anam brosనెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చి 6వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కరస్పాండెంట్‌ ఆనం వివేకానందరెడ్డి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 11వ తేదీన హైకోర్టు కొట్టి వేసింది. దీంతో వి.ఆర్‌ విద్యాసంస్థలను తమ చేతుల్లో నుండి పోకుండా చూసుకోవాలనుకున్న ఆనం సోదరుల ఆశలు గల్లంతయ్యాయి.

1875 ప్రాంతంలో వెంకటగిరి రాజాలు విఆర్‌ విద్యా సంస్థలను ప్రారంభించారు. 1970 వరకు విఆర్‌ విద్యాసంస్థలపై వెంకటగిరి రాజాల పెత్తనమే సాగింది. 1970లో పెద్ద రాజాయాచేంద్ర మరణంతో ఆనం కుటుంబం ప్రవేశించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విఆర్‌ విద్యాసంస్థల కమిటీకి ఆనం వెంకటరెడ్డి అధ్యక్షుడయ్యాడు. అప్పటినుండి ఆనం వాళ్ళే పెత్తనం చేయసాగారు. 1970 నుండి 1985 వరకు విఆర్‌ కమిటీకి ఎన్నికలు జరుపకుండా ఆనం కుటుంబమే నేతృత్వం వహిస్తూ వచ్చింది. కమిటీకి వెంటనే ఎన్నికలు జరపాలంటూ అప్పట్లో ఏబివిపి నాయకులుగా వున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆమంచర్ల శంకరనారాయణ, చంద్రశేఖర్‌రాజులు నెల్లూరులో ఆరు రోజుల పాటు నిరాహారదీక్ష చేసారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న ఎన్టీఆర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీతో వీళ్ళు దీక్ష విరమించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్‌ విఆర్‌ విద్యా సంస్థల కమిటీకి 1986లో ఎన్నికలు పెట్టించారు. అయితే పూర్వవిద్యార్థుల ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని వూహించిన ఆనం సోదరులు బైలాను సవరించి, పూర్వ విద్యార్థులకు ఓట్లు లేకుండా చేసి ఎన్నికలు పెట్టారు. అప్పుడే తమ ఓట్లను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పూర్వవిద్యార్థులు నెల్లూరు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో కోర్టు ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపేసింది. 1993లో కోర్టు పూర్వవిద్యార్థుల పిటిషన్‌ను కొట్టి వేయడంతో 1986లో జరిగిన ఎన్నికల ఓట్లను అప్పుడు లెక్కించారు. ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌ మరియు కార్యదర్శిగా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా, మరో ఏడు మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. క్రింది కోర్టు తమ పిటిషన్‌ను కొట్టి వేసినా విఆర్‌ పూర్వవిద్యార్థులైన ఆమంచర్ల శంకరనారాయణ, గూడూరు విజయరామిరెడ్డి, పాతూరు రమణయ్యలు ఆ కేసును వదల్లేదు. 1996లో హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసారు. వారి పోరాట ఫలితమే విఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును పున పరిశీలించాలంటూ ఆనం వివేకానందరెడ్డి వేసిన రివ్యూ పిటిషన్‌ను తాజాగా హైకోర్టు కొట్టివేయడంతో విఆర్‌ విద్యాసంస్థలపై ఆనం సోదరుల ఆశలు అడుగంటినట్లయ్యాయి.

ananmఏదైనా కాంగ్రెస్‌పార్టీ కాంగ్రెస్‌పార్టీయే... ఆ పార్టీలో ఉన్నంత సంతోషం, ఆ హోదా, ఆ దర్జా, ఆ అధికారదర్పం ఇంకే పార్టీ లోనూ రాదు. అక్కడ కోపం వస్తే క్రిందిస్థాయి నాయకుడినే కాదు, ఢిల్లీలో వున్న నాయకులను కూడా నోరారా తిట్టుకోవచ్చు. ఒక్క ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను తప్పితే ప్రధానమంత్రిగా వున్న నాయకుణ్ణి తిట్టినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఘనంగా వర్ధిల్లుతుందని చెప్పడానికి దీనినే నిదర్శనంగా చెబుతుంటారు.

చెరువులోని చేపపిల్లలను నీళ్ల తొట్టెలో వేస్తే ఎలా వుంటుందో, సముద్రం లాంటి కాంగ్రెస్‌పార్టీ నుండి నీటితొట్టెల్లాంటి ప్రాంతీయ పార్టీల్లోకి వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా వుంటాయో నాయకులకు ఇప్పుడు తెలుస్తుంటోంది. కాంగ్రెస్‌ నుండి బయట కొచ్చి తప్పు చేశామా అని బాధపడేవాళ్ళలో నెల్లూరుజిల్లా నుండి ఖచ్చితంగా ఆనం సోదరులు వుంటారు. కాంగ్రెస్‌ నుండి తెలుగు దేశంలో చేరాక ఈ పార్టీలో వాళ్ళకు ఇస్తున్న ప్రాధాన్యత, గౌరవం చూస్తుంటే ఖచ్చితంగా వారి మనసులో ఆ అభిప్రాయం ఏర్పడ కుండా వుండదు.

2015లో ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలు కూడబలుక్కుని తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఏం హామీలిచ్చాడో, ఏం మాటలు చెప్పాడోగాని వీళ్ళు ఎగురు కుంటూ సైకిలెక్కేసారు. కాంగ్రెస్‌లోలాగే జిల్లాలో తెలుగుదేశం పెత్తనాన్ని చేతుల్లోకి తీసేసుకోవచ్చనుకున్నారు. కాలం గడిచే కొద్ది పార్టీయే తమ వద్దకు నడిచొస్తుందనుకున్నారు. తీరాచూస్తే ఇక్కడంత సీన్‌ లేకుండాపోయింది. వీళ్ళు దూసుకుపోవడానికి ఎక్కడా సందు దొరకలేదు. జిల్లా టీడీపీలోవున్న ముదుర్లు వీళ్లకు ఛాన్స్‌ ఇవ్వలేదు. చంద్రబాబు కూడా వీళ్లకు అంత ప్రాధాన్యత నివ్వలేదు. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఇవ్వడం తప్పించి పార్టీలో ఇక ఏ బాధ్యత ఇవ్వలేదు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాలలో వీరిని వేలు పెట్టనీయలేదు. ఆనం వివేకా ఎమ్మెల్సీ ఆశిస్తే అదీ దక్కలేదు. వివేకాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని అలిగే జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చినా ఆనం రంగమయూర్‌రెడ్డి తీసుకోలేదు.

ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఇచ్చారు. అలాగే గూటూరు కన్నబాబు అనే పక్కలో బల్లేన్ని పెట్టారు. ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రెండు గ్రూపులయ్యాయి. కన్నబాబు చాపక్రింద నీరులా ఆనంకు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ జిల్లా నాయకులు కూడా కన్నబాబుకే మద్దతుగా వున్నారు. మొన్న వెంకటగిరిలో పార్టీ సమావేశం జరిగితే కన్నబాబును వేదికనెక్కించడం ఆనంకు మింగుడుపడలేదు. ఆయన అలిగి అక్కడ నుండి వచ్చేసాడని తెలిసింది. కాంగ్రెస్‌లో వున్నప్పుడు ఇలాంటి కన్నబాబులనే కాదు, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి రాజకీయ యోధుడిని కూడా మట్టి కరిపించిన చరిత్ర ఆనం సోదరులది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు తెలుగుదేశంలో నల్లుల్లాంటి నాయకులు కూడా కంట్లో నలుసుల్లా తయారై వారి నాయకత్వానికే సవాల్‌ విసురుతున్నాయి.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…
  • సోమిరెడ్డి కలలకు కార్యరూపం
    కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల…
  • ఇప్పుడన్నా ఇస్తారా?
    తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది... మరి పార్టీ ప్రతి పక్షంలో వున్న పదేళ్ళ పాటు పార్టీ జెండాలు మోసిన వారికి ఏమిచ్చింది... నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి ఇది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రతిపక్షంలో వున్నప్పుడే తమకు విలువ…

Newsletter