tdpచంద్రబాబునాయుడు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక జరిగిన అన్ని ఎన్నికలలోనూ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానాన్ని మహిళలకు ఇస్తూ వచ్చాడు. 1999లో వెంకట గిరిని సినీ నటి శారదకు, 2004లో గూడూరును ఉక్కాల రాజేశ్వ రమ్మకు, 2014 ఎన్నికల్లో గూడూరు సీటును డాక్టర్‌ బి.జ్యోత్స్న లతకు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆ కాన్సెప్ట్‌ను అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక సీటును మహిళలకు గాని లేదంటే మైనార్టీలకు గాని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన గూడూరు సీటును ఈసారి వైకాపా నుండి జంప్‌ చేయించిన సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌కే ఇవ్వొచ్చు. కాబట్టి అక్కడ ఆశ లేదు. వున్న అవకాశమల్లా నెల్లూరుసిటీ లేదంటే సూళ్ళూరుపేట! ఈ రెండు సీట్లలోనే ప్రయో గాలు చేయగలరు! మహిళలకు నెల్లూరుసిటీ లేదా సూళ్లూరుపేట లలో దేనినైనా ఇవ్వొచ్చు. సూళ్ళూరుపేట అయితే ఎస్సీ మహిళను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పరసా రత్నం మీద వ్యతిరేకత బలంగా వుంది. స్థానికంగా వున్న టీడీపీ నాయకులు ఈసారి అభ్యర్థిని మార్చాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా అభ్యర్థి పోటీకి అవకాశముంది. ఇక రెండోది నెల్లూరు నగరం. ఇక్కడ జనరల్‌ మహిళ లేదంటే మైనార్టీలకు సీటివ్వడానికి అవకాశముంది. మహిళలకే సీటివ్వాలనుకుంటే మాజీమున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధతో పాటు పార్టీలో ఇటీవల కీలకంగా మారిన వసంత లక్ష్మి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మెన్‌ శ్రీమతి వసంతలక్ష్మి లాంటి వాళ్ళున్నారు. నెల్లూరు నగరంలో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి ఆ వర్గానికి చెందిన వారికి కూడా అవకాశముంది. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఈ ప్రయత్నాల్లోనే వున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న 10సీట్లలో టీడీపీ నుండి ఒక సీటు మైనార్టీలకు గాని మహిళలకు గాని గ్యారంటీ అని చెప్పొచ్చు.

tddతిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని త్వరలో భర్తీ చేసే అవకాశా లున్నాయి. టీటీడీ ఛైర్మెన్‌ పదవి కోసం రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్‌లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీలకు టీటీడీ ఛైర్మెన్‌ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో తెరపైకి కొత్త ఆశావహులొచ్చారు. ఇందులో నెల్లూరు జిల్లా నాయకులు కూడా ఉండడం విశేషం. 2014ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేసి గట్టి పోటీనిచ్చి ఓడిపోయిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నాడు. చంద్రబాబు మనసుపెట్టి ఆదేశిస్తే టీటీడీ ఛైర్మెన్‌గా పనిచేసి చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో అన్ని విధాలా నష్టపోయిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎటువంటి పదవులు ఇవ్వలేదు. పార్టీలో మాత్రం బాధ్యతలు పెంచారు.

రాజధాని కమిటీసభ్యులుగా వున్న బీద మస్తాన్‌రావు బీసీ వర్గాల తరపున టీటీడీ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడు బిఎంఆర్‌. పార్టీకి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు. పార్టీని కష్టకాలంలో వీడకుండా నడిచాడు. 2014 ఎన్నికల్లో కావలి నుండి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత రాజ్యసభ సీటును ఆశించాడు. అయితే అది నెరవేరలేదు. ఇప్పుడు టీటీడీ ఛైర్మెన్‌ పదవికి రేస్‌లో వున్నట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ పేరు కూడా మహిళా కోటాలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా వినిపిస్తోంది. జిల్లాలో ఎవరికి ఛైర్మెన్‌ పదవి వచ్చినా రాకున్నా వీరిలో ఒకరికి మాత్రం టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా అవకాశం రావచ్చు.

anuradhaతెలుగుదేశంపార్టీకి సంబంధించి జిల్లాలో చెప్పుకో దగ్గ మహిళా నాయకురాలు టి.అనూరాధ! పార్టీలో ఎంపీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ల స్థాయిలో పనిచేసిన మహిళా నాయకురాళ్ళు ఇప్పుడు కనిపించకపోయినా, అనూరాధ మాత్రం మొదటి నుండి ఇప్పటి వరకు పార్టీలో ఒకే స్థాయిలో వుంది. ఒకే పని విధానంతో నడుస్తోంది.

2000 సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌గా విజయం సాధించిన ఆమె ఐదేళ్లపాటు ఆ పదవిలో పద్ధతిగా రాణించింది. ఆనం వివేకా వంటి రాజకీయ ఎక్స్‌పర్ట్‌ను బలంగానే ఢీకొట్టి నిలిచింది. భర్తచాటు భార్యగా రాజకీయాల్లోకి వచ్చినా, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా తన పరిపాలనలో భర్త ముద్ర లేకుండా చేసుకుని పరిపూర్ణ మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందింది. పార్టీ అధికారంలో లేని ఈ పదేళ్లు కూడా పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని వుంది. జిల్లాలో మహిళానాయకురాళ్ల పరంగా చూస్తే ప్రాధాన్యతనివ్వాల్సిన నాయకురాలు అనూరాధ. నామినేటెడ్‌ పదవుల్లో ఆమె 'నుడా' ఛైర్మెన్‌ను ఆశించింది. కాని దానిని కోటంరెడ్డి శీనయ్యకు దాదాపు ఖరారు చేశారు. దీంతో ఆమెను టీటీడీ బోర్డు సభ్యురాలిగానో, లేక మహిళా కమిషన్‌ సభ్యు రాలిగానో నియమిస్తారని సమాచారం. కాని ఆమె మాత్రం ఛైర్మెన్‌ స్థాయి పోస్ట్‌కే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter