cm modiనాలుగేళ్ళ చంద్రబాబు పాలనలోని పాపాలను బీజేపీ బయట పెట్టబోతోందా? బాబు విధానాలలోని వైఫల్యాలను ఎత్తి చూపనుందా? కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలేవంటూ బొక్కలు వెదకనుందా? ఇది మీ అవినీతి చిట్టా అంటూ చీటీ చించబోతుందా? ఓటు-నోటు కేసును తిరగతోడనుందా? పోలవరం అంచనా వ్యయం పెంపులో బాబు అక్రమాలను ప్రశ్నించబోతుందా? వైరిపక్షాలతో జతకట్టి తెలుగుదేశం పార్టీని కకావికలం చేయనుందా? రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలివి.

నిజమే ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే త్వరలో వీటిలో కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు లభించే అవకాశాలు లేకపోలేదు.

బీజేపీ అధిష్టానం ఆపరేషన్‌ ఆంధ్రను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జమ్మూ-కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో సైతం బీజేపీ జెండాను రెపరెపలాడించిన రాంమాధవ్‌ను ఏపి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. రాంమాధవ్‌ వెనువెంటనే రంగం లోకి దిగడం కూడా జరిగింది. ఏపిలో తెలుగుదేశం అవినీతిపై, చంద్రబాబు పాలనా వైఫల్యాలపై ఎదురుదాడి చేయండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నుండి రాష్ట్ర బీజేపీ నాయకులకు సందేశాలు అందాయి. రాష్ట్రంలో తెలుగుదేశంను దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన వుండబోతోంది. అయితే రాష్ట్రంలో సొంతంగా అంత సీన్‌ బీజేపీకి లేదు. రాజకీయంగా ఆ పార్టీ చాలా తక్కువుగా వుంది. దీనికితోడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. జిఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఆ పార్టీ తెలుగుదేశంను ఏమీ చేయలేదు. ఇందుకోసం ఆ పార్టీ ఎంచుకున్న మార్గం జనసేన. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబు, లోకేష్‌లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన అవినీతి ఆరోపణలతో తెలుగు దేశం నాయకుల కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ ముందు క్షణం వరకు కూడా పవన్‌కళ్యాణ్‌ మా వాడు అనే వాళ్ళను కుంటున్నారు. పవన్‌ ఇచ్చిన ఊహించని షాక్‌తో వాళ్ళకు ఏ విధంగా ముందుకు పోవాలో తెలియలేదు. పవన్‌కళ్యాణ్‌ ఇక మనోడు కాదని, అతను బీజేపీ ట్రాప్‌లో పడ్డాడని వీళ్ళకై వీళ్ళు నిర్ధారించుకున్నాక అనుకూల మీడియా ద్వారా పవన్‌పై ఎదురుదాడి మొదలుపెట్టించారు.

బీజేపీ చర్యలు ఏ విధంగా ఉండబోతాయన్నదానిపైనే చంద్రబాబులో ఆందోళన వుంది. బీజేపీ వైపు నుండి కేవలం రాజకీయ దాడి మాత్రమే వుండదు. ఒక నాయకుడిని టార్గెట్‌ చేస్తే ఎంతలా తొక్కుతున్నాడో ఒక లాలూను, ఒక శశికళను చూస్తే అర్ధమవుతుంది. చంద్రబాబు మీద 'ఓటు-నోటు' కేసుతో పాటు పలు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో వున్నాయి. వీటన్నింటి మీద ఆయన 'స్టే'లు తెచ్చుకుని వున్నాడు. ఈ నాలుగేళ్ళలో 24మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను వైసిపిలో నుండి లాగాడు. కొన్నాడని చెప్పొచ్చు కూడా! నలుగురు వైసిపి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కాడు. ఇక పరిపాలనా పరంగా చూస్తే అన్నీ వైఫల్యాలే! అమరావతి రాజధాని అని చెప్పి ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని కోట్లు దుబారా చేసాడో లెక్కే లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ను నేనే కడతానని చెప్పి 16వేల కోట్ల అంచనా వ్యయాన్ని 56వేల కోట్లకు తీసుకెళ్లాడు. కేంద్రం ఇచ్చిన నిధులను తన ఆర్భాటపు కార్యక్రమాలకు మళ్ళించాడు. కేంద్రం నిధులతో అమలు చేయాల్సిన పథకాలకు తన పేరు పెట్టుకున్నాడు. పుష్కరాలు, తాత్కాలిక ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల పేరుతో వేలకోట్ల అవినీతి జరిగింది. వీటన్నింటిలో దేని మీద విచారణ చేయించినా చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు.

మరి బీజేపీ వూరుకుంటుందా? వారి ఆలోచనలు వారికున్నాయి. రాష్ట్రంలో పవన్‌తో కలిసి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళే అవకాశముంది. పవన్‌ ప్రత్యేకహోదా పోరాటాలు చేస్తాడు. కర్నాటకా ఎన్నికల తర్వాత ఏపికి కేంద్రం ప్రత్యేకహోదా ప్రకటించే అవకాశా లున్నాయి. ఎందుకంటే ముందుగా ఏపికి హోదా ఇస్తే కర్నాటకా ఎన్నికల్లో ఆ ప్రభావం బీజేపీపై పడుతుంది. కాబట్టే కర్నాటక ఎన్నికల తర్వాత ఏపి ఎన్నికలకు ముందు హోదా ప్రకటన వుండొచ్చు. జగన్‌, పవన్‌ చేసిన పోరాటాల వల్లే ప్రత్యేకహోదా ఇచ్చా మనే సంకేతాలు రావచ్చు. బీజేపీ వాళ్ళు జగన్‌ జోలికైతే పోరు. ఎందుకంటే అతని మాట మీద నిలబడే నైజం వారికి ఇష్టమే. ఒక్క చంద్రబాబు నైజమే వారికి సరిపడడం లేదు. అందుకే చంద్రబాబును టార్గెట్‌ చేశారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ మొదలుపెడతారో, ఎక్కడ నరుకుతారో అర్ధం కాక చంద్రబాబుకు దడ పట్టుకుంది.

chandra'మన్మధుడు' సినిమాలో సీన్‌ ఇది... బ్రహ్మానందం ఇంటికి నాగార్జున, సోనాలిబింద్రే వస్తారు. అక్కడ బ్రహ్మానందం భార్యగా ఒక నల్లజాతి మహిళ ఉండడాన్ని చూసి మీది లవ్‌ మ్యారేజీనా అని నాగార్జున అడుగుతాడు. దానికి బ్రహ్మానందం... ముందు ఆమె నన్ను ప్రేమించింది... తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు. ఇదే సీన్‌ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంది. కేంద్రంలోని బీజేపీ వాళ్ళు చంద్రబాబును దూరంగా వుంచారు. దాంతో ఆయన వారికి దూరం కావాల్సివచ్చింది.

''అత్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు...'' అనే పాత సామెత అందరికీ తెలిసిందే! కేంద్ర కేబినెట్‌ నుండి తెలుగుదేశం మంత్రులు అశోక గజపతిరాజు, సుజనాచౌదరిలు బయటకొచ్చేసారు. వారు తమ పదవులకు రాజీనామాలు చేసారు. ఏపి విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు కేంద్ర కేబినెట్‌ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ కూడా రాష్ట్ర కేబినెట్‌ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాల రావు కేంద్రమంత్రుల కంటే ముందే తమ పదవులకు రాజీనామాలు చేసేసారు.

చంద్రబాబు ఇంత సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం జగన్‌! ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అతను ఉధృతం చేసాడు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది జగనేనని, ఈ విషయంలో చంద్రబాబు, ఆయన ఎంపీలు డ్రామాలాడుతున్నారన్న విషయం ప్రజలకు అర్ధమైపోయింది. జగన్‌ ప్రత్యేకహోదా

ఉద్యమాన్ని డైవర్ట్‌ చేయడం కోసం మధ్యలో జేఏసీ పేరుతో పవన్‌ కళ్యాణ్‌ను పంపిం చినా అది సక్సెస్‌ కాలేదు. ప్రత్యేక హోదా ఉద్యమం ఢిల్లీ స్థాయికి చేరకుండా, రాష్ట్రంలో చప్పబడిపోయుంటే చంద్రబాబు బీజేపీతో ఎలాంటి పేచీలు పెట్టుకుని వుండేవాడు కాదు. కేంద్ర కేబినెట్‌ నుండి మంత్రులను బయటకు రప్పించేవాడూ కాదు. ఎందుకంటే కేంద్రం ప్రత్యేకహోదా లేదు ప్రత్యేకప్యాకేజీ ఇస్తామన్నప్పుడు చప్పట్లు కొట్టి స్వాగతించింది చంద్రబాబే! ఆ ప్రత్యేకప్యాకేజీ క్రిందే వాళ్ళు నిధులిస్తు న్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగు తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు సమ ర్పిస్తే మళ్ళీ నిధులు ఇస్తామంటున్నారు. కాని కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు వద్ద లెక్కలు లేవు. ఆ నిధులన్నింటిని చంద్రబాబు ప్రభుత్వం తమ ఆర్భాటాల కోసం మళ్ళించింది. వాళ్ళకు లెక్కలు చెప్పాలంటే ఇక్కడ బొక్కలు బయట పడ తాయి. ఈ లెక్కలు ఇవ్వకనే కేంద్రంతో నిధుల పేచీ వచ్చింది. ప్రత్యేకప్యాకేజీ చంద్రబాబు ఒప్పుకున్న సబ్జెక్టే కాబట్టి దీనిని సాకుగా చూపి ఆయన కేంద్ర కేబినెట్‌ నుండి బయటకు రావాల్సిన పనిలేదు.

కేవలం ప్రత్యేకహోదా పోరు క్రెడిట్‌ అంతా కూడా జగన్‌ తన్నుకుపోతున్నాడని, తాను ప్రజల దృష్టిలో విలన్‌ను అవుతున్నా నని గమనించే చంద్రబాబు ఈ మంత్రుల ఉపసంహరణ అంశానికి తెరతీసాడు. అప్పటికీ బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. ఓ పక్క కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అవసరం వున్నా లేకున్నా ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెబుతున్నాడు. చంద్రబాబు మంత్రులు కేబినెట్‌ నుండి వైదొలిగినంత మాత్రాన కేంద్రంలో కదలిక వచ్చి ప్రత్యేకహోదా ఇస్తామని ముందుకొచ్చేదేమీ లేదు. కాబట్టి బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకో వచ్చు. కాని, చంద్రబాబు ఆ సాహసం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మెడపై ఓటు-నోటు కత్తి వేలాడుతోంది. దానిని మళ్ళీ కోర్టు మెట్లెక్కించారంటే చంద్రబాబు పరువు, ప్రతిష్ట పాతాళానికి పోతాయి.

జగన్‌ దెబ్బకు తట్టుకోలేకే మంత్రు లనన్నా ఉపసంహరింపజేసాడు. జగన్‌ అసలు ఉద్యమమే చేయకుంటే చంద్ర బాబుకు అసలు ఈ సమస్యలన్నీ ఉండేవి కావు. కేంద్రం ఇచ్చినవి తీసుకుంటూ, ఆ దేశం ఈ దేశం తిరుగుతూ అమరావతి కథలు చెప్పుకుంటూ హాయిగా ఉండేవాడు.

oppandaluనాలుగేళ్ళుగా జిల్లాలో ఎటువంటి పారిశ్రామికాభివృద్ధి లేదు. దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన పోర్టు, పరిశ్రమలు, సెజ్‌లు తప్పితే ఆయన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చినా ఆశించిన ప్రగతి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇఫ్కో సెజ్‌లో 'గమేషా' పరిశ్రమ తప్పితే ఇంకేమీ రాలేదు. ప్రతి సంవత్సరం పారిశ్రామిక సదస్సులు నిర్వ హిస్తున్నారు. లక్షల కోట్ల ఎంఓయులు కుదుర్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు కూడా భారీఎత్తున పరిశ్రమలు, వేలకోట్ల పెట్టుబడులు అని ఊదరకొడుతూనే వున్నారు. ఈ నాలుగేళ్లలో ఏ పరిశ్రమ ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన మూడురోజుల పారిశ్రామిక సదస్సులోనూ లక్షల కోట్లలో ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో 70కంపెనీల దాకా తమ పెట్టు బడులకు నెల్లూరు జిల్లాను ఎంచుకున్నా యని, రమారమి 50వేల కోట్ల పెట్టు బడులు పెట్టొచ్చని తెగ ప్రచారం చేస్తు న్నారు. ఒక్క శ్రీసిటీలోనే 14కంపెనీలు తమ పెట్టుబడులకు ఆసక్తి కనపరిచాయి. ఇక ఎక్కువ కంపెనీలు కృష్ణపట్నం పోర్టు సెజ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొచ్చాయి. వేదాంత ట్రాన్స్‌ఫార్మింగ్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లమిటెడ్‌, ఇండస్‌ కాఫీ వంటి పెద్ద కంపెనీలు కృష్ణపట్నం వైపే మొగ్గు చూపాయి.

నిజంగా ఒప్పందాల ప్రకారం జిల్లాకు పరిశ్రమలు వస్తే అంతకుమించిన ఆనందం ఇంకొకటి లేదు. ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో సగం కంపెనీలు తమ పరిశ్రమలను స్థాపించినా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీయ డంతో పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొదట వై.యస్‌. మరణంతో, ఆ తర్వాత నోట్ల రద్దుతో చావుదెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపిరి పీల్చుకుంటుంది.

ఏ కంపెనీ అయినాసరే తమ పెట్టు బడులు పెట్టడానికి రాష్ట్రంలోనే ప్రస్తుతం అనువైన ప్రాంతం నెల్లూరుజిల్లా. పరిశ్ర మల స్థాపనకు కావాల్సినంత భూమి

ఉంది. రవాణా వసతులున్నాయి. పరిశ్ర మలు పెట్టేవాళ్ళకు రాజకీయంగా కూడా ఇబ్బందులుండవు. ఇలాంటి జిల్లాలో పెట్టుబడులకు ఎవరైనా ముందుకొస్తారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రకటించలేదు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే దిశగా ఎలాంటి నిర్ణయాలు లేవు. అలాంటప్పుడు వూరికే పెట్టుబడులతో రమ్మంటే వస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఒక పారిశ్రామిక విధా నాన్ని అమలులోకి తెస్తే పరిశ్రమలు ఏపి వైపు, అందులోనూ నెల్లూరుజిల్లా వైపు ఎక్కువుగా పరుగులు తీయొచ్చు. లేదంటే గత నాలుగేళ్లలో జరిగిన ఎంఓయుల మాదిరిగానే ఇవి కూడా ఒట్టి ఒప్పందా లవుతాయి.

Page 1 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వణికిస్తున్న సైకో
  ప్రజలకు ఏ భయం పట్టుకుంటే ఆ భయం కొద్ది రోజుల పాటు వెంటా డుతూనే వుంటుంది. ఒకచోట దొంగ తనం జరిగితే ఎవరిని చూసినా దొంగ లను చూసినట్లే చూస్తారు. ఒకచోట చైన్‌ స్నాచింగ్‌ జరిగితే... ఎవరిని చూసినా చైన్‌ స్నాచర్‌లు…
 • ఆదాయం వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ ఆస్థి పన్నులపై ఏదీ?
  నెల్లూరుజిల్లాలోని మునిసిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ పన్నుల వసూళ్ళలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 కార్పొరేషన్లు ఉండగా పన్నుల వసూళ్ళలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ 11వ స్థానంలో వుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో మొత్తం 1,17,456 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్‌…
 • అన్ని సీట్లూ ఇక తమ్ముళ్ళకే!
  ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం వైదొలిగింది. దీనిపై నెల్లూరుజిల్లా తెలుగు తమ్ముళ్ళు రెండు విధాలుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అందుకే దూరంగా వచ్చేసామని ముస్లింలు, క్రిస్టియన్‌ల దగ్గరకుపోయి ఓట్లు అడగొచ్చు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి…
 • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యం.పి., రాజ్యసభ
  నేను నేనుగా బ్రత కడం కాదు, నేను నలుగురి కోసం బ్రత కడం, నలుగురికి బ్రతుకు నివ్వడం, బ్రతికే మార్గాన్ని చూపించడం... భవిష్యత్‌ పై ఆశలు కల్పించడం, పది మందికి నేనున్నాననే భరోసా ఇవ్వడం... ఈ మార్గాన్ని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తే…
 • పవన్‌కు తోడైన 'సింహపురి పవర్‌'
  పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో అత్త పాత్రధారి నదియాతో... ''నీ వెనుక తెలియని అదృశ్యశక్తి ఏదో ఉందమ్మా, అది వున్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు''అని పోసాని కృష్ణమురళి అంటాడు. ఆ తరహాలోనే ఇప్పుడు పవర్‌ స్టార్‌…

Newsletter