anam brosమాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కొడుకులైన ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు తెలుగుదేశం లోనే వున్నారు. ఇక తండ్రి చనిపోవడంతో రాజకీయంగా కూడా వారికి పెద్దదిక్కు చిన్నాన్న అయిన రామనారాయణరెడ్డే! రామనారాయణరెడ్డి వైసిపిలో చేరితే టీడీపీలో వుండి వీళ్ళు స్వయంగా ఎదిగే పరిస్థితి వుండదు. అదీగాక తెలుగుదేశంలో వున్నప్పుడే ఆనం వివేకాకు అన్యాయం జరిగింది. ఆయనకకు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీని ఇవ్వకుండా అసంతృప్తికి గురి చేసారు. ఈ బాధ ఆయన కొడుకుల్లోనూ వుంది. కాబట్టి రామనారాయణరెడ్డితో పాటే వాళ్ళూ వైసిపిలో చేరే అవ కాశాలెక్కువ.

పోతే ఆనం జయకుమార్‌రెడ్డి పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న! 2014 ఎన్నికలకు ముందే ఆయన తన సోదరులతో విడి పోయాడు. అప్పుడు జైసమైక్యాంధ్ర అభ్యర్థిగా నిలబడ్డాడు. ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో చేరి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడు. అప్పటినుండి ఆనం వివేకా, రామనారాయణరెడ్డిలతో దూరం పాటిస్తూ వచ్చాడు. ఈరోజు వివేకా లేడు, రామనారాయణ రెడ్డితో జయకు పెద్ద విభేదాలేమీలేవు. ఇటీవల రామనారా యణరెడ్డి పార్టీ మారుతున్నాడన్న ప్రచారం జరిగినప్పుడు కూడా జయకుమార్‌రెడ్డి చంద్రబాబును కలిసి తాను తెలుగు దేశంలోనే వుంటానని చెప్పొచ్చాడు. ప్రస్తుతానికి ఆయనతో కలిసి తెలుగుదేశంలో కొనసాగుతున్న జయకుమార్‌రెడ్డి తన అన్నతో కలిసి వైసిపిలో చేరే అవకాశాలు లేవు. భవిష్యత్‌లో ఆయన రాజకీయంగా ఎటువైపు అడుగులు వేసినా ఆదాలతో కలిసే నడుస్తాడని తెలుస్తోంది.

anamపూలమ్మినచోటే కట్టెలమ్మే పరిస్థితి వస్తే ఎవరికైనా మనసు కష్టంగా వుంటుంది. అలాంటి మనసు కష్టాన్నే ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుభవిస్తున్నాడు. రాజకీ యాలలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి ఏనుగుల్లాంటి వారిని ఢీకొన్న చరిత్ర వారిది. అలాంటి వాళ్ళకు గూటూరు కన్నబాబు అనే చిట్టెలుక నిద్ర లేకుండా చేస్తుంది. మన శ్శాంతి లేకుండా చేస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమైన తర్వాత రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో ఆనం సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. కాంగ్రెస్‌ను వదిలేసి తెలుగుదేశంలో చేరాక వీరి పరిస్థితి దారుణంగా మారింది. కన్నబాబు లాంటివాళ్లు కూడా వీళ్లను లెక్కచేయని దుస్థితి వచ్చింది. తెలుగుదేశంలో చేరాక జిల్లా పెత్తనమంతా తమ గుప్పిట్లోకి వస్తుందని వీళ్ళు భావిస్తే, ఇన్‌ఛార్జ్‌గా ఇచ్చిన ఆత్మకూరు మీద కూడా వీళ్లకు పూర్తిగా పట్టు దొరకని పరిస్థితి. ఇక్కడ కన్నబాబు ప్రత్యేక వర్గాన్ని మెయింటేన్‌ చేసుకుంటూ జిల్లా పార్టీ ముఖ్య నాయకులందరితో టచ్‌లో వుంటున్నాడు. జిల్లా తెలుగుదేశం నాయకులు కూడా కన్నబాబుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో కన్నబాబుకు అనవసర ప్రాధాన్యతనిచ్చారని చెప్పి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో వెళ్లిపోయాడు. అప్పటినుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీ నుండి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలు మొదలుకావడం తెలిసిందే! ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలలో తిరుగుతున్నా ఆనం మాత్రం ఆత్మకూరులో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలో 18వ తేదీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఒకటిన్నర గంట పాటు రాజకీయాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈయనేం అడిగాడో ఆయనేం చెప్పాడోగాని మొత్తానికి ఆనం అలకను వీడినట్లే కనిపిస్తున్నాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter