airplaneఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం చెప్పాడు... త్వరలోనే నెల్లూరులో నుండి విమానం ఎగురుద్దని చెప్పాడు. ఆయన నెల్లూరులో నుండి విమానం టేకాఫ్‌ అవుద్దని చెప్పాడో, లేక నెల్లూరు మీదుగా విమానం పోతుందని చెప్పాడో అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఆయన ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన రెండోరోజే అదే మంత్రి నారాయణను పరామర్శించడానికి నెల్లూరొచ్చిన ఎనర్జీ, పెట్టుబడుల శాఖ మంత్రి అజయ్‌జైన్‌ నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని దామవరం వద్ద మంజూరైన ఎయిర్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు, దీనిని మరో జిల్లాకు తరలిస్తున్నట్లు చెప్పి జిల్లా ప్రజల ఆశలపై నీళ్ళు చల్లాడు.

ఎయిర్‌పోర్టు రద్దుకు భూసేకరణే పెద్ద కారణంగా కనిపి స్తోంది. దామవరం వద్ద ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్‌ భూములు కూడా ఉన్నాయి. ప్రైవేట్‌ భూములకు అధికరేట్లు ఇప్పిస్తామని చెప్పి స్థానిక అధికారపార్టీ నాయకులు ఇక్కడ రైతులను రెచ్చగొట్టారు. దీనికి వాళ్ళు ఎకరాకు ఇంతని చెప్పి ముందుగానే కమిషన్‌ కూడా మాట్లాడుకున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు కోసం సేకరించే భూములకు రైతులు భారీగా నష్టపరిహారాన్ని ఆశించ సాగారు. వారికి నాయకులు కూడా ఆ స్థాయిలో ఆశలు కల్పిం చారు. అదీగాక ఇక్కడ భూముల ఆక్రమణ, రికార్డులు తారుమారు చేయడం వంటి లొసుగులున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణం పెద్ద తలనొప్పిగా మారడంతో రద్దు చేసినట్లు తెలుస్తోంది.

పోర్టు దగ్గర ఎయిర్‌పోర్టా!

కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఎయిర్‌పోర్టు రానుందనే ప్రచారం వూపందుకుంది. నెల్లూరుజిల్లా ఎయిర్‌పోర్టును మరో జిల్లాకు తరలించినట్లు చెప్పారు. వాస్తవానికి నెల్లూరుజిల్లాలో కాకుండా ఇంకే జిల్లాలోనూ ఇప్పటికిప్పుడు ఎయిర్‌పోర్టు అవసరం లేదు. కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం దాకా చూస్తే మూడు ఎయిర్‌పోర్టులున్నాయి. గుంటూరుజిల్లా వాళ్లకు కూడా గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి వద్ద, చిత్తూరు జిల్లాలో రేణిగుంట ఎయిర్‌పోర్టులున్నాయి. కడపలో ఇటీవలే ఎయిర్‌పోర్టును ప్రారంభిం చారు. ఇక కర్నూలుకు ఇప్పుడు ఎయిర్‌పోర్టు పెద్దగా అవసరం లేదు. వాళ్లకు హైదరాబాద్‌ రెండున్నర గంటల ప్రయాణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎయిర్‌పోర్టు అవసరం ప్రధానంగా నెల్లూరుజిల్లాకే వుంది. అదీగాక విశాఖ తర్వాత రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కూడా ఇదే కావడంతో ఎయిర్‌పోర్టు దామవరం వద్ద కాకపోయినా త్వరలో మరో దగ్గర మంజూరయ్యే అవకాశముంది.

aeroనెల్లూరుజిల్లా దగదర్తి మండలం దామవరం వద్ద హైవే పక్కన ఎయిర్‌ పోర్టు... దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసు కున్న కల. ఎయిర్‌పోర్టు కోసం ఇక్కడ భూసేకరణ జరిగింది. సర్వే ముగిసింది, నిధులు మంజూరు కూడా అయ్యాయి. ఇక కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఇక్కడ విమానాలు ఎగరడం మాట అటుంచి అసలు ఎయిర్‌పోర్టే ఎగిరిపో యిందని తెలుస్తోంది. ఎగిరి ఎక్కడికో పోలేదు, నెల్లూరు జిల్లాలోనే ముత్తుకూరు మండలంలో రిలయన్స్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన 2వేల628 ఎకరాల భూముల్లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కాను న్నట్లు సూచాయగా తెలుస్తోంది. దేశం లోనే పెద్ద పోర్టుగా, ఎగుమతులు, దిగు మతులలో దూసుకుపోతున్న కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఒత్తిడితోనే ఎయిర్‌ పోర్టును అక్కడనుండి ఇక్కడకు మార్చినట్లు తెలుస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు అనుసం ధానంగా, పోర్టు వాణిజ్యానికి అనుకూ లంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో పాటు, రిలయన్స్‌ కోసం సేకరించిన భూములు ఎలాగూ ఖాళీగా వున్నాయి కాబట్టి భూ సేకరణ సమస్య కూడా లేకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చ జెండా ఊపారని సమాచారం.

దామవరం వద్ద ఎయిర్‌పోర్టు అయితే నెల్లూరుజిల్లా ప్రయాణీకులతో పాటు ప్రకాశం జిల్లా ప్రయాణీకులకు కూడా అనువుగా ఉండేది. ముఖ్యంగా పడమర మండలాల వారికి చాలా సౌకర్యంగా ఉండేది. దామవరం అయితే హైవేకు పక్కనే ఉండడం, జిల్లాలోని అన్ని వైపుల నుండి హైవేలోకి మంచి కనెక్టివిటీ ఉం డడం వల్ల ప్రయాణీకులకు సులువుగా ఉండేది. ఇప్పుడు రిలయన్స్‌ కోసం సేక రించిన భూముల్లో ఎయిర్‌పోర్టు పెడితే జిల్లాలో అదొక కొసన అవుతుంది. అదీగాక రోడ్డు కనెక్టివిటీ సరిగా లేదు. ఏ ప్రాంతం వాళ్లైనా నెల్లూరు, ముత్తుకూరు రోడ్డు ద్వారా అక్కడికి చేరుకోవాలి. ఇప్పటికే ఆ రోడ్డులో ట్రాఫిక్‌ నరకంగా వుంటుంది. ఇక ఎయిర్‌ పోర్టు పడితే పెరిగే ట్రాఫిక్‌తో అరగంట ప్రయాణం ఒకటిన్నర గంట అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే ఒకటి నిజం... కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఎయిర్‌పోర్టు ఇక్కడ వస్తే ప్రయాణీకుల సౌకర్యం మాట అటుంచి, పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. కృష్ణపట్నం పోర్టుకు ఎయిర్‌ కార్గో పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు రాకపోకలు సాగించ డానికి అనువుగా వుంటే పరిశ్రమలు పెరగవచ్చు. రిలయన్స్‌ భూముల్లో ఎయిర్‌ పోర్టు ఖాయమైతే ముత్తుకూరు రోడ్డులో రియల్‌ భూమ్‌ మళ్ళీ ఒక ఊపు ఊపొచ్చు.

airplaneగత పదేళ్లుగా ముందుకు మూడడుగులు పడితే వెనక్కి నాలుగడుగులు పడుతున్న దగదర్తి విమానాశ్రయ అంకం ఎట్టకేలకు ముందుకు కదిలింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన మూడు విమానాశ్రయాలు భోగాపురం(విజయనగరం), ఓర్వకల్లు(కర్నూలు), దగదర్తి(నెల్లూరు)లకు కేంద్ర పౌరవిమానయాన శాఖ స్క్రీనింగ్‌ కమిటి ఆమోదం తెలిపింది.

నెల్లూరుజిల్లా దగదర్తి మండలంలో దామవరం వద్ద జాతీయ రహదారి వెంబడి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణానికి 1390 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో 840ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో వుంది. ఇక 290 ఎకరాల ప్రైవేట్‌ భూమిని కూడా సేకరించనున్నారు. 88కోట్ల వ్యయంతో పిపిపి పద్ధతిలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నారు. రాష్ట్రంలోనే పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది నెల్లూరుజిల్లానే! విశాఖ-చెన్నై, బెంగుళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లు పూర్తయితే నెల్లూరుజిల్లా పారిశ్రామికంగా ఇంకా ముందుకెళుతుంది. ఈ దశలో జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ ఎంతో అవసరం కావచ్చు. ప్రస్తుతం నెల్లూరు నుండి తిరుపతి, చెన్నైలకు వాహనాలలో వెళ్లి అక్కడనుండి హైదరాబాద్‌, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలకు వెళుతున్న నెల్లూరీయుల సంఖ్య భారీగానే వుంది. తిరుపతి, హైదరాబాద్‌ల మధ్య తిరిగే విమానాలలో సగం మంది నెల్లూరోళ్లే కనిపిస్తుంటారు. ఇక కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌లకు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీ ప్రతినిధులు రాక పోకలు సాగిస్తుంటారు. దగదర్తి ఎయిర్‌ పోర్ట్‌ పూర్తయితే వీరందరికీ ఎంతో అను కూలంగా వుంటుంది.

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter