adalaనెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం చివరి దాకా ప్రయత్నించిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపించాడు. మంత్రి నారాయణ, తనయుడు లోకేష్‌ అండదండలు దండిగా వున్న వాకాటి నారాయణరెడ్డినే అభ్యర్థిగా ఖరారు చేశారు.

పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు నాయకులు కూడా ఆదాల ఎమ్మెల్సీ అయితే నెల్లూరులో మరో పవర్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందని భావించి ఆయనకు సీటు రాకుండా అడ్డుకున్నారు. అదీ కాకుండా ఇప్పటికే జిల్లా నుండి ఎమ్మెల్సీలుగా వున్న నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రలు నెల్లూరులో ఉండేవాళ్లే! కాబట్టి ఆదాలకిస్తే ఆయన కూడా నెల్లూరు చుట్టే తిరిగేవాడు. అదే వాకాటికిస్తే గూడూరు డివిజన్‌ కోటాలోకి వెళతాడు. నెల్లూరుకు రాకుండా ఆ సూళ్లూరుపేట చుట్టుపక్కల తిరుగుతుంటాడు... ఈ కోణంలోనే ఆయనకు అవకాశం వచ్చింది.

మరి వాకాటికన్నా ఆదాల ఎందులో వెనుకబడ్డట్లు? వాకాటి కంటే ముందే పార్టీలోకి వచ్చాడు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకుంటే ఆదాల పోటీ చేసాడు. ఉపఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి దాదాపు 3లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మెజార్టీని ఆ ఎన్నికల్లో 13వేలకు దించాడు. ఒక దశలో మేకపాటిని ఓడించినంత పని చేశాడు. ఎంపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేయబట్టే తెలుగుదేశం కొంతన్నా పటిష్టమైంది. ఆదాల వల్ల తెలుగుదేశం గట్టిపడింది. మరి ఎన్నికల్లో ఓడిపోయాక ఆదాలకు పార్టీ ఏం ఇచ్చింది. రాజ్యసభకు పంపిస్తానన్న చంద్రబాబు హామీ పేలపిండిలాగా గాలికిపోయింది. నెల్లూరు పార్లమెంటుతో పాటు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించారు. వాటి వల్ల అధికారిక హోదా రాదు. చంద్రబాబు ఇస్తానన్న రాజ్యసభపై ఆశలు లేవు. ఈ దశలో ఎమ్మెల్సీ అన్నా ఉంటే బాగుంటుందని ఆదాల భావించారు. అందుకోసమే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులోకి వచ్చాడు. ఈ సీటు తనకు కావాలని బలంగానే పట్టుబట్టాడు. కాని ఈ సీటు వాకాటికి ఎప్పుడో రిజర్వ్‌ చేసి పెట్టారు. లోకేష్‌ వద్దే దీని తంతు ముగిసింది. మొన్న నామినేషన్ల ముందురోజు దాకా ఆదాల పేరును కూడా పరిశీలిస్తున్నట్లు డ్రామా ఆడారు. చివరకు తమ మదిలో వున్న వాకాటి పేరునే బయటపెట్టారు. ఆదాల అడ్డం తిరక్కుండా ఆయనను బుజ్జగిస్తున్నారు. అదేదో నామినేటెడ్‌ పదవికి కూడా ఆశపెట్టారు. ఆదాలకు ఏ పదవి ఆశ చూపినా కూడా ఎమ్మెల్సీ సీటు విషయంలో మాత్రం వాకాటి ముందు ఆయనను చిన్నచూపు చూసినట్లే!

adalaనెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి మంత్రి పి.నారాయణను ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నారన్న వార్తల నేప థ్యంలో అక్కడ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రిస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి పూర్తిగా అలర్ట్‌ అయ్యాడు. రూరల్‌పై తన ముద్ర వేసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇటీవల గ్రామీణ నియోజకవర్గంలో చేస్తున్న విస్తృత పర్యటనలు కూడా రూరల్‌ తన చేజారిపోకుండా ఉం డడం కోసమేనని తెలు స్తోంది.

2014 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుండి ఆదాల ఓడిపోవడం తెలిసిందే! తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓడిపోయిన అభ్యర్థులను ఆయా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. అలాగే ఆదాలను కూడా నెల్లూరు లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ను చేశారు. అయితే ఎందుకూ కొరగాని పదవి. ప్రతి అసెంబ్లీకి అధికారపార్టీ ఎమ్మెల్యే లేదంటే అధికార పార్టీ నాయకుడు ఇన్‌ఛార్జ్‌గానో వుంటే లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ పీకేపనేమీ ఉండదు. అందుకని 2014 ఎన్నికలలో నెల్లూరురూరల్‌ సీటు బీజేపీకి వదిలేసి ఉన్నారు కాబట్టి అక్కడ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. జిల్లాలో వున్న 10 అసెంబ్లీలలో నెల్లూరు రూరల్‌ చాలా కీలకమైంది. ఎక్కువ ఇసుకరీచ్‌లు ఉండేది ఈ నియోజకవర్గ పరిధిలోనే! ఇసుక రీచ్‌ల టెండర్లు జరిగి వుంటే ఆదాల పాత్ర ఇక్కడ చాలా కీలకంగా ఉండేది.

అదీగాక రాబోయే ఎన్నికల పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేం. ఆరోజు ఆదాల పార్లమెంటుకు పోతాడో లేక నెల్లూరు రూరల్‌కే ఉంటాడో... అదీ ఇదీ కాకుంటే పార్టీనే మారాల్సి వస్తుందో ఎవరూ వూహించలేరు. కాని ఒక అసెంబ్లీకి ఇన్‌ఛార్జ్‌గా ఉండడమంటే ఆ సీటుపై కర్చీఫ్‌ వేసి పెట్టుకున్నట్లే లెఖ్ఖ!

రెండేళ్ల నుండి నెల్లూరురూరల్‌ను కనిపెట్టుకుని వుంటే, ఒక్కసారిగా నారాయణ పేరు తెరమీదకు రావడం ఆదాలకు మింగుడుపడలేదు. అందుకే తనదైన శైలిలో చంద్రబాబుకు నిరసన తెలిపి, నెల్లూరురూరల్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు తన చేజారకుండా చూసుకున్నాడు. మరోమారు అధిష్టానం ఇలాంటి ఆలోచన చేయకుండా ఉండేందుకు ఆదాల స్పీడయ్యాడు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలో కార్యక్రమాల పేరిట చురుగ్గా తిరుగుతున్నాడు.

 రాజ్యసభ రెబల్ అభ్యర్థులు చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు సక్రమమే అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదారామ్ ప్రకటించారు .  వారిద్దరి నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చింది. ఈ సందర్భంగా రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ  ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి న్యాయం గెలిచిందన్నారు.
 
తమ నామినేషన్లను తిరస్కరించేందుకు కాంగ్రెస్ పెద్దలు శతవిధాలా యత్నించారని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. తనను, చైతన్య రాజును  గత రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా హింసించారని ఆదాల అన్నారు. తమకు మద్దతు ఇచ్చి నామినేషన్లపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేశారని ఆయన తెలిపారు.  వివరణ లేఖలు ఇవ్వాలంటూ తమను వేధించారన్నారు.
 
రిటర్నింగ్ అధికారిపై కూడా తీవ్ర ఒత్తిడి ఒత్తిడి తెచ్చారని ఆదాల అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని స్క్రూటినీ ప్రక్రియకు రప్పించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల చట్టం నిబంధన 33 ప్రకారం ప్రతిపాదకుల ఉపసంహరణ అంశమే లేదని అన్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter