anilమున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు.

ఈ నాలుగేళ్ళలో మంత్రి నారాయణపై అనిల్‌ అవినీతి ఆరోపణలు చేసినంతగా ఇంకెవరూ చేసివుండరు. గతంలో పలు అంశాలలో మంత్రి నారాయణను ఏకిన అనిల్‌, తాజాగా వెంకటేశ్వరపురం యాష్‌పాండ్‌లో నిర్మిస్తున్న 'హౌస్‌ ఫర్‌ ఆల్‌' గృహ సముదాయాలపై పడ్డాడు. షేర్‌వాల్‌ టెక్నాలజీతో పేదల కోసం ఎంతో అందమైన ఇళ్ళు నిర్మిస్తున్నామని ఇంతకాలం నారాయణ గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఇళ్లతో నగరంలో తన పాపులారిటీ పెరుగుతుందని నారాయణ భావించారు.

అయితే అనిల్‌ మాత్రం ఈ ఇళ్ళ నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని చాలాకాలం నుండే విమర్శలు చేస్తున్నాడు. ఇక్కడ చదరపు అడుగు నిర్మాణానికి 1900 రూపాయలు అంటున్నారు. ఈమేరకు ప్రజల నుండి దండుకోవాలనుకుంటున్నారు. మాగుంట లే అవుట్‌, ఆదిత్యనగర్‌ లాంటి ఏరియాలోనే చదరపు అడుగు 2వేల రూపాయలలో అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు అమ్ముతున్నారు. 'హౌస్‌ ఫర్‌ ఆల్‌' ఇళ్ళకు స్థలం ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంట్‌ ఫ్రీ... ఇన్ని ఫ్రీ పెట్టుకుని చదరపు అడుగు 1900 రూపాయలేంటని, బయట ఏ బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ కట్టినా చదరపు అడుగు 1300 రూపాయలలో పూర్తి చేస్తారని, ఒక్కో ఇంటికి అడుగుకు 600 రూపాయలు మిగులుతాయని, ఇళ్ళ నిర్మాణం బాధ్యతను తనకు అప్పగించినా 1300 రూపాయలతో పూర్తి చేస్తానని అనిల్‌ వాదిస్తున్నాడు. తెలంగాణలో చదరపు అడుగు 1300 రూపాయలకే ఇస్తున్నారని, ఇక్కడ 1900 రూపాయలకు ఇస్తున్నారంటే ఎన్ని వందల కోట్ల దోపిడీ జరుగుతుందో అర్ధం చేసుకోవాలంటున్నాడు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులను సైతం కలుపుకుని హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్ళ నిర్మాణంలో అవినీతిపై ధ్వజమెత్తుతూ మంత్రి నారాయణపై దాడి చేస్తున్నాడు.

anilనెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల కోసం ఈ నెల 26వ తేదీ నుండి ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈనెల 17వతేదీన నెల్లూరు లోని ఎం.సి.ఎస్‌ కళ్యాణ మండపంలో వైయస్సార్‌ కుటుంబం ముగింపు సభ మరియు నియోజకవర్గ వైసిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 21వ తేదీన చేపట్టాల్సిన ప్రజాదీవెన కార్య క్రమాన్ని 'వై.యస్‌.ఆర్‌ కుటుంబం' కార్య క్రమం కారణంగా ఈనెల 26కు వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజాదీవెనలో నగరం లోని ప్రతి ఇంటికొస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. జగనన్న చెప్పిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తామని, ప్రజల దీవెనలతో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. నెల్లూరు నగరంలో 'వైయస్‌ఆర్‌ కుటుంబం' ఎంతో విజయవంతమైందని, 40వేల కుటుంబాలు పార్టీకి చేరువయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ ఎం.ద్వారకానాథ్‌, కార్పొరేషన్‌ వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవేం నోర్లు... ఇవేం మాటలు

mlas vivమొన్నటి దాకా నెల్లూరు రాజకీయాలు బాగా చప్పగా వుండినాయి. నేతల మాటల్లో పదునుండేది కాదు. వాడి వేడి విమర్శలుండేవి కావు. దానికి కారణం అంతా అడ్జస్ట్‌మెంట్‌ రాజకీయం. జిల్లా మంత్రి నారాయణ రాజకీయ నాయకుడు కాదు. అతనికి రాజకీయంగా ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పటికీ అతనిని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ బాగానే కలబెట్టాడు. ఆయనకు రాజకీయంగా లోతు తెలియక ''నన్ను ఒక వైపే చూడండి... రెండోవైపు చూడాలనుకోవద్దు, మాడి మసైపోతారు' అంటూ సినిమా డైలాగ్‌లు వదిలాడు. నారాయణ భలే చిక్కాడురా అనుకుని అనిల్‌ కుమార్‌యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు తమ విమర్శలతో మంత్రి బట్టలు విప్పదీసి రోడ్లో నిలబెట్టారు. రాజకీయ విమర్శలు ఎంత రోతగా ఉంటాయో అర్ధం చేసుకున్న నారాయణ ఆ తర్వాత వాళ్ల జోలికి పోవడం మానుకున్నాడు.

ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడైతే తెలుగుదేశంలో చేరాడో, అప్పటినుండే నెల్లూరు నగరంలో రాజకీయ సెగలు మొదలయ్యాయి. వివేకా పక్కా రాజకీయ నాయకుడు. ఈయనకు కొత్తగా ఎవరూ గుడ్డలూడదీయాల్సిన పని లేదు. ఎందుకంటే గుడ్డలిప్పుకుని ముందుగానే ఆయన రోడ్డు మీద నిలబడి ఉంటాడు. అవతల వాళ్లను కూడా గెలికి గొడవ పెట్టుకోవడం ఈయన స్కూల్‌ రోజుల్లోనే నేర్చుకున్న విద్య. వివేకా తెలుగుదేశంలోకి వచ్చాక నగర రాజకీయం ఏ స్థాయిలో వేడిపుట్టిస్తుందో చూడండి... మిస్టర్‌ 420... లత్‌కోర్‌... కుర్రకుంక... ముసలి నక్క... డాల్‌ డకార్‌... అలబరోళ్ల సంఘం అధ్యక్షుడు... రాజకీయ సంకరజాతి వ్యక్తి... పిచ్చికుక్కను తిరిమినట్లు... రాజకీయ అఘోరా... ఉన్మాది... నరమాంసం మరిగిన పులులు... ఫేస్‌ టు ఫేస్‌ తేల్చుకుందాం... వెధవకూతలు... కారుకూతలు... ముదురుకుంక... వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నాయి ఈ మాటలు, విని కూడా ఎంత కాలమైందో... అప్పు డెప్పుడో ఆనమోళ్లకు సోమిరెడ్డికి మధ్య, ఆదాలకు సోమిరెడ్డికి మధ్య విమర్శల యుద్ధం జరిగినప్పుడు ఈ స్థాయి కాకున్నా, ఒక రకమైన మాటలు విన్నాం. ఇప్పుడు ఆనం వివేకా - కోటంరెడ్డి, అనిల్‌ల మధ్య జరుగుతున్న వార్‌లో ఈ మాటలను విన్నాం. ఒకరు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తయితే మిగిలిన ఇద్దరూ ప్రస్తుత ఎమ్మెల్యేలు. ఒకరినొకరు ఏ మాత్రం తగ్గకుండా భాషాప్రయోగం జరుపుతున్నారు. తిట్ల పురాణంలో తమ టాలెంట్‌ను చూపించుకున్నారు. తెలుగుదేశంలోకి వచ్చాక తానేంటో తన నోటి పవరేంటో చూపించాలి కాబట్టి ఆనం వివేకా ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌ను 420అని తిట్టాడు. జగన్‌ను తిడితే కోటంరెడ్డి, అనిల్‌లు స్పందిస్తారని వివేకాకు తెలుసు. ఆయనకు కావాల్సింది కూడా అదే! ఎందుకంటే వైకాపాలో యాక్టివ్‌గా వుండేది, చంద్రబాబు మీద గాని, జిల్లా మంత్రి నారాయణ మీద గాని విమర్శలతో చెలరేగేది వీళ్లిద్దరే! వీళ్లిద్దరి మీద ప్రతి దాడి చేస్తే జిల్లా తెలుగుదేశం పార్టీలో వివేకానే లీడ్‌ తీసుకున్నట్లవుతుంది. జిల్లాలో వైకాపా నేతలను గట్టిగా ఎదుర్కొనేది వివేకా ఒక్కడేనన్న పేరొస్తుంది. అందుకే వివేకా ముందు జగన్‌ను తిట్టాడు. దాంతో కోటంరెడ్డి, అనిల్‌లు తీవ్రంగా స్పందించడంతో తన వ్యూహం ఫలించిందనుకుని వారి మీద పడ్డాడు వివేకా. వీళ్లు కూడా వివేకాను గతంలో ఏ నాయకుడూ విమర్శించని... దీనికంటే తిట్టని రీతిలో తిట్టారు. కోటంరెడ్డి, అనిల్‌లు అనే మాటలను వివేకా గాని, వివేకా అనే మాటలను వీళ్లు గాని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లు పక్కా రాజకీయనాయకులు. అబ్బా... ఏందిరా

వీళ్లు ఇలా తిట్టుకుంటున్నారని నోరెళ్లబెట్టి చూసే జనమే అమాయకులు.

పొలిటికల్‌గా జిల్లాలో ఎవరి లీడ్‌ వాళ్లు తీసుకున్నారు. జిల్లా తెలుగుదేశంలో చంద్రబాబు, నారాయణల మీద మాట పడనివ్వని నాయకుడిగా వివేకా పొజిషన్‌ తీసేసుకుంటే, జగన్‌ మీద ఈగ వాలినా ఒప్పుకోమనే లీడర్లుగా కోటంరెడ్డి, అనిల్‌లు గుర్తించబడ్డారు ఓన్లీ ఈ ఎపిసోడ్‌ ద్వారా!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ప్రశాంతతే.. మా లక్ష్యం!
  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
 • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
  మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
 • రాజకీయ దారులు వేరవుతాయా?
  నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
 • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
  ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
 • ఆనంతో... అదనపు బలం!
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter