6 lineఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల, కాణిపాకం, శ్రీపురం, కంచి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్లకు ఈ రోడ్డే ప్రధాన మార్గం. ఏపిలో ప్రతి ఒక్క ఆర్టీసీ డిపో నుండి తిరుమల తిరుపతికి బస్సులు నడుస్తుంటాయి. ఇక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల బస్సులు కూడా ఈ రోడ్డు గుండానే తిరుగుతుంటాయి. ఏపిలోని జిల్లాలన్నింటి నుండి కూడా బెంగుళూరుకు బస్సులు ఈ రోడ్డు గుండానే నడుస్తుంటాయి. ఇక రవాణా లారీలైతే లెక్కేలేదు. రోజుకు కొన్ని వేల వాహనాలు తిరిగే రోడ్డు ఇది. ఎప్పుడో నాలుగు లైన్లుగా మార్చాల్సిన రహదారి. ఇప్పటికి కూడా డబుల్‌ లైన్‌ రోడ్డు మాదిరిగానే వుంది. వాహనాలు పెరిగిపోవడం, రోడ్డు విస్తరించకపోవడం మూలంగా ప్రతిరోజూ ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. అంతేకాదు, ప్రయాణకాలం కూడా గంట పట్టేది రెండు గంటలవుతూ వచ్చింది. ఇప్పుడు కారులో నాయుడుపేట నుండి తిరుపతికి పోవాలంటే ఒకటిన్నర గంట పడుతుంది. ఇంకో ఏడాది తర్వాత వాహనాలు ఇంకా పెరిగి ప్రయాణ కాలం రెండున్నర గంట కూడా కావచ్చు.

ఈ రోడ్డును ఎప్పుడో జాతీయ రహదారుల్లో చేర్చారు. వై.యస్‌. హయాంలోనే నాయుడుపేట - చిత్తూరుజిల్లాలోని పూతలపట్టు మధ్య 220కిలోమీటర్ల రోడ్డును నాలుగులైన్లుగా మార్చాలని నిర్ణయించారు. అయితే ఆ పని అప్పుడు జరగలేదు. తాజాగా 24 అడుగుల వెడల్పున్న ఈ రోడ్డును 90అడుగుల వెడల్పుతో ఆరులైన్లుగా మార్చేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణే త్వరగా చేపట్టాల్సి వుంది. ప్రైవేట్‌ భూములను భారీగానే కొనాల్సి వుంటుంది. కాబట్టి వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తే తర్వాత రోడ్డు వెడల్పు చేయడం సులభమవుతుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter