వార్త - అభినవ దుర్యోధనుడు కేసీఆర్. - మంత్రి పల్లె రఘునాథరెడ్డి

వ్యాఖ్య - ఆ పేరుకు కేసీఆర్ కటౌట్ కు సరికాదేమో.

వార్త - పార్టీ మారేవారికి సిగ్గు లేదు. - రఘువీరారెడ్డి

వ్యాఖ్య - అసలు రాజకీయాలకే సిగ్గు లేదు.

వార్త - రైల్వేల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. - వెంకయ్యనాయుడు.

వ్యాఖ్య - దేశ ఆర్థిక పరిస్థితే బాగ లేదులే...

వార్త - రాష్ర్టపతి పదవికి తగిన వ్యక్తి అద్వానీ. - కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ.

వ్యాఖ్య - తదుపరి రాష్ర్టపతిని ఇప్పుడే ప్రకటించేసారన్న మాట.

వార్త - త్వరలో నూతన మద్యం పాలసీ. - మంత్రి రవీంద్ర.

వ్యాఖ్య - ఇంటింటికి మద్యం అని మాత్రం పెట్టకండి.

వార్త - గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి. - చంద్రబాబు

వ్యాఖ్య - నాణ్యమైనది ఇవ్వాలని ఇప్పుడిచ్చేది కూడా లేకుండా చేస్తారేమో.

వార్త - హామీల వల్లే తెదేపా గెలుపు. - అసెంబ్లీలో జగన్.

వ్యాఖ్య - ఆ హామీలను వ్యతిరేకించే మీ ఓటమి.

వార్త     -        కఠిన నిర్ణయాలతోనే ప్రగతి. – ప్రధాని నరేంద్ర మోడీ

వ్యాఖ్య  -        మీరు మరీ అంత కఠినంగా వుంటే ప్రజలు పాలకుల పట్ల ఇంకా కఠినంగా తయారవుతారేమో.

వార్త     -        ఆకాశ హార్మ్యాలతో రాజధాని. – చంద్రబాబుతో రాజధాని కమిటీ భేటీలో చర్చ.

వ్యాఖ్య  -        సింగపూర్ లాంటి రాజధాని అంటే ఇదేనా.

వార్త     -        ఋణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. – సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు.

వ్యాఖ్య  -        ఋణమాఫీ అంటే... కాఫీ తాగినంత సులభం అనుకుంటున్నారా.

వార్త     -        పోలవరం ఆర్డినెన్స్ రద్దుచేయాలి.

వ్యాఖ్య  -        అసలు రాష్ర్ట విభజనే రద్దు చేస్తే పోలా.

వార్త     -        ప్రజలపై పైసా భారం మోపం. – ఆర్థికమంత్రి యనమల.

వ్యాఖ్య  -        అల్లాఉద్దీన్ అద్భుత దీపమేమన్నా దొరికిందా.

వార్త     -        అటవీ సంపదను కాపాడుతాం. – అడవుల మంత్రి బొజ్జల.

వ్యాఖ్య  -        ఇంకేం మిగిలిందని కాపాడ్డానికి.

వార్త     -        తెలుగు భాషాభివృద్ధికి కృషి. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

వ్యాఖ్య  -        ముందు అందరు మంత్రుల చేత సంపూర్ణంగా తెలుగులో మాట్లాడేలా చేయండి.

వార్త     -        ఋణమాఫీకి మేం అనుకూలం కాదు. – ఆర్ బిఐ.

వ్యాఖ్య  -        మీకు ఓట్లతో అవసరం లేదుగా, అలాగే చెబుతారు.

వార్త     -        రాష్ర్టం మధ్యలో రాజధాని – చంద్రబాబు.

వ్యాఖ్య  -        ఈసారి విడిపోయినా ఉమ్మడిరాజధానిగా చేసుకోవచ్చుననా.

వార్త     -        ఏ రాష్ర్టంపైనా వివక్ష ఉండదు. – కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్.

వ్యాఖ్య  -        అలా వివక్ష ఉంటే మీకు సోనియాకు తేడా ఏముంది.

వార్త     -        మీ పాలన విజయవంతంగా సాగాలి. – చంద్రబాబుకు సురవరం లేఖ.

వ్యాఖ్య  -        ఆయన పాలన విజయవంతంగా సాగితే మీకు పనేం ఉంటుంది.

వ్యాఖ్య  -        ఆప్ లో అంతా బాగుంది. – కేజ్రీవాల్

వ్యాఖ్య  -        ఒక్క పార్టీ అధ్యక్షుడి తీరు తప్ప.

వార్త     -        తాత్సారం చేయొద్దు. – రుణమాఫీపై చంద్రబాబుకు జగన్ లేఖ.

వ్యాఖ్య -        ప్రతిపక్షంలో వున్నప్పుడు రాళ్లేయడం సులభమే.

వార్త     -        రెండునెలల్లోగా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే. – కేంద్రమంత్రులకు ఆదేశాలు.

వ్యాఖ్య  -        బినామీ ఆస్తులు కలిపా...

వార్త     -        పేదరికంను పెంచారు. – యూపిఏపై అరుణ్ జైట్లీ విమర్శ.

వ్యాఖ్య  -        ఏదో ఒకటి చేసామనిపించుకున్నారుగా.

వార్త     -        మంత్రి పదవి ఇస్తానంటే నేనే వద్దన్నా. – బాలకృష్ణ.

వ్యాఖ్య  -        ఆయనేదో మొహమాటానికి అడిగి ఉంటే మీరు సీరియస్గా తీసుకున్నట్లున్నారు.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • వైసిపి వైపు నేతల చూపు
    నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter