lawyer

వార్త     -        విలువలపై ఆయనా మాట్లాడేది   -జగన్ పై చంద్రబాబు ధ్వంజం.

వ్యాఖ్య  -        మరి మీరు మాట్లాడొచ్చా

వార్త     -        ఎన్నికలకు ఒంటరిగా వెళదాం.   -టీ-కాంగ్రెస్నేతల అభిప్రాయం.

వ్యాఖ్య  -        పొత్తుంటే సగం టిక్కెట్లు రావనా.

వార్త     -        బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది.

వ్యాఖ్య -        బీసీలనేంటి, దేశాన్నే మోసం చేసారు.

వార్త     -        కొత్తపార్టీలతో ఒరిగేదేమీ లేదు ఉండదు. – కేంద్రమంత్రి పళ్లంరాజు.

వ్యాఖ్య  -        నూటపాతికేళ్ల వయసున్న ముసలి కాంగ్రెస్ తో మాత్రం ఏం ఒరిగింది.

వార్త     -        భాజపాతోనే సీమాంధ్ర అభివృద్ధి. – వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య  -        విడగొట్టింది అందుకేనా.

వార్త     -        ప్రధానిగా మోడీ అత్యవసరం. – విజయవాడలో యశ్వంత్ సిన్హా.

వ్యాఖ్య -        ఒక గంట కూడా ఓపిక పట్టేట్లు లేరే.

వార్త     -        తెలుగువారిని మళ్లీ ఒక్కటి చేస్తా. – నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

వ్యాఖ్య -        ఎందుకొచ్చిన తలనొప్పి... విడిపోయినట్లే వుండనీయండి.

వార్త     -        మోడీ ప్రధాని కాకుండ లౌకిక శక్తులు అడ్డుకోవాలి. – లాలూ.

వ్యాఖ్య  -        చింత చచ్చినా మీలో పులుపు చావలేదు.

వార్త     -        కొత్త పార్టీలతో కాంగ్రెస్కు నష్టం లేదు. – పనబాక లక్ష్మి.

వ్యాఖ్య -        చచ్చినవాణ్ణి ఇంకెవరూ చంపలేరనేగా...

వార్త     -        తెలంగాణకు దళితుడినే సీఎం చేస్తాం. – జైరాంరమేష్.

వ్యాఖ్య  -        టీ-బిల్లు పెట్టకముందు మీరు ఈ మాట చెప్పివుంటే మీ నాయకులే తెలంగాణ వద్దనేవాళ్లు.

వార్త     -        సీమాంధ్రలో పార్టీ పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. – రాహుల్ తో మంత్రి ఆనం.

వ్యాఖ్య -        ఓ రెండు, మూడు దశాబ్దాలు పట్టొచ్చా.

వార్త     -        కాంగ్రెస్ ను గోదావరిలో కలిపేందుకే జైరాం పర్యటన. – ఉండవల్లి.

వ్యాఖ్య  -        కాంగ్రెస్ మీద గతంలో ఏదన్నా పగ వుందేమో.

పాఠకదేవ్వుళ్ళ పండుగ

పత్రికకు పాఠకులే దేవుళ్ళు. పాఠకుల ఆదరణ, ఆశీస్సులే కొండంత అండ. అందుకే లాయర్ నిర్వహించే ప్రతి వేడుక ఓ పండుగే. పాఠకదేవుళ్ళను ఆరాధించే పవిత్రమైన పండుగ.

కీర్తిశేషులు తుంగా రాజగోపాలరెడ్డి గారి జన్మదినమైన నవంబర్ 8వ తేదీన 1996లో తొలిసారిగా నిర్వహించిన తుంగా పండుగ మొదలు 1997లో స్థానిక పత్రికా ప్రపంచంలోనే ఓ సంచలనంగా జరుపబడిన పాఠకుల పండుగ, నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన నవ్వుల పండుగ, పాత క్రొత్త పాటల మేలికలయికతో అలరించిన పాటల పండుగ, సాక్షూత్తూ నాటి రాష్ర్ట ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి గారే స్వయంగా అరుదెంచి అభినందించి, ఆశీర్వదించిన రజతోత్సవ పండుగ, సరిగమప అంటూ చిట్టి చిన్నారులు తమ గాన మాధుర్యంతో పరవశింపజేసిన సంగీత పండుగ... ఈ పండుగలన్నీ పాఠక మహాశయులను దైవాలకు ప్రతిరూపాలుగా భావించి లాయర్ వారికి అంకితమిచ్చిన ఆనంద సంబరాలే.

లాయర్ పత్రికను అత్యంత అందంగా రూపొందించి అపురూపంగా పాఠకులకు అందించే లాయర్ సిబ్బందికి వస్ర్తాలను బహూకరించడం ఈ పండుగలో ఓ సత్సంప్రదాయం. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఓ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ప్రతి వార్షికోత్సవ పండుగలో ఓ ప్రత్యేకం. 

 

చిరస్మరణీయం రజతోత్సవం

 

పాతికేళ్ళ నిర్విరామ ప్రయాణం, మూడువందల నెలల నిరంతరశ్రమ, పదమూడు వందల వారాల నిస్వార్థకృషికి తార్కాణంగా హృదయోల్లాస ఆనంద సంరంభంగా జరిగింది లాయర్ రజతోత్సవం. ఈ యుగానికే గొప్ప వ్యక్తిగా యావత్ ప్రపంచం కీర్తింపబడిన ఆరణాల అచ్చ తెలుగు బిడ్డ ఆంధ్రరాష్ర్ట ముఖ్యమంత్రి, జనహృదయవిజేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా ఈ వేడుక జరిగింది.

 

లాయర్ తో ఆయనకున్న అనుబంధం, లాయర్ ఆయనకిచ్చిన సలహాలను, పాటించిన సందర్భాల మాటలు ఆయన నోట ముత్యాలలా జారుతుంటే లాయర్ ఆత్మీయుల హృదయం పులకించిపోయింది. ఆంధ్ర సాహితీ ప్రపంచంలోనే ఓ చిన్న పత్రిక చేసిన అతిపెద్ద సాహసంగా చరిత్రకెక్కిన లాయర్ రజతోత్సవ ప్రత్యేక సంచిక వారి అమృతహస్తాలతో ఆవిష్కరించబడి, లాయర్ ని ప్రముఖ వారపత్రికల స్థాయిలో అగ్రగామిగా నిలిపింది. తనకంటూ ఓ సొంత గూటిని ఏర్పాటు చేసుకున్న లాయర్ కార్యాలయాన్ని వై.యస్ సువర్ణహస్తాలతో ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి లాయర్ శ్రేయోభిలాషుల గుండె ఉప్పొంగి పోయింది. లాయర్ చరిత్రలో ఇది ఓ మరపురాని మరువలేని రోజు. లాయర్ ప్రస్థానంలో ఇది ఓ చిరస్మరణీయమైన ఘట్టం.

 

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter