reetu varma'పెళ్లి చూపులు' సినిమా ద్వారా దానికి పని చేసి ప్రతి ఒక్కరి కెరీర్‌ మలుపు తిరిగింది. హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమా తర్వాత ఎంత బిజీ అయ్యాడో తెలిసిందే. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కు కూడా మంచి ఆఫర్లు చేతికొచ్చాయి. సంగీత దర్శకుడు.. ఛాయాగ్రాహకుడు కూడా దర్శక నిర్మాతల కళ్లల్లో పడ్డారు. వాళ్లకూ మంచి అవకాశాలు అందుతున్నాయి. ఈ సినిమాలో ఇండివిడువల్‌ గా ఎదగాలని ఆశపడే అమ్మాయి పాత్రలో చక్కటి అభినయం ప్రదర్శించిన రీతూ వర్మకు కూడా మంచి అవకాశాలే అందుతున్నాయి. ఆమె ఆల్రెడీ అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న 'గూఢచారి'లో కథానాయికగా నటిస్తోంది. ఇంకా రెండు మూడు అవకాశాలు చేతిలో ఉన్నాయి.వీటన్నింటికంటే మించిన బంపర్‌ ఆఫర్‌ ఇప్పుడు రీతూను వరించింది. తమిళ సూపర్‌ స్టార్‌ విక్రమ్‌ సరసన ఆమె నటించబోతోంది. అది కూడా గౌతమ్‌ విూనన్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో. విక్రమ్‌ హీరోగా.. గౌతమ్‌ 'ధృవ నక్షత్రం' అనే స్పై థ్రిల్లర్‌ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు అను ఇమ్మాన్యుయెల్‌ ను కథానాయికగా అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో రీతూను అవకాశం వరించినట్లు సమాచారం. 'పెళ్లిచూపులు' సినిమాను తమిళంలో తన నిర్మాణంలో రీమేక్‌ చేస్తున్న గౌతమ్‌.. ఆ సినిమాలో రీతూ టాలెంట్‌ చూసి ఫిదా అయిపోయి ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్‌ లాంటి స్టార్‌ సరసన సినిమా అంటే రీతూ దశ తిరిగినట్లే.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter