనాడు జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందే ఇంకా కనబడుతున్నాయి... నగరపాలక సంస్థ ఎన్నికలు... వైకాపాకు మెజార్టీ డివిజన్ లు... ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడం... వైకాపా కార్పొరేటర్లతో ఊటీ, బెంగుళూరులలో క్యాంపులు పెట్టడం, మేయర్ గా అజీజ్ ఎన్నిక.... ఆ తర్వాత ఆయన తెలుగుదేశంపార్టీలో చేరడం... అయితే ఇవన్నీ జరిగి అప్పుడే ఏడాదైంది. కాలం గిర్రున తిరిగిపోయింది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో చేసిన అప్పుల…
నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అధారిటి ఆలోచనలకు మళ్లీ ప్రాణం వచ్చింది. రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా నుడాపై చర్చ జరుగుతుంది. కలెక్టర్ గా శ్రీకాంత్ ఉన్నప్పుడు దీనిపై కసరత్తు చేసారు. 33మండలాలలను కలిపి నెల్లూరు అర్బన్ డెవలప్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ సమయంలో నుడా ఛైర్మెన్ పదవి కీలకంగా మారి, ఈ పదవిపై అధికార పార్టీ నాయకులు మనసు పారేసుకున్నారు. అయితే…
సుదీర్ఘాకలం పాటూ తెలుగుదేశంపార్టీని నమ్ముకున్నందుకు బీద సోదరులకు పార్టీలో తగిన గుర్తింపు లభించింది. జిల్లా తెదేపాలో ఈఱోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత బీద సోదరులే కీలకనాయకులు. చంద్రబాబు వారిని ప్రత్యేకంగా గుర్తిస్తుండడం విశేషం. బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రలు ఇప్పుడు పార్టీలో కీలకపాత్రల్లో ఉన్నారు. జిల్లాలో ఇంతవరకు బెజవాడ, మాగుంట, ఆనం, మేకపాటి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రెడ్ల రాజకీయ కుటుంబాలే ఉండేవి. బలహీనవర్గాల నుండి ఒక్క…
Page 7 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
 • నంద్యాల 'ఉప'ద్రవం!
  కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
 • అన్నదాతను ముంచిన అకాలవర్షం
  వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
 • బాబుకు పమ్రాద సంకేతాలు!
  అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
 • న(వ)మో భారత్‌
  భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter