akramanఆక్రమణలకు, ఆక్రమణదారులకు అభయహస్తం ఆక్రమణల క్రమబద్ధీకరణ కార్యక్రమం. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఈ సంస్కృతి మొదలుకాగా, నేటి తెలుగు దేశం ప్రభుత్వం కూడా దానిని కొనసాగి స్తోంది. ప్రభుత్వ స్థలాలను, ఇరిగేషన్‌ కాలువల స్థలాలను, ఇతర పోరంబోకు స్థలాలను ఆక్రమించుకుని వున్నారా... వెంటనే క్రమబద్దీక రించుకోండి... ఇదీ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఆఫర్‌.

తాజాగా ఆక్రమణదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటిం చింది. 2014 జనవరికి ముందు ఆక్ర మించుకున్న స్థలాలను క్రమబద్దీకరించు కోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ విడు దల చేసింది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట, ఆత్మకూరు మున్సిపాల్టీల పరిధిలో ఆక్రమణలకు ఈ జి.ఓ వర్తిస్తుంది. 23వ తేదీ నుండి ఆక్రమ ణల క్రమబద్దీకరణ మొదలుపెట్టారు. మొత్తం 10రోజుల్లో ఈ తంతును ముగిం చాలని అధికారులు నిర్ణయించారు. ఆక్రమణదారుల నుండి ఫీజులు వసూలు చేసి తర్వాత వారికి పొజిషన్‌ సర్టిఫికేట్‌లు మంజూరు చేయనున్నారు. నాలుగు రూపా యలు ఖర్చయినా ఆక్రమణదారులకు ఇది ఒక భరోసా.

jcbఏ పనన్నా సమర్ధవంతంగా పూర్తి చేయాలంటే ధైర్యమన్నా ఉండాలి, పక్కా ప్లానింగ్‌ అన్నా ఉండాలి. దురదృష్టం... మన పాలకుల వద్ద ఆ రెండూ లేకుండా పోయాయి. నెల్లూరు నగరంలో ఆక్రమ ణల తొలగింపు మళ్లీ వాయిదా పడింది. అదేదో పనికి ఆషాఢం సొడ్డు దొరికినట్లు, ఆక్రమణలు తొలగించడానికి మన వాళ్లకు పండుగలు అడ్డొచ్చాయి.

2015 నవంబర్‌లో వచ్చిన వరద లకు నెల్లూరు నగరంలో పలు కాలనీలు ముంపుకు గురికాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి పరిశీలించి కాలువలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించడం తెలిసిందే! అప్పట్లో రెండ్రో జులు మంత్రి నారాయణ మిషన్‌లను తెప్పించి హడావిడి చేసాడు. నీ నారా యణ ఆసుపత్రి కూడా కాలువమీదే వుంది, కాబట్టి ముందు నీది పగల గొట్టుకో అని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్‌లు హెచ్చరించేసరికి అసలు ఆక్రమ ణల తొలగింపే అటకెక్కింది. దాదాపు సంవత్సరం పాటు ఈ సబ్జెక్ట్‌ను కదిలించ లేదు. మొన్న హైదరాబాద్‌లో వరదలు రావడం, కాలువల మీద ఆక్రమణలను కేసీఆర్‌ అడ్డంగా పగలగొట్టించడంతో చంద్రబాబుకు నెల్లూరు గుర్తొస్తుంది. మళ్లీ వర్షాల సీజన్‌ వస్తుంది. ఈసారి కూడా నెల్లూరులో సీన్‌ రిపీట్‌ అయితే జనం మనల్ని తిట్టుకుంటారు. వెంటనే ఆక్ర మణల తొలగింపు చేపట్టండని ఆదేశిం చడంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగి పాత మ్యాప్‌లను మళ్లీ ఓపెన్‌ చేసి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 8వ తేదీ రామిరెడ్డి కాలువపై మద్రాసు బస్టాండ్‌ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి మధ్య ఆక్రమ ణలు తీసేయడం మొదలుపెట్టారు. 9వ తేదీకి మళ్లీ సీన్‌ రిపీట్‌! మూలాపేటలోని ఉమామహేశ్వరస్వామి గుడి సమీపంలో ఆక్రమణల తొలగింపును నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ అడ్డుకున్నారు. దీంతో అధికారులు, పోలీసులు ఏమీ చేయలేక వెనుదిరిగారు. 12వ తేదీ దసరా, ఆ తర్వాత రొట్టెల పండుగ వున్నాయి కాబట్టి, ఆ పండుగలు పోయాకే తిరిగి ఆక్రమణలు తొలగింపు చేపట్టాలని నిర్ణయించారు.

12వ తేదీ దసరా, ఆ తర్వాత రోజు నుండి రొట్టెలపండుగనే విషయం మన మంత్రికి, నగర పాలకులకు, అధికారులకు ముందుగా తెలియదా? అదేదో మొదలు పెట్టేది పండుగలు పోయాకే మొదలుపెట్టి ఉండొచ్చు కదా!

అసలు అంతదాకా ఎందుకు.. ఆక్ర మణల తొలగింపుపై చిత్తశుద్ధి ఉండుంటే బాధితులకు ఈ గ్యాప్‌లోనే ప్రత్యా మ్నాయం చూపించి ఉండొచ్చు. నెల్లూరు జంట ఎమ్మెల్యేలు కోరుకునేది కూడా బాధితులకు నీడకల్పించి, మౌలిక వస తులు ఏర్పాటు చేయమనే!

వైయస్సార్‌ నగర్‌లో బాధితు లకు ఇళ్లు ఇస్తామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. ఆ పనేదో కనీసం ఆరు నెలల ముందే చేసి ఉండొచ్చు. అక్కడ రోడ్లు, కరెంట్‌, తాగునీళ్ల వంటి కనీస వస తులు ఏర్పాటు చేసివుంటే ఈరోజు ఆక్రమణల తొలగింపుకు ఎవరూ అడ్డు పడేవాళ్లు కారు.

kaluva akramanaదాహం వేసినప్పుడు బావి తవ్వు కోవడం ప్రభుత్వాలకు అలవాటై పోతుంది. అయితే ఆ విధంగా తవ్వినా ఫర్వాలేదు. కాని తవ్వుతున్నట్లు నటిస్తుం డడంతోనే వచ్చిన ఇబ్బందంతా!

గత యేడాది నవంబర్‌లో వచ్చిన వర్షాలు, వరదలకు నెల్లూరు లోని పలు ప్రాంతాలు మునిగిపోవడం చూసాము. కొన్ని కాలనీలలో అయితే నాలుగురోజుల దాకా తెప్పల్లో వెళ్లి బాధితులకు ఆహారపొట్లాలు, మంచినీళ్లు అందించాల్సి వచ్చింది. ఇంత తీవ్ర పరిస్థితులు తలెత్తడానికి కారణం నగరంలో పంట కాలువల ఆక్రమణలేనని అప్పుడు అధికారులు గుర్తించారు. పంటకాలువల ఆక్రమణలపై అప్పటికప్పుడు 200 మంది దాకా రెవెన్యూ సిబ్బందిని దించి సర్వేలు చేయించారు. పంటకాలువల ఆక్రమణలకు సంబంధించి నగరంలో మార్కింగ్‌ కూడా ఇచ్చారు. ఈ మార్కింగ్‌ ప్రకారం ఆక్రమణలు తొలగిస్తే వేలాది ఇళ్లతో పాటు హోటళ్లు, పలు వాణిజ్య భవనాలు కూడా పోతాయి. పెద్దపెద్ద కాంప్లెక్స్‌ల సంగతి పక్కనపెడితే, బీద, బిక్కి బాధితులకు 5వేల ఇళ్లు కట్టిస్తామని, ఆరునూరైనా ఆక్రమణలు తొలగించి తీరుతామని ఆరోజు మంత్రి నారాయణ గట్టిగానే చెప్పాడు. ఆరోజు మంత్రులు, అధికారుల ప్రకటనలు ఎలా వున్నాయంటే ఒకటి, రెండు వారాల్లో ఆక్రమణల తొలగింపు పూర్తవుతుందన్నట్లు మాట్లాడారు.

ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది. బాధితులకు నీడ కల్పించిన తర్వాతే ఆక్రమణలు తొలగించాలంటూ నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో పాటు మంత్రికి చెందిన నారాయణ మెడికల్‌ కాలేజీ ప్రాంగణమే పంట కాలువను ఆక్రమించి కట్టారనే వివాదం తలెత్తింది. దీంతో అసలు ఆక్రమణల తొలగింపు ఊసే లేకుండా పోయింది. మళ్లీ ఇది గుర్తుకు రావాలంటే నవంబర్‌ వర్షాలు రావాల్సిందే!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • వైసిపి వైపు నేతల చూపు
  నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే…

Newsletter