cm anam brosతెలుగుదేశంపార్టీలో చేరినప్పటి నుండి కూడా మనశ్శాంతి కరువై, పూలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్లుగా వున్న ఆనం వివేకా నందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు 2వ తేదీ సీఎం చంద్రబాబును కలిసారు. జిల్లా రాజకీయాల గురించి కాకుండా తమ రాజకీయ భవిష్యత్‌ గురించి ఆయనతో చెప్పుకున్నారు. ఆనం సోదరులు తెలుగు దేశంలో చేరారనేగాని, పార్టీలో వీరికి సరైన ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్‌లో రాజాలు మాదిరిగా ఏలిన ఈ బ్రదర్స్‌కు తెలుగుదేశంలో ఇమడడం కష్టంగానే వుంది. అయినా రాజకీయంగా ఇంకో ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో తెలుగుదేశంనే అంటి పెట్టుకుని వున్నారు. పార్టీలో చేరాక ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జి ఇవ్వడం తప్పించి ఇంకేమీ చేయలేదు. ఆనం సోదరులు ఎమ్మెల్సీ డిమాండ్‌ చేస్తున్నారు. దానిపై చంద్రబాబు ఇంతవరకు హామీ ఇవ్వలేదు. త్వరలో గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలి. వీటిలో ఒక దానిని జమ్మలమడుగు రామసుబ్బారెడ్డికి ఇచ్చారు. కాబట్టి రెండో ఎమ్మెల్సీని రెడ్లకు ఇవ్వలేడు. దీంతో ఇప్పట్లో ఆనం సోదరులకు ఎమ్మెల్సీ అవకాశం లేనట్లే! కాని నిన్న సీఎంను కలిసిన బ్రదర్స్‌, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని అడిగినట్లు తెలుస్తోంది. తమకు ఏదో ఒక పదవి వుంటేగాని పార్టీలో తమ ప్రాధాన్యత పెరగదని వారి ఉద్దేశ్యం. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వలేని పక్షంలో 'నుడా' ఛైర్మెన్‌తోనైనా సర్దుకుపోవడానికి బ్రదర్స్‌ సిద్ధంగా వున్నట్లు, ఆ విధంగా చంద్రబాబుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

anam brosదాదాపు రెండు దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి, నేదురుమల్లి వంటి రాజకీయ యోధులను కూడా దెబ్బతీసిన ఆనం సోదరులకు ప్రస్తుతం రాజకీయాలలో గడ్డు పరిస్థితి కొనసాగుతోంది.

వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం జిల్లాలో ఆనం వారి హవా కొన సాగింది. వై.యస్‌. మరణం తర్వాత రోశయ్య, కిరణ్‌ల హయాంలోనూ వారి పెత్తనం ఇంకా ఎక్కువుగానే కొనసాగినా పరోక్షంగా మాత్రం వై.యస్‌. మరణం వారి రాజకీయ జీవితచరిత్రను అనుకోని మలుపు తిప్పింది. వై.యస్‌. మరణం తర్వాతే కాంగ్రెస్‌ను వదిలి జగన్‌ సొంత పార్టీ పెట్టడం, ఆ కసితో సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకోవడం, విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్‌ మట్టి గొట్టుకుపోవడం, కాంగ్రెస్‌తో పాటు ఆనం సోదరులు కూడా రాజకీయంగా వెలుగు కోల్పోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.

రాజకీయంగా మనుగడ సాగించా లంటే టీడీపీలోకో వైసీపీలోకో వెళ్లాలి. కాంగ్రెస్‌లోనే వుంటే ఆనం సోదరులు సి.వి.శేషారెడ్డి, చెంచలబాబుయాదవ్‌ల మాదిరిగా పార్టీ కార్యక్రమాలలో జెండాలు మోసుకోవడం, ఇందిరా వర్ధంతి, సోనియా బర్త్‌డేలు చేసుకుంటుండడం తప్ప ఇక చేసేదేమీ వుండదు. కాంగ్రెస్‌లో వున్న ప్పుడు జగన్‌ను అనరాని మాటలన్నారు కాబట్టి ఆనం సోదరులు ఆ పార్టీలోకి పోలేక తెలుగుదేశంలో చేరిపోయారు.

అయితే కాంగ్రెస్‌ సంస్కృతికి అలవాటు పడ్డ ఆనం సోదరులు తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో ఇమడలేకపోతున్నారు. ఒకప్పుడు వీళ్ల ముందు చేతులు కట్టుకుని తిరిగినవాళ్లు ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేసరికి పార్టీలో మీకంటే మేం సీనియర్లం, మాపై పెత్తనం చెలాయించాలంటే కుదరదు అన్నట్లుగా వున్నారు. అదీగాక ఒకప్పుడు తాము లెక్కలేకుండా చూసిన మంత్రి నారాయణ వద్దకే ఇప్పుడు ఏ పని కావాలన్నా పోవాల్సి వస్తోంది. ఇది వాళ్లకు బాగా ఇబ్బంది కలిగించే విషయమే! తెలుగుదేశంలో చేరాక ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతను ఆనం రామనారాయణరెడ్డికి అప్పగించడం తప్పితే రాజకీయంగా వారికి ఇక ప్రాధాన్యత నిచ్చిందేమీ లేదు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని చెప్పారు. కార్పొరేషన్‌ వ్యవహారాలలో అసలు కలుగజేసుకోవద్దని సంకేతాలు అందాయి. కార్పొ రేషన్‌లో కెలకనిదే ఆనం వివేకాకు నిద్రపట్టదు. పుండు మీద యాసిడ్‌ పోసినట్లు ఈమధ్య విఆర్‌ విద్యాసంస్థల కమిటీని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి మరింత బాధ కలిగిస్తోంది.

చంద్రబాబు ఏదన్నా కనికరించి ఎమ్మెల్సీ ఇస్తాడనుకుంటే అది కూడా అందని ద్రాక్షలాగే వుంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ రాలేదు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీని వాకాటికిచ్చారు, మేలో గవర్నర్‌ కోటా క్రింద రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సివుంది. దీంట్లో ఒకటి ఆనం సోదరులకు వచ్చి వుండేదే! అయితే కడపలో వైసిపి నుండి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని రామసుబ్బారెడ్డి వ్యతిరేకించారు. ఆయనను చల్లబర్చడానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి చంద్రబాబు ఆర్టీసీ ఛైర్మెన్‌ పదవిని రామసుబ్బారెడ్డికిచ్చి, ఎమ్మెల్సీని ఆనం వాళ్లకు ఇవ్వాలనుకున్నాడు. అయితే రామసుబ్బారెడ్డి ఆర్టీసీ ఛైర్మెన్‌కు లొంగకుండా ఎమ్మెల్సీకి రాజీపడ్డాడు. దీంతో ఉన్న రెండు ఎమ్మెల్సీలలో ఒకటి రెడ్లకు ఇస్తే, రెండోది ఇతర కులాలకు ఇవ్వక తప్పదు. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ విషయంలో ఆనం బ్రదర్స్‌కు ఇక్కడ గండిపడింది. ఇక ఎన్నికల దాకా మధ్యలో పదవులొచ్చేదీ లేదు, పెట్టేదీ లేదు. ఎలక్షన్‌లో ఆత్మకూరు సీటు ఇవ్వడం తప్పించి ఆనం బ్రదర్స్‌కు చంద్రబాబు అంతుకుమించి ఏమీ చేయడు.

anam expressఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం సోదరులు తమ బలప్రదర్శనకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 17వ తేదీన దాదాపు 4వేల మంది అనుచరులను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేర్పించడానికి రంగం సిద్ధం చేశారు. దీనికి గాను నెల్లూరు నుండి తమ అనుచరులను విజయవాడకు తీసుకెళ్లడానికి ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆనం వివేకానందరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 17వ తేదీ ఉదయం 6.30గంటలకు నెల్లూరు రైల్వేస్టేషన్‌ నుంచి స్పెషల్‌ ట్రైన్‌ బయలుదేరుతుందని, ఇందులో తమ అనుచరులు, కార్యకర్తలందరూ విజయవాడకు బయలుదేరుతారని తెలిపారు. నెల్లూరురూరల్‌, నగరం నియోజకవర్గాలలో వున్న అనుచరులకు స్పెషల్‌ ట్రైన్‌ను కేటాయిం చగా, ఆత్మకూరు నియోజకవర్గ అనుచరులకు మాత్రం భారీ ఎత్తున బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆనం బలప్రదర్శన ఎంతవరకు విజయవంతం అవుతుందో చూద్దాం!

Page 1 of 2

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter