airtelఅప్పారావు ఆఫీసుకు బయల్దేరాడు. అప్పటికే టైం 10 గంటలు. ఆఫీసుకు పోవాలంటే ఇంకా అరగంట పడుతుంది. బాగా లేటయ్యింది. బాస్‌ ఏమంటాడో ఏమో అనుకుంటూ బైక్‌లో రయ్‌న వస్తున్నాడు. అంతలో ఫోన్‌... నెంబర్‌ తన బాస్‌ నాగేశ్వరావుదే... భయపడుతూనే ఫోన్‌ ఎత్తాడు. ఏం అప్పారావు ఇంకా తెల్లారలేదా... ఆఫీసుకు రేపొస్తావా... అని ఆయన అరుస్తుండగానే ఫోన్‌ కట్‌. అప్పారావు ఫోన్‌లో చూస్తే సిగ్నల్‌ లేదు. ఫోన్‌ను అటూ ఇటూ తట్టి స్విచ్ఛాఫ్‌ చేసి మళ్ళీ ఆన్‌ చేసాడు. అప్పుడు సిగ్నల్‌ కనిపించింది. ఇంతలో మళ్ళీ బాస్‌ నుండి ఫోన్‌... ఎత్తగానే అవతల నుండి... ఏం అప్పా రావు... మాట్లాడుతుంటే ఫోన్‌ కట్‌ చేస్తావ్‌... నేనంటే లెక్క లేదా? ఉద్యోగం అంటే ఇష్టం లేదా... అంతగా ఇష్టం లేని ఉద్యోగం చేయడమెందుకు... అని అరుస్తుండగానే మళ్ళీ ఫోన్‌ కట్‌... అప్పారావులో అలివిగాని టెన్షన్‌... సెల్‌ఫోన్‌ను కనిపెట్టినవాడు ఎదురుగా వుంటే కసకస పొడిచేయాలన్నంత కసి... ఇంతలో మళ్ళీ ఫోన్‌ మోగింది. బాస్‌దే ఫోన్‌. భయపడు తూనే ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి బాస్‌ నాగేశ్వరరావు ఎంతో కూల్‌గా... అప్పారావు నీ సెల్‌ఫోన్‌ ఏ నెట్‌వర్క్‌ అని అడిగాడు. ఎయిర్‌టెల్‌ సార్‌ అని అప్పారావు చెప్పాడు. నాదీ అదే నెట్‌వర్క్‌... నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఫోనే కాదు, నా ఫోన్‌ కూడా కట్‌ అవుతుంది... మనం ఆఫీసు టైమింగ్స్‌నే కాదోయ్‌ ఈ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను కూడా మార్చుకుందాం... ఇది ఎయిర్‌టెల్‌ కాదు... ఎయిర్‌ హెల్‌... అంటూ బాస్‌ ఫోన్‌ పెట్టేసాడు.

ఫోన్‌ అన్నది మనుషుల సమాచార పంపిణీ కేంద్రం. భావాలను సరఫరా చేసే వేదిక. కాని, ఆ ఫోన్‌లే ఇప్పుడు ప్రజలకు బి.పి, దాంతో పాటు షుగర్‌ వంటి రోగాలను తెప్పి స్తున్నాయి. సెల్‌ఫోన్‌లో 2జీ, 3జీ, 4జీలు వచ్చాయని సంబరపడాలో లేక ఛండాలంగా తయారైన నెట్‌వర్క్‌ను చూసి బాధపడాలో వినియోగదారులకు అర్ధం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ ప్రారంభిం చింది ఎయిర్‌టెల్‌. రాష్ట్రంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగివున్న సంస్థ. అలాంటి ఎయిర్‌ టెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పుడు దారుణంగా మారింది. కాల్‌డ్రాప్స్‌ పెరిగాయి. పది ముక్కల్లో వున్న సమాచారాన్ని అవతల వ్యక్తికి చెప్పాలంటే పదిసార్లు కాల్‌ చేయాల్సివస్తోంది. కాల్‌ డ్రాప్స్‌తో సమయం వృధా కావడంతో పాటు బి.పి., టెన్షన్‌లు కూడా పెరుగుతున్నాయి. రోజులో ఎన్నిసార్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ డౌన్‌ అవుతుందో, ఎన్ని ఫోన్‌లు సిగ్నల్‌ పోతాయో, ఎన్నికాల్స్‌ డ్రాప్‌ అవుతాయో చెప్పలేని పరిస్థితి. దీనికితగ్గట్లు ఇంట్లో వుంటే ఫోన్‌ రాదు. బెడ్‌రూమ్‌లో వుంటే సిగ్నల్‌ అందదు. అరకొర సిగ్నల్‌ వుండి కాల్‌ వచ్చిందంటే అవతల వ్యక్తితో మాట్లాడడానికి అదరాబదరా మేడలెక్కాల్సిన పరిస్థితి. ఎయిర్‌టెల్‌ వాళ్ళు వినియోగ దారులను పెంచుకోవడంపై చూపిస్తున్న ఆసక్తి, నెట్‌వర్క్‌ కెపాసిటీ పెంచుకోవడంపై చూపించడం లేదు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ సెల్‌లో మాట్లాడాలంటే ప్రస్తుతం మిద్దెలపైకి ఎక్కాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌ కెపాసిటీ పెంచకుండా వాళ్ళు వినియోగదారులను పెంచుకుంటుంటే... ఇకముందు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో మాట్లాడాలంటే మిద్దెలమీదకు కాకుండా ఎయిర్‌టెల్‌ టవర్‌ల వద్దకు పరుగులు తీయాల్సి వుంటుందేమో! ఇప్పటిదాకా బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెత్త నెట్‌వర్క్‌ అని, సిగ్నల్స్‌ వుండవని పేరుండేది. ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను మంచి అనిపించేంత చెత్తగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ తయారైంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ పుణ్యమా అని మందుల కంపెనీ వాళ్ళు బి.పి మాత్రల ఉత్పత్తిని పెంచుకోవాల్సి వస్తుందేమో...?

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter