amaravathiఒక ఊరిలో చంద్రశేఖర్‌, రాజశేఖర్‌ అనే వ్యక్తులుండేవాళ్ళు. చంద్రశేఖర్‌కు ఆర్భాటం ఎక్కువ. ఇంట్లో అప్పులున్నా ఆడంబరాలకు కొదువ ఉండేది కాదు. రాజశేఖర్‌ మాత్రం ఉన్నంతలో జీవించాలనే స్వభావం వున్న మనిషి. తమ ఊరిలో కొత్తగా పెట్టిన ఢమాల్‌ బ్యాంకు వాళ్ళు యువత స్వయం ఉపాధి కోసం ఋణాలిస్తున్నారని తెలిసి చంద్రశేఖర్‌, రాజ శేఖర్‌లిద్దరూ అప్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్‌ చెరో ఐదు లక్షల ఋణం మంజూరు చేసాడు. చంద్రశేఖర్‌ తన కొచ్చిన ఐదు లక్షలతో ఒక కారు కొన్నాడు. దానికి ఆయిల్‌ పోసుకుంటూ రోజూ జల్సాగా తిరిగేవాడు. రాజశేఖర్‌ మాత్రం తీసుకున్న ఋణంతో ఒక ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నాడు. దాని మీద వచ్చిన ఆదాయంతో బ్యాంకుకు నెలసరి వాయిదాలు సక్రమంగా చెల్లించసాగాడు. ఇలా అతని వ్యాపారం వృద్ధి చెందుతూ కొన్నేళ్లలోనే ఒక పెద్ద మాల్‌ నిర్వహించే స్థాయికి వెళ్లాడు. చంద్రశేఖర్‌ మాత్రం జల్సాలకు 5లక్షలు కాజేసి బ్యాంకులకు వాయిదాలు కట్టకపోయే సరికి వాళ్ళు కారు లాక్కుపోవడంతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరగసాగాడు.

ఇది ఒక చిన్న కథ కావచ్చు. కాని, జీవిత సత్యం. మనం ఒకరి నుండి రూపాయి అప్పు తెచ్చుకున్నామంటే దాంతో రెండు రూపాయలు సంపాదించగలిగేలా వుండాలి. అలా సంపాదిస్తేనే అప్పు ఇచ్చిన వాళ్ళకు తిరిగి తీర్చగలం. అమరా వతి రాజధాని నిర్మాణానికి అప్పులివ్వండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరడం చూస్తుంటే పైకథ గుర్తుకు రాక మానదు. అమరావతి రాజధాని అన్నది ఎంతమందికి ఉపయోగపడుతుంది... ఎంత ఆదాయాన్ని పెంచుతుంది? ముఖ్యమంత్రి, మంత్రులు వుండే విలాసవంతమైన భవనాలు కట్టడానికి ప్రజలు అప్పులివ్వాలా? అసలు రాజధానితో ఈ రాష్ట్రంలో ఎంతమందికి పని వుంటుంది. 175మంది ఎమ్మెల్యేలు, 50మంది ఎమ్మెల్సీలు, కొన్ని వేలమంది ఉద్యో గులు... ప్రస్తుతం రాజధాని వీరికే అవసరం. ముందు అక్కడ పరిపాలన సాగడానికి భవనాలు కట్టుకుంటే చాలు. అంతేగాని 50వేల ఎకరాలలో పచ్చటి పంటలు నాశనం చేసి ఇంద్రభవ నాలు కట్టాల్సిన పనిలేదు. అయినా కూడా రాజధాని నిర్మా ణానికి ప్రజలు అప్పులివ్వడమేంటి? రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలి, కేంద్రం ఏపికి తగ్గ రాజధాని కట్టుకో మంటే చంద్రబాబు మాస్కో, టోక్యో, బీజింగ్‌లాంటి రాజధానికి స్కెచ్‌ వేసాడు. కేంద్రం రాజధాని కట్టుకోండంటూ ఇచ్చిన నిధులు ఈయన స్కెచ్‌లు, విదేశీ పర్యటనలకే సరిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోయేసరికి రాజదాని నిర్మాణానికి వాళ్ళు నిధులు ఆపేసారు.

అప్పులు చేసి రాజధాని కట్టడం అవసరమా? ఆర్భాటపు రాజధాని అవసరమా? ఇదెలా వుందంటే అప్పుచేసి పప్పు కూడు అన్నట్లుగా వుంది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో ప్రజల నుండి అప్పులు తీసుకుంటే ఆ నిధులను ఏ సాగునీటి ప్రాజెక్టులకో ఖర్చు చేయాలి. దీనివల్ల సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. తద్వారా రాబడి పెరుగుతుంది. పెద్దపెద్ద భవనాలు కట్టుకుని ఏసిల్లో కూర్చుంటే ఆదాయం ఎలా వస్తుంది.

ఒకవేళ ప్రజలు అప్పులే ఇస్తారు. ప్రభుత్వం బాండ్లు ఇస్తుంది. వారికి తిరిగి చెల్లించే గ్యారంటీ ఏమిటి? తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ లేదు. రేపొచ్చే ప్రభుత్వం ఆర్భాటపు రాజధానిని పట్టించుకోక, అప్పుల క్రింద ఇచ్చిన బాండ్లను పరిగణనలోకి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?

కాబట్టి అప్పుచేసి ఇల్లు కట్టొద్దని పెద్దలెప్పుడో చెప్పారు. అప్పులు చేసి సింగపూర్‌ లాంటి రాజధాని కట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అది అంత అర్జెంట్‌ కూడా కాదు. తాత్కాలికంగా కట్టిన ఆ ఉరుస్తున్న భవనాలలోనే రాష్ట్ర పరి స్థితులు గాడిలో పడేంతవరకు పరిపాలన సాగిస్తే చాలు. బాబు గొప్పలకుపోయి అప్పులుచేస్తే ప్రజలకు తిప్పలు తప్పవు.

assemblyబాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు బాహుబలి-2లో సమాధానం లభించింది. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో ఏం చేస్తున్నాడన్నదానికి ఈ దశాబ్దంలో సమాధానం లభించేటట్లు లేదు. చైనా-భారత్‌ల మధ్యం డోక్లాం, ఇజ్రాయిల్‌-పాలస్తీనాల మధ్య జెరూసలేం సమస్యలకు పరిష్కారం లభించినా కూడా అమరావతి అనే జడపదార్ధం ప్రజలకు అర్ధమయ్యేటట్లు లేదు. అసలు లేని నగరం పేరుతో ఇన్ని డ్రామాలు సృష్టించి, ఇన్ని దేశాలు తిరిగి, ఇన్ని కోట్లు తగలేయడం బహుశా చంద్రబాబుకు ప్రత్యేకంగా తెలి సిన విద్యేననుకోవాలి.

ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీలలో సీరియల్స్‌ వస్తుంటాయి. ఏళ్ల తరబడి సాగుతూనే వుంటాయి. అక్కడ సబ్జెక్ట్‌ ఏమీ ఉండదు. అంతా జీడిపాకంలాగా సాగతీయడమే! ఆ సీరియల్స్‌లో వుండే స్టోరీనే సినిమాగా మలిస్తే రెండు గంటలు... అది కూడా బోనస్‌గా అయిదారు పాటలు పెట్టుకోవచ్చు. అమరావతి రాజధానిని కూడా సినిమా లెవల్లో ఫినిష్‌ చేసి వుండొచ్చు. రాజధాని కట్టాలనుకుంటే అయిదారు వేల ఎకరాల భూమి సేక రించడం, రైతులకు దానికి తగ్గ పరిహారం చెల్లించడం, ప్రభుత్వ పరిపాలనకు అవసరమైన అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ఉద్యోగుల కాలనీలు, వారికి అవసరమైన మౌలిక వసతులు... ఇంత వరకు తీసుకుని వుంటే ఇదివరకే రాజధాని రూపం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కాని, చంద్రబాబు అమరావతిని సినిమాగా క్లోజ్‌ చేయాలనుకోలేదు. 'మొగలిరేకులు' సీరియల్‌ లాగా సాగదీస్తున్నాడు. సీరియల్‌ మొదలుకావడమే అందరికీ తెలుసు. ఎప్పుడు ఎండ్‌ అవుతుందో ఎవరికీ తెలియదు. సింగపూర్‌ లాంటి రాజధానితో మొదలైంది అమరావతి సీరియల్‌. ఆ తర్వాత బీజింగ్‌ అని, కొలంబో అని, టోక్యో అని, మిలాన్‌, మాస్కో, వాషింగ్టన్‌, కౌలాలంపూర్‌... ఇలా అన్ని దేశాల ప్రధాన నగరాలను చుట్టేసింది. సింగపూర్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశస్థులు ఇచ్చిన రాజధాని డిజైన్‌లు అన్నీ మూలనపడ్డాయి. చివరకు లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్‌ చేతికి రాజధాని డిజైన్‌ వెళ్ళింది. మొదట్లో వాళ్ళు గీసిన డిజైన్‌లు కూడా చంద్రబాబుకు నచ్చలేదు. వాళ్ళకు సలహాలిచ్చేందుకు బాహుబలి సినిమా డైరెక్టర్‌ రాజమౌళిని తీసుకెళ్లాడు. ఎట్టకేలకు నార్మన్‌పోస్టర్‌ సంస్థ రెండు డిజైన్‌లకు తుది రూపకల్పన చేసి ఇచ్చింది. దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలను పక్కనపెట్టి ఆ సంస్థ ఈ డిజైన్‌లను రూపొందించింది. డైమండ్‌ ఆకారంలో ఒకటి, టవర్‌ ఆకారంలో ఒకటి! టవర్‌ ఆకారం డిజైన్‌ను 70మీటర్ల ఎత్తుతో, 70 అంతస్థులతో రూపొందించారు. ఈ టవర్‌లో క్రింద అసెంబ్లీ వుంటుందట, టవర్‌ పైకి పర్యాటకులను పంపిస్తారట! ఇది అసెంబ్లీ భవనాన్ని కడుతున్నట్లు, రాజధాని నిర్మాణం చేస్తున్నట్లుగా లేదు, హాయ్‌ లాండ్‌, వండర్‌వరల్డ్‌, కోరల్‌ ఐలాండ్‌ వంటి పర్యాటక వ్యాపార కేంద్రాలను పెడుతున్న ట్లుగా వుంది. చంద్రబాబు విధానాలు పరిపాలన కంటే కూడా ప్రజలను ఆకర్షించేలా టూరిస్ట్‌ స్పాట్‌లను అభివృద్ధి చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా వుంది. అమరావతికి ఇంతవరకు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు. వేలకోట్లు ఖర్చు పెట్టి తాత్కాలికంగా వర్షం వస్తే ఉరిసే భవనాలు కట్టారు. రాజధాని పేరుతో వేలకోట్లు తగలేస్తున్నారు. మళ్ళీ దీనిమీద రాజమౌళి చేత 'అమరావతి' సినిమా తీయిస్తారట. ఇది సినిమా కాదు... ఇప్పటివరకు 'అమరావతి రాజధాని' పేరుతో జరిగిన కథనంతా సీరియల్‌గా తీస్తే అయిదారేళ్లకు సరిపడా ఎపిసోడ్‌లను టీవీలలో వేసుకోవచ్చు. అమరావతి సినిమా కంటే సీరియల్‌ బెటర్‌... ఆలోచించండి.

landsచరిత్రలో మనం చదువుకున్న అమరావతి వేరు... భవిష్యత్‌లో మనం చూడబోయే అమరావతి వేరు. చరిత్రను పరిశీలిస్తే అమరావతి కేంద్రంగా రాజ్యాలు, సామ్రాజ్యాలు వెలిసాయి. భిన్న సంస్కృతులు, విభిన్న మతసాంప్రదాయాలు అక్కడ వెలసిల్లాయి. ఈ దేశపు ధాన్యాగారంగా వర్థిల్లింది. అమరావతి కేంద్రంగా ఎన్నో చారిత్రాత్మక కథలు చదువుకున్నాం. అంతెందుకు ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించి విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చరిత్ర కూడా అమరావతి రాజ్యానిదే! ఇది చరిత్ర. ఇక భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది...

రాష్ట్ర విభజన తర్వాత ఏపికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన అమరావతిని అమరావతిగా ఉం చడం లేదు... అమరావతిని సింగపూర్‌ చేస్తానని ఒకసారి, బ్యాంకాక్‌ చేస్తానని ఇంకోసారి, బీజింగ్‌, టోక్యో, వాషింగ్టన్‌, దావోస్‌, కొలంబో... ఇలా అమరావతిని వీటి మాదిరిగా చేస్తానని చెప్పి చంద్రబాబు ప్రపంచంలో వున్న ప్రధాన నగరాలన్నిం టిని ప్రస్తావించాడు. అమరావతి రాజధాని డిజైన్‌ల కోసమని సినిమా సెట్టింగ్‌లు చూసి దర్శకులను కూడా సంప్రదిస్తుండడం చూస్తున్నాం. రాజధాని నిర్మాణానికి సినిమా డైరెక్టర్‌లకు సంబంధ మేంటి? అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామంటూ చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిం చాడు. మాస్టర్‌ప్లాన్‌ మ్యాప్‌ రాగానే 'అహోఅమరావతి' అంటూ పచ్చపత్రికలు డబ్బాకొట్టాయి. రాజధాని వస్తే మీరు సత్తుగిన్నెల్లో కాదు బంగారుపళ్ళాల్లో పంచ భక్ష పరమాన్నాలు తినొచ్చంటూ రైతుల వద్ద నుండి 33వేల ఎకరాలు మూడు పంటలు పండే భూములు తీసుకున్నారు. భూములకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి పొలాల్లో వారికే స్థలాలు ఇచ్చేలాగా అగ్రిమెంట్లు ఇచ్చారు. పొలాలు లాక్కోగానే పంటలు వేయనీయ లేదు. పచ్చటి పొలాలు బీళ్లుగా మారాయి. వెలగపూడిలో సచివాలయం కట్టారు. మిగతా నిర్మాణాలపై క్లారిటీ లేదు. అసలు ఇంతవరకు కాంట్రాక్ట్‌ ప్రక్రియ పూర్తి కాలేదు. అసలు రాజధానిని కట్టడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. కేంద్రం ఇవ్వడం లేదు. చంద్రబాబు అంచనాకు కేంద్రం ఇస్తున్న నిధులకు కొండ, బండ మధ్య ఉన్నంత తేడా వుంది. ఇక విభజన సమయంలో మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్‌లో ఉందో ఇప్పుడు కూడా అంతే లోటుబడ్జెట్‌లో వుంది. దీనికి కారణం పట్టిసీమ, పుష్కరాలు, కానుకలు, విదేశీ ప్రయాణాలు, మజ్జిగ ప్యాకెట్లు పేరుతో చంద్రబాబు చేసిన దండగ ఖర్చులే!

రాజధాని ప్రక్రియ ప్రారంభమై మూడేళ్లు కావస్తుంది. దాదాపు రెండు న్నరేళ్ల నుండి రైతులు పైర్లు వేయడం లేదు. రైతులకు పనులు లేవు. రైతు కూలీలు అమరావతి ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలసపోతు న్నారు. రైతులు ఇప్పటివరకు పొదుపు చేసిన డబ్బులతో లేదా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు పంపించిన డబ్బులతోనో కాలం వెళ్లదీసారు. కాని ఇలా ఎంత కాలమని... మూడేళ్లయినా రాజధాని ముందుకు కదల్లేదు. మహా అంటే ఇంకో ఏడాది పనులు జరుగుతాయి... తర్వాత ఎలక్షన్‌ ట్రెండ్‌ మొదలవుతుంది. ఈ ఏడాదిలోపు ఇలా మాస్టర్‌ప్లాన్‌లతోనే కాలయాపన జరుగుతుంది. రేపు ఎలక్షన్‌లో రాజెవడో, రైతెవడో? తెలుగుదేశం తిరిగి అధికారం లోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ జగన్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబు లాగా అమరావతికి ఎందుకు ప్రాధాన్యత నిస్తాడు? అమరావతిని రాజధానిగానే కొనసాగించినా ఏ ఐదు వేల ఎకరాలకో పరిమితం చేస్తాడు. అప్పుడు రైతుల భూములు తిరిగి రైతులకే రావచ్చు.

రేపనేది ఎలావున్నా ఇప్పుడు మాత్రం అమరావతి రైతుల్లో నిలువెత్తు నిరాశ కని పిస్తోంది. తమను రైతులుగా నిలబెట్టి, తమ కడుపునింపిన పొలాలు మూడేళ్లుగా బీళ్లుగా పడివుండడాన్ని చూసి అక్కడి రైతులే ఆవే దన చెందుతున్నారు. రాజధాని పరిస్థితి ఇలానే కొనసాగితే అమరావతి కేంద్రంగా భవిష్యత్‌లో మరెన్నో కన్నీటి గాథలు చోటు చేసుకుంటాయనడంలో సందేహం లేదు.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…

Newsletter