గ్రామసమాచారం


పాడిపంటల కోస్తా, కరువు పీడిత సీమల సంగమమే నెల్లూరుజిల్లా. ఈ జిల్లాలో సగం ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతుంటే సగం ప్రాంతం కరువు ఛాయలతో వెలవెలపోతుంటుంది. ముఖ్యంగా జిల్లాలోని పడమర వైపు భాగాన్నంతా మెట్టగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కరువు ఎక్కువ. అభివృద్ధి తక్కువ. ఉదయగిరి, సీతారాంపురం, వింజమూరు, మర్రిపాడు, కలువాయి, చేజర్ల, బాలాయ పల్లి, పొదలకూరు, డక్కిలి, సైదాపురం, వెంకటగిరి మండలాలు మెట్టలో కలు స్తాయి. తెలుగుగంగ కాలువలు లేకపో…

Read more...

నెల్లూరుజిల్లా తడ మండలంలోని ఇరకం దీవిని పర్యాటక కేంద్రంగా అభి వృద్ధి పరచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేశాయి. ఇరకం దీవితో పాటు, భీమునివారిపాళెం తదితర పులికాట్‌ పరిస రాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం రూ.26కోట్ల నిధులు మంజూరు చేయగా, ఇదివరకే దీవిలో పర్యాటకశాఖకు 80ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈమేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫి (ఎన్‌ఐరోజీ) కేంద్ర బృందం ఇటీవల సర్వే చేపట్టింది. ఆ…

Read more...

మెట్ట ప్రాంతానికి వరంగా మారిన శ్రీకాళహస్తి - నడికుడి రైల్వేలైన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, చేజర్ల, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో రైల్వే అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా భూసేకరణకు ముమ్మరంగా సర్వే నిర్వహించారు. త్వరలోనే ఈ లైన్‌ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణానికి నెల్లూరుజిల్లాలో రెండువేల ఎకరాల భూములను సేకరిస్తున్నట్లు…

Read more...

నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళ లమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యుల అభినం దన సభ ఈనెల 31వ తేదీ ఉదయం 10.30గంటలకు అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతుంది. ధర్మకర్తల మండలి ఛైర్మెన్‌గా మెట్టు సురేష్‌బాబు, సభ్యులుగా అలిమేలి శ్రీహరి ఆచారి, పూల సుబ్రహ్మణ్యం, శ్రీమతి రావూరి కృష్ణసుధా, ఒట్టూరు సుధాకర్‌, ఉచ్చూరు సురేష్‌, పంట్రంగి వెంకటేశ్వర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా పులికొలను చంద్రశేఖర్‌లు ప్రమాణస్వీకారం…

Read more...

జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి ప్రకృతిపరంగా ఎప్పుడూ శాపమే. శూర్పణఖకు పసుపు కుంకుమ క్రింద రావణాసురుడు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడని పెద్దలు చెబుతుంటారు. అందుకనే ఇక్కడ పెద్దగా వర్షాలు పడవని, పంటలు పండవని చెబుతారు. ప్రకృతి పరంగా ఈ ప్రాంతానికి ఎంతటి శాపముందనేది సోమశిల నీళ్లను చూస్తే తెలుస్తోంది. జిల్లా రైతాంగానికి వరప్రసాదమైన సోమశిల రిజర్వాయర్‌ నీళ్లు 250 కిలోమీటర్ల దూరంలో వున్న చెన్నైకు వెళుతుంటాయి. గట్టిగా 20కిలోమీటర్ల దూరం…

Read more...

నెల్లూరుజిల్లా దగదర్తి మండలంలోని దామవరం వద్ద ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 293కోట్లు దాకా అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు మొదటి దశలో 173కోట్లు ఖర్చవుతాయని లెక్కేసారు. వై.యస్‌. సీఎంగా వున్నప్పుడే దామవరం వద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని తల పెట్టారు. ఈమేరకు 600 ఎకరాల దాకా భూ సేకరణ కూడా జరిగింది. దామవరం వద్ద ఎయిర్‌పోర్టు పెడితే నెల్లూరుజిల్లాతో పాటు ప్రకాశం జిల్లా వాళ్లకు కూడా దగ్గరగా వుంటుందని…

Read more...

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలది విచిత్ర పరిస్థితి. గత ఎమ్మెల్యేలే ఎంతో ఉత్తములు అనిపించే విధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు తయారవు తున్నారు. 1978 నుండి 1984దాకా యం.వెంకయ్యనాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. 1985లో ఎమ్మెల్యేగా వచ్చిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని చూసిన ప్రజలు వెంకయ్యను ఎంతో ఉత్తముడిగా భావించారు. ఆ తర్వాత 1989లో వచ్చిన మాదాల జానకిరాంను చూసి ఇతనికంటే మేకపాటి రాజమోహన్‌రెడ్డే నయమనుకున్నారు. 1994 నుండి…

Read more...


నెల్లూరుజిల్లా ఉదయగిరి కొండ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ పట్టణవాసులతో పాటు కొండ కింద పల్లెల ప్రజలను వణికిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు చిరుత మేకల మంద లపై దాడిచేసి జీవాలను పొట్టన పెట్టుకుంది. ఇటీవల దుర్గంపల్లి సమీపంలో ఏడు మేకలను హత మార్చడంతో గ్రామ ప్రజలు హడలి పోతున్నారు. అటవీశాఖ అధికా రులు కూడా చిరుత సంచరిస్తుం దన్న విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఇరవై, ముప్ఫై ఏళ్ల…

Read more...

సంగం తహశీల్దార్‌ గంటా సుశీల ఇంటిపై ఈ నెల 19వ తేదీన అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోజు ఏకకాలంలో నెల్లూరులోని ఆమె ఇళ్లు, ఆమె బంధువులు, మిత్రు లకు సంబంధించి మొత్తం ఏడు చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటి యాభై లక్షల విలువ చేసే(రిజిస్ట్రేషన్‌ ప్రకారం) స్థలాలు, పొలాల డాక్యు మెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ ప్రకారం వీటి విలువ 8కోట్ల పైనే వుంటుందని…

Read more...


Page 7 of 14

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter