bjpఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులు మూడేళ్ళుగా ఓ సందిగ్ధావస్థలో వున్నారు. వాళ్ల మనసుల్లో వున్న భావాలను బయటకు చెప్పలేకపోతూ వచ్చారు. కేంద్రంలో మాది నీతివంతమైన పాలన అని చెప్పుకోగలిగారేగాని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించలేకపోయారు. ప్రధానిగా నరేంద్ర మోడీ చేస్తున్న

అభివృద్ధిని చెప్పుకోగలిగారేగాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి ముసుగులో చేపట్టిన అక్రమాలను ఎదిరించలేకపోయారు. దీనికంతటికీ కారణం మిత్రపక్షం అనే ధర్మం అడ్డు రావడం. తెలుగుదేశం ప్రభుత్వంలో తామూ భాగస్వాములమై ఉండడం.

దాదాపు మూడేళ్ళుగా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులందరు కూడా తమ నోర్లు కట్టేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తమకు నచ్చకున్నా, చంద్రబాబు పరిపాలన ఘోరంగా వుండి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నా ఇంతకాలం బీజేపీ నాయకులు ప్రజల పక్షాన నిలబడి పోరాడలేకపోయారు. మిత్రపక్షం అనే ముసుగు వారి కాళ్ళకు బంధాలు బిగిస్తూ వచ్చింది. అదీగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు గాని, బీజేపీ నుండి మంత్రి పదవులు పొందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు గాని తెలుగుదేశమే మా పార్టీ, చంద్రబాబే మా నాయకుడు అన్నంతగా లీనమైపోవడంతో మిగతా బీజేపీ నాయకులకు వాయిస్‌ లేకుండా పోయింది.

అయితే ఇంతకాలం తెలుగుదేశం మీద నిలువునా రగిలిపోతూ బయటకు చెప్పుకోలేక బాధపడుతున్న బీజేపీ నాయకులకు వైకాపా అధినేత వై.యస్‌.జగన్‌ ద్వారా ఓ మంచి అవకాశం వచ్చింది. వై.యస్‌.జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై తెలుగుదేశం నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగడం తెలిసిందే!

తొలిసారిగా తెలుగుదేశంపై తిరగబడే అవకాశం బీజేపీ నాయకులకు ఈ రూపంలో వచ్చింది. ఇప్పటివరకు వున్న మిత్రపక్షం ఆంక్షలను పక్కనపెట్టేసి బీజేపీ నాయకులందరూ కూడా తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా మోడీనే విమర్శిస్తారా? జగన్‌తో మాట్లాడకూడదని రాజ్యాంగంలో రాసుందా? ఒక ప్రతిపక్ష నేత ప్రధానిని కలిస్తే తప్పేంటంటూ పచ్చనేతలపై ముప్పేట దాడి చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజులతో పాటు అన్ని జిల్లాల్లోనూ బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మన ప్రధానిని వాళ్ళు అన్నేసి మాటలంటుంటే మీరు నోరు మూసుకుని వుంటారా అని గదమాయించేసరికి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావులు కూడా నోర్లు తెరచి దేశం నాయకుల తీరును తప్పుపట్టారు.

రాష్ట్రంలో విస్తరించాలని, పార్టీని ఇంకా శక్తివంతం చేయాలన్న స్థానిక నాయకుల ఆకాంక్షకు తెలుగుదేశంతో పొత్తే ప్రతిబంధకమవుతుంది. ఆ పార్టీతో పొత్తు లేకపోయి వుంటే ఈ పాటికి రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన పక్షంగానే ఎదిగి ఉండేది. కనీసం ఇప్పటి నుండైనా తెలుగుదేశాన్ని వదిలించుకుని రాష్ట్రంలో సొంతంగా ఎదుగుదామన్న బీజేపీ నేతల ఆశలకు జరిగిన సంఘటనలను అంకురార్పణగా చెప్పుకోవచ్చు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • బ్రదర్స్‌ దారెటు?
    ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • నగర కిరీటం జయకేనా?
    జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
  • గుంతలా!..మత్యు గుహలా!..
    జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter