jaganఉభయగోదావరి జిల్లాలు. పాడిపంటలకు, పచ్చని పైర్లకు, గలగల పారే కాలువలకు, కొబ్బరిచెట్లతో నిండిన కోనసీమ అందాలకు, నోరూరించే కాజాలు, పూతరేకులకు, పంచారామ క్షేత్రాలకు వేదికలు. ఈ జిల్లాలు ఇంతవరకే పరిమితమా? కానే కాదు. రాష్ట్ర రాజకీయాలను శాసించగల శక్తి వున్న జిల్లాలు. ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలో, ఎవర్ని ప్రతిపక్షంలో నిలబెట్టాలో నిర్ణయించే జిల్లాలు.

294 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేరు. విభజన అనంతరం 175 సీట్లతో మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ వేరు. చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డాకే ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాల ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంలో 13జిల్లాలు, 175 నియోజకవర్గాలు. ఒక్క పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనే 34 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే! రాయలసీమలోనే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వైసిపి మెజార్టీ స్థానాలు సాధించగలిగింది. కాని ఉభయగోదావరి జిల్లాలు తెలుగుదేశంకు జై కొట్టాయి. ఈ రెండు జిల్లాల్లోనూ టీడీపీ దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ రెండు జిల్లాల్లో వచ్చిన సీట్ల వల్లే వైసిపి కంటే టీడీపీ ముందంజలో నిలిచింది. ఆరోజు పరిస్థితులు టీడీపీకి అనుకూలించాయి. నరేంద్ర మోడీ ఇమేజ్‌తో పాటు ఈ రెండు జిల్లాల్లో బలంగా వుండే కాపు సామాజికవర్గం, పవన్‌ పుణ్యాన టీడీపీ వైపు మొగ్గు చూపింది. అలాగే కొన్ని విషప్రచారాల వల్ల కూడా ఈ జిల్లాల్లో పెద్దసంఖ్యలో వుండే రాజులు సైతం వైసిపికి వ్యతిరేకంగా ఓటేసారు. ఇది గత చరిత్ర... మరి గోదావరి రేపు ఎవరికి హారతి పట్టబోతుంది? ఎవరిని ఆదరించబోతుంది? వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరిలో ముగిసి తూర్పుగోదావరిలో అడుగుపెట్టింది. 12వ తేదీ ఉదయం కొవ్వూరు వద్ద గోదావరి తల్లికి జలహారతి ఇచ్చిన అనంతరం గోదావరి రోడ్‌కంబైన్‌ వంతెన మీదుగా జగన్‌ తూర్పుగోదావరిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా బ్రిడ్జిపై ఆయన వెంట నడిచిన జనప్రవాహానికి ఆ వంతెనే కదిలింది. లక్షలాదిగా ప్రజలు జగన్‌ను స్వాగతిం చారు. ఆయన వెంట నడిచారు. క్రింద జలగోదావరి, పైన జనగోదావరి అన్నంతగా జన సమూహం. కోనసీమ ఈసారి ఈ రాయలసీమ బిడ్డను ఆదరిస్తుందనడానికి నిలువెత్తు సంకేతం ఇది. పశ్చిమగోదావరిలో జగన్‌కు కనీవినీ ఎరుగని ఆదరణ లభించింది. ఒకదానికి మించి ఒకటి ఆయన సభలు విజయవంతమయ్యాయి. తూర్పుగోదావరిలోనూ జగన్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోంది.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలంటారు పెద్దలు. 2014 ఎన్నికల్లో జగన్‌ గోదావరి జిల్లాల్లోనే నష్టపోయాడు. ఇప్పుడు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుజిల్లాల్లో వైసిపి పటిష్టంగానే వుంది. కృష్ణా నదికి దక్షిణం వైపు జిల్లాల్లో ఈసారి కూడా 2014 ఎన్నికల్లో వచ్చిన సీట్లకు ఏ మాత్రం తగ్గవు. ఉభయగోదావరి జిల్లాల ప్రజల మనసులను గెలవగలిగితే జగన్‌ 2019 ఎన్నికలను గెలిచినట్లే! జగన్‌ను ముంచినా, తేల్చినా అంతా గోదావరి పుణ్యమే!

ఇడుపులపాయ నుండి మొదలైన జగన్‌ పాదయాత్ర రోజులు మారేకొద్ది జిల్లాల ఎల్లలు దాటే కొద్ది ఉధృతమవుతోంది. ప్రజా ప్రభంజనం పోటెత్తుతోంది. నడిచేకొద్ది ఆయన నాయకుడిగా అంతకంతకూ ఎదుగుతున్నాడు. ప్రజల నమ్మకాన్ని పెంచుకుంటున్నాడు. అన్ని పక్షాలలో వున్న నాయకులు తనవైపు చూసేలా చేస్తున్నాడు. నాలుగేళ్ళ క్రితం జగన్‌కు అనుభవం లేదు అని ఓటేయడానికి వెనక్కు తగ్గిన వాళ్ళు కూడా ఇప్పుడు జగన్‌ పట్టుదల, వేలకిలోమీటర్ల దూరం నడుస్తున్న అతని మొండితనాన్ని చూసి నాయకుడంటే ఇతడేరా... రాజశేఖరరెడ్డిని తలపించే ప్రజానాయకుడవుతాడురా అని అంటున్నారు. 2003లో వై.యస్‌. ప్రజాప్రస్థానం పాదయాత్రను మరపించేలా జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతుందంటే అతిశయోక్తి కాదేమో!

ap stateస్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు నుండి వై.యస్‌.రాజశేఖరరెడ్డి వరకు ఎందరో నాయకులు ఈ రాష్ట్రాన్ని పాలించారు. నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారకరామారావు, కె.రోశయ్య... ఎవరి హయాంలోనూ ఈ రాష్ట్రంలో కులాల సమస్య తలెత్తలేదు. కులాల మధ్య చిచ్చు రేగలేదు. అంతెందుకు 1995-2004ల మధ్య సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు కాలంలోనూ రాజకీయాలలో పెద్దగా కులాలకు ప్రాధాన్యత లేదు.

కాని, రాష్ట్రానికి ఏం దరిద్రం ముసించిందోగాని గత నాలుగేళ్ళుగా కులం జాడ్యం పెరుగుతూ వస్తోంది. కులాల మధ్య చిచ్చు రేగింది. దీనికి బీజం వేసింది చంద్రబాబునాయుడే! 2014 ఎన్నికల్లో ఓట్ల కోసం కాపులకు రిజర్వేషన్‌లు అంటూ రెచ్చ గొట్టాడు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక మంజునాథ్‌ కమిషన్‌ వేసి బి.సిలను రెచ్చగొట్టాడు. పలుచోట్ల కాపులు, బీసీల మధ్య రిజర్వేషన్‌ల విషయమై గొడవలు జరిగాయి. రాష్ట్రంలో తెలుగుదేశంకు బలమైన మద్దతుదారులుగా వున్న బ్రాహ్మణు లను కూడా ఈ కులం కంపులోకి లాగారు. టీటీడీ రిటైర్డ్‌ ప్రధానార్చకులు రమణదీక్షితులు, తెలుగుదేశంపార్టీకి మధ్య జరుగుతున్న గొడవను చూస్తూనేవున్నాం. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతంలో ఛైర్మెన్‌గా వ్యవహరించిన ఐవిఆర్‌ కృష్ణారావు ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. పరిపాలనలోనూ కుల వివక్ష పెరిగిపోయింది. ఈ ప్రభుత్వంలో రెండు మూడు కులాల వారికే పనులవుతున్నాయి. ప్రభుత్వ శాఖల బదిలీలలో వారికే ప్రాధాన్యత లభిస్తోంది. కొన్ని కులాల వారిని శత్రువులుగా చూస్తున్న విష వాతావరణం నెలకొంది. సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు కులాల పేర్లతో తీవ్రంగా దూషించుకుంటున్నారు. కుల సంఘం నాయకుల మధ్య చర్చా వేదికలు పెట్టి పచ్చమీడియా వివాదాలను పెంచిపోషిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు, ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ నామినేటెడ్‌ పదవుల్లో వున్న నాయకులే ఆయా కులాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో ఇంతటి కుల పైత్యం ఎప్పుడూ లేదు. ఓట్ల కోసమే కుల రాజకీయాలకు పాల్పడితే అది తమంతట తాము గోతిని తవ్వుకోవడమే అవుతుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కులం బలం మీదనో, కులం పునాదుల మీదనో ఏ పార్టీ నిర్మాణం జరగలేదు, ఏ ప్రభుత్వం ఏర్పడలేదు. తెలుగుదేశం అధినేత దీనిని తెలుసుకుని తన పాలనను మలచుకుంటే మంచిది.

mahanaduవిజయవాడలోని సిద్ధార్ధ కళాశాల గ్రౌండ్‌ వేదికగా తెలుగుదేశంపార్టీ మూడురోజుల మహానాడు వేడుక ముగి సింది. తెలుగుదేశంపార్టీకి మహానాడు అంటే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ. స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక పథకాలకు గాని, పార్టీ కార్యక్రమాలకు గాని ఎంతో అద్భుతమైన తెలుగుపేర్లు పెట్టేవాడు. ఆయన పార్టీ వార్షికోత్సవ వేడుకకు పెట్టిన పేరే మహానాడు.

మహానాడులో ఊకదంపుడు ఉపన్యాసాలే కాదు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే తెలుగు పిండి వంటలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన పార్టీ కార్య కర్తలను ఆనందపరిచేవాళ్ళు.

సిద్ధార్ధ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడుకు ఏపిలోని 13జిల్లాల నుండే కాకుండా తెలంగాణ నుండి కూడా కార్య కర్తలు తరలివచ్చారు. అయితే ఈ మహానాడులో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ఆత్మపరిశీలన జరగకపోగా చరద్రబాబు భజనకు ఎక్కువ సమయం కేటాయించారు. ఆయన పరిపాలన అమోఘంగా ఉందంటూ అఘోరించారు. ఈ నాలుగేళ్ళలో ప్రభుత్వ వైఫల్యాలపై విశ్లేషణ జరగలేదు. కార్యకర్తల సమస్యలను ప్రస్తావించలేదు. ఈ నాలుగేళ్ళలో ఒరిజినల్‌ తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది తీవ్ర నిరాశకు లోనై వున్నారు. కొత్తగా చేరిన కాంగ్రెస్‌, వైసిపి నాయకులకు పదవుల్లో ప్రాధాన్యతనిస్తున్నారు. పాతికేళ్ళు, ముప్ఫై ఏళ్ళ నుండి పార్టీ జెండాలు మోసిన వాళ్ళను పక్కకు తోసేసారు. వాళ్ళకు పార్టీ నుండి ఎటువంటి భరోసా లభించలేదు.

ఈ మహానాడులో కొత్తగా కనిపించిన విషయం కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం. ప్రత్యేకహోదా అక్కర్లేదు, ప్రత్యేకప్యాకేజీ ఇస్తే చాలని చెప్పిన నోటితోనే ప్రత్యేకహోదా ఇవ్వట్లేదని చెప్పి బీజేపీని తిట్టారు.

ఇక మహానాడులో ప్రతిపక్ష నేత జగన్‌ను తిట్టడం, ఆయన లక్షకోట్లు తిన్నాడని చెప్పి అరిగిపోయిన రికార్డ్‌ను వేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ మహానాడు లోనూ అదే జరిగింది. మహానాడు వేదికపై తెలంగాణకు చెందిన నర్సిరెడ్డి అనే నాయకుడు, అలాగే ఎంపీ జె.సి. దివాకర్‌రెడ్డిలు జగన్‌పై చౌకబారు విమర్శలు, పిట్టకథలు చెబుతుంటే వాటిని వింటూ పగలబడి నవ్విన చంద్రబాబు, ఇతర నాయకుల తీరు వెగటు పుట్టించేలా వుంది.

అన్నింటికి మించి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థు లుగా, ఫ్యాన్‌ గుర్తు మీద గెలిచి ప్రలోభాలతో తెలుగుదేశంలో చేరిన ముగ్గురు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ పిట్టకథలను విని నవ్వుతుంటే చూసేవారికి ఎంతో రోతనిపించింది.

Page 1 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter