సింహపురి సమాచారం

రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, నెల్లూరుజిల్లా వాడు. నెల్లూరు కేంద్రంగా ఎదిగినోడు. కాబట్టి నెల్లూరుపై కొంతలో కొంతన్నా అభిమానముంటుందనుకోవచ్చు. మంత్రి జిల్లాకు పరిమితం కాదు, అతనికి రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఒక్కటే అనే వాదనలోకి పోయినా ప్రతి మంత్రి కూడా తన శాఖ పరిధిలో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత నిస్తుంటారు. కాని పురపాలక శాఖ మంత్రి నారాయణలో మాత్రం నెల్లూరు నగరం అభివృద్ధి పట్ల ఆ చిత్తశుద్ధి ఏ…
జిల్లాలోకల్లా తెలుగుదేశంపార్టీ బల హీనంగా వుండేది నెల్లూరు నగరంలోనే! ఏ జిల్లా ప్రధాన కేంద్రంలోనూ ఆ పార్టీ ఇంత చచ్చుగా లేదు. ఇది ఒక రకంగా చంద్రబాబు పుణ్యమే. పార్టీ ఇంత అవతా రంగా వుంటే దీనికి ఇప్పుడు వర్గపోరా టాలు, ఆధిపత్య పోకడలు ఎక్కువయ్యాయి. నగరంపై పట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లుంటున్న నేపథ్యంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంపై పెత్తనం కోసం మేయర్‌గా అజీజ్‌ ఓ పక్క,…
జిల్లాలో ఎక్కడ చూసినా మాయదారి జ్వరాలే. ఈ జ్వరాలతో సామాన్య జనం నానా బాధలు పడుతున్నారు. ఆసుపత్రులన్నీ జ్వరగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. అయినా, ప్రభుత్వ వైద్యసిబ్బంది తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. ముఖ్యంగా, నెల్లూరు నగరంలో ఈ వైరల్‌ ఫీవర్స్‌ జనాన్ని మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి వీధినా ఈ జ్వరాలతో వణికిపోయేవారి సంఖ్య గణనీయంగానే వుంటోంది. నగరంలో ఎక్కడ చూసినా మురుగుదిబ్బలు, చెత్తా చెదారాలు పేరుకుని, దోమలు విపరీతంగా ప్రబలిపోయి నానా రోగాలకూ…
భారతదేశంలో రేషన్‌కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులు వంటి సబ్సిడీ పథకాలకు తప్ప జీవనోపాధికి ప్రభుత్వాల మీద ఆధార పడడం చాలాతక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగా వుంటాయి. ఇటీవల ప్రైవేటీకరణ జోరుతో వున్న అరకొర ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రిక్షా తొక్కడం నుండి టీకొట్టు మొదలుకొని పెద్దపెద్ద వ్యాపారాల వరకు స్వయం ఉపాధి కల్పించుకోవడానికే ప్రజలు శ్రమ పడుతుంటారు. ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా తమ బ్రతుకు మార్గాన్ని తామే వెతుక్కుంటుంటారు. అది…
దక్షిణ మధ్య రైల్వే శాఖ కొత్త రైల్వే టైంటేబుల్‌ను ఇటీవల ప్రకటించింది. మిగతా ట్రైన్‌ల టైంతో నెల్లూరోళ్లకు ఇబ్బంది లేదుగాని ఒక్క సింహపురి ఎక్స్‌ ప్రెస్‌ టైమే కరెక్ట్‌గా లేదు. ఇది రాత్రి 10.10గంటలకు గూడూరులో బయలు దేరి 10.40గంటలకు నెల్లూరొచ్చేది. తెల్లారి ఉదయం 8.45గంటలకు హైదరా బాద్‌ చేరుకునేది. దాదాపు ప్రతిరోజూ గంటన్నా ఆలస్యంగా ఈ ట్రైన్‌ హైదరా బాద్‌కు పోతుండేది. హైదరాబాద్‌లో ఏదన్నా పని మీద పోయేవాళ్లకు…
గూడూరు నుంచి సికిందరాబాద్‌ వెళ్ళే సింహపురి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సమయాన్ని త్వరలో మారుస్తామని రక్షిణ మధ్య రైల్వే డిఆర్‌ఎం అశోక్‌కుమార్‌ తెలిపారు. గత నెల 26న ఆయన నెల్లూరు రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. గతంలో సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరుకు రాత్రి 9.40గంటలకు వచ్చేది. సికింద్రా బాద్‌కు ఉదయం 8గంటలలోపు చేరుకునేది. అయితే మారిన వేళల్లో ప్రస్తుతం సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరుకు రాత్రి 10.40కి రావాల్సి ఉండగా ప్రతిరోజూ ఆలస్యంగా…
టోల్‌ ఫీజుల వసూలుపై వున్న శ్రద్ధ రోడ్ల నిర్వహణపై ఉండడం లేదు. జాతీయ రహదారిపై వాహనాలలో పోతున్నామంటే బండి అదరకూడదు. కాని కాంట్రాక్టర్ల నిర్వహణలోపం కారణంగా జాతీయ రహదారి కూడా అక్కడక్కడా గ్రామీణ రోడ్డును తలపిస్తుంది. జిల్లాలో జాతీయరహదారి నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. టోల్‌ ఫీజులు దండుకోవడం తప్పించి రోడ్లను పట్టించుకోవడం లేదు. గూడూరు, ఓజిలిల మధ్య చెన్నై వెళ్లే రహదారి గతుకులమయంగా వుంది. అక్కడక్కడా ప్యాచ్‌లు వేసి…
ఇప్పుడున్నది ప్లాస్టిక్‌ ప్రపంచం... మనిషి నిద్రలేచింది మొదలు మళ్లీ నిద్రపోయేదాకా ప్లాస్టిక్‌ వాడకానికి బాగా అలవాటు పడ్డాడు. కూరగాయలు తెచ్చే కవర్‌ ప్లాస్టిక్‌... సరుకులు తెచ్చే కవర్‌ ప్లాస్టిక్‌... పాలప్యాకెట్‌ ప్లాస్టిక్‌.. ఆఖరకు హోటల్స్‌లో అన్నం, కూరల ప్యాకింగ్‌ అంతా ప్లాస్టిక్‌తోనే... ప్రతి ఊరిలో పోగయ్యే చెత్తలో సగం ప్లాస్టిక్‌ కవర్లే ఉంటున్నాయి. నెల్లూరును ప్లాస్టిక్‌ రహిత నగరంగా మారుస్తామని నగర పాలక సంస్థ కమిషనర్‌ పివివిఎస్‌ మూర్తి శపథం…
ఎబోలా, ఆంత్రాక్స్‌ వంటివి తప్పితే మిగతా ప్రాణాంతక వ్యాధులన్నీ కూడా నెల్లూరుజిల్లాకు సునాయాసంగా వ్యాపిస్తుంటాయి. ముదురు దోమలు, బలిసిన పందులు కారణంగా ఈ రెండు వ్యాధులు సోకేపనైతే నెల్లూరులో అసలు మనుషులే ఉండేవాళ్లు కాదేమో! ఇంతకుముందు ప్రతి ఏటా ఒక సీజన్‌లో డెంగ్యూ, చికున్‌గున్యా, అతిసార, మెదడువాపు వ్యాధులు నెల్లూరుకు చుట్టంచూపుగా వచ్చి పలకరించిపోతుండేవి. నెల్లూరులో ఆసుపత్రులను నడిపించడానికి, డాక్టర్లను బ్రతికించడానికన్నట్లుగా ఈ రోగాలొస్తుండేవి. ఈ రోగాల మూలంగా డాక్టర్లు,…
Page 8 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter