lakshmiనిర్మాతగా, హీరోయిన్ గా, టీవీ ప్రయోక్తగా, ఇలా అన్ని విధాలా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెడుతున్నారు. త్వరలో యుప్ టీవీ ద్వారా మంచు లక్ష్మి కొన్ని వెబ్ సిరీస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో దొంగాట, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త వంటి డిఫరెంట్ సినిమాలు అందించిన వంశీకృష్ణతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యుప్ టీవీ ఇటీవల చాలా చురుగ్గా వెబ్ సిరీస్ అందిస్తోంది. ఈ సిరీస్ కోసం పలువురు సినిమా జనాలను ఎంగేజ్ చేస్తోంది. వాళ్ల అనుభవాన్ని వెబ్ సిరీస్ కు వాడుకుంటోంది. ఇప్పుడు అందులో భాగంగానే మంచులక్ష్మి-వంశీకృష్ణ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టును ఓకె చేసినట్లు వినికిడి. అయితే జోనర్ ఏమిటన్నది ఇంకా తెలియదు. ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా వుంటుందని మాత్రం తెలుస్తోంది. 

lakshmiకలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల తనయ, లేడీ కంచు... మంచు లక్ష్మి. ఆమె గత కొంతకాలంగా జెమిని టివిలో ‘మేము సైతం’ అనే పోగ్రామ్ చేస్తున్నారు. ఆ పోగ్రామ్ కు సినీ సెలబ్రెటీలను అందరినీ పిలుస్తూ వస్తున్నారు. ఆ షో గురించి ఆమె తన పుట్టిన రోజు సందర్బంగా మీడయాతో మాట్లాడుతూ… దాదాపు అందరినీ నా షోకి పిలిచాను. రాని వాళ్ళు చాలామందున్నారు. కొందరు వస్తామని చెప్పి రానివాళ్లున్నారు. ఎందుకో వాళ్ళు మీరు మీలా ఉండండి అంటే భయపడతారు. రానివాళ్ళకి సహాయం చేసే అదృష్టం లేదనే అనుకుంటాను అని చెప్పుకొచ్చారామె. ఇక పలానా సెలబ్రటీ షో చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. వాళ్ళతోనే చేయాలి అని అనుకోలేదు. సహాయం ఎవరు చేసినా సంతోషమే. నా షోకి వచ్చిన వాళ్లంతా షో పూర్తయ్యాక ఇస్తామన్న టైమ్ కి డబ్బులు ఇచ్చేశారు. అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు అని చెప్పుకొచ్చారామె.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter