congressరాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేందుకు పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పట్టిన దుస్థితి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీని ఆదుకున్న రాష్ట్రమిది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టే ముందువరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురన్నది లేదు. కాంగ్రెస్‌ను, ఇందిరాగాంధీ కుటుంబాన్ని అంతగా ఆదరించారు ఆంధ్రులు. ఆదుకున్న ఆంధ్రులతోనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆడుకుంది. దానికి తగిన మూల్యం చెల్లించుకుంది.

ఈ దేశంలో పెద్ద రాష్ట్రాలలో కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపోయినా ఆంధ్రప్రదేశ్‌ అండగా నిలిచింది. 2004, 2009లలో కేంద్రంలో కాంగ్రెస్‌ రెండుసార్లు అధికా రంలోకి వచ్చిందంటే అందుకు కారణం ఈ రాష్ట్రం నుండి మెజార్టీ లోక్‌సభ సీట్లు అందించడమే. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేజేతులా ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర విభజన అనే కొమ్మకు తన ఉరితాడు తానే బిగించుకుంది. 2014 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బ్రతుకు, భవిష్యత్‌ ఏంటన్నది అర్ధమైపోయింది. ఒక్క సీటు రాకపోగా కనీసం పోటీ చేసిన స్థానాల్లో ఒకటి, రెండు చోట్ల తప్పితే డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014 ఎన్నికలలోనే కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి తెలిసి ఆ పార్టీలో వున్న సీనియర్‌ నాయకులు చాలామంది తెలుగుదేశం, వైకాపాలలో చేరిపోయారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీ పరంగా కీలకపదవుల్లో వున్న కొందరు నాయకులు మాత్రం వెంటనే కాంగ్రెస్‌ నుండి బయటకు రాలేకపోయారు.

కాని, నిన్న నంద్యాల, కాకినాడ ఎలక్షన్‌లు చూసాక మిగిలిన నాయకులెవరు కూడా కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల నాటికి మిగిలిన సీనియర్లు ఎవరు కూడా కాంగ్రెస్‌లో వుండకపోవచ్చు. కిరణ్‌కుమార్‌రెడ్డి,

ఉండవల్లి అరుణ్‌కుమార్‌, కెవిపి రామచంద్రరావు, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రఘువీరారెడ్డి, చింతా మోహన్‌ వంటి నాయకులందరు కూడా వైకాపా లేదా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది నాయకులు వైకాపా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుకాణాన్ని పూర్తిగా మూసేసే రోజులు దగ్గరపడ్డాయనే చెప్పవచ్చు.

simaరాజకీయాలలో పక్కా ప్లానింగ్‌, అంచనా, వాస్తవ దృష్టి, సమయస్ఫూర్తి, ప్రత్యర్థుల కోటల్లోకి సైతం జొరబడే తత్వం, ఆత్మపరిశీలన, స్థానిక పరిస్థితు లపై అవగాహన... ఇన్ని వుంటేనే రాణించగలరు. ముఖ్యంగా గాలివాటాన్ని, సానుభూతిని, ప్రభంజనాలను నమ్ముకున్న వాళ్ళు ఎక్కువకాలం రాజ కీయాలలో నిలువలేరు.

చంద్రబాబు ఎన్టీఆర్‌లా ప్రజాకర్షణ వున్న నాయకుడో, వై.యస్‌.లా ప్రజాభి మానం సంపాధించుకున్న నాయకుడో కాదు. అయినా 2014 ఎన్నికల్లో అధికా రంలోకి వచ్చాడు. కారణం రాష్ట్ర రాజ కీయాలపై ఆయనకున్న అవగాహన. సామాజిక సమీకరణలపై అతనికున్న విషయ పరిజ్ఞానం. రాష్ట్ర ప్రజల ఆలో చనా విధానాలపై అతనికున్న గురి. కాపుల ఓట్లకు రిజర్వేన్‌, పవన్‌ల గాలం, మహి ళలు, రైతుల ఓట్లకు ఋణమాఫీ వల, విద్యార్థులు, ఉద్యోగార్ధుల ఓట్లకు నిరు ద్యోగ భృతి ఎర... ఇలా ఒక్కో వర్గాన్ని ఒక్కో రకంగా బుట్టలో పెట్టి కప్పేసాడు. 2014లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేయలేక సతమత మవుతున్నాడు. అయినా కూడా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలుపు కోవాలి, అందుకు ఏం చేయాలి, ఆ స్టేట జీనే చంద్రబాబు అమలు చేయబోతు న్నాడు. ఏపిలో ఇప్పుడు ఎవరు అధికారం లోకి రావాలన్నా రాయలసీమ, కోనసీమ సీట్లు ముఖ్యం. 2014 ఎన్నికల్లో చంద్ర బాబు రాయలసీమలో దెబ్బతిన్నా కోన సీమలో స్వీప్‌ చేసి అధికారంలోకి రాగలి గాడు. వచ్చే ఎన్నికల్లో కోనసీమలో మళ్ళీ అవే సీట్లు అన్నే సీట్లు వస్తాయనే నమ్మకం చంద్రబాబుకు లేదు. అందుకే రాయల సీమపై ఈసారి ప్రత్యేకంగా దృష్టిపెడుతు న్నాడు. ఎంత ప్రభుత్వ వ్యతిరేకత వున్నా, సామాజిక సమీకరణలను బట్టి విజయ నగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో టీడీపీదే పైచేయిగా వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసినా సగం సీట్లయినా సాధించుకోవచ్చు. ఇక కృష్ణా, గుంటూరు లలో సామాజిక వర్గం బలంతో పాటు అమరావతి రాజధాని ప్రభావం వుం టుంది. తెలుగుదేశాన్ని తిరిగి గెలిపించు కోకపోతే రాజధాని అభివృద్ధి ఆగిపోతుం దని చెప్పి ఆ రెండు జిల్లాల ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతారని తెలుగుదేశం వర్గాలు నమ్ముతున్నాయి. ఈసారి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుజిల్లాల్లో మెజార్టీ సీట్లు రాకపోయినా సమంగా తెచ్చుకోవాలి. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడపలలో సీట్లు పెంచుకోవాలి. అనంతపురంలో మెజార్టీ సీట్లు వస్తాయి. కాబట్టి అధికారం నిలుపుకోవడానికి అవకాశం వుంది. 1983 నుండి ఇప్పటిదాకా 7సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచిన నియోజకవర్గాలు ఒక్క ఏపిలోనే 45 దాకా వున్నాయి. అంటే అవి పార్టీకి కంచుకోట ల్లాంటివి. అలాంటివాటితో పాటు పార్టీకి అనుకూలంగా వున్న మరో 50 నియోజక వర్గాలను సెలక్ట్‌ చేసుకుని, అక్కడ గెలుపును సునాయాసం చేసుకునే దిశగా తెలుగుదేశం నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కడప, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను గెలవడం, నిన్న నంద్యాల అసెంబ్లీని గెలవడంతో ఈసారి రాయలసీమలోనూ మెజార్టీ స్థానాలు సాధించగలమనే ధీమాను టీడీపీ నాయ కులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం వీళ్ళు రాయలసీమలో బలమైన సామాజిక వర్గంగా వున్న రెడ్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే సమయంలో వైకాపా కూడా ఈసారి అధికారం సాధించాలంటే తెలుగుదేశం కోటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కోన సీమ, ఉత్తరాంధ్రలో దారుణంగా దెబ్బ తినబట్టే అధికారానికి దూరంగా వుండి పోయింది. ఈసారి కోనసీమ జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరిలలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలి. ఉత్తరాం ధ్రలో గతం కన్నా స్థానాలు పెంచుకోవాలి. ఉభయగోదావరి జిల్లాల్లో కనీసం సగం సీట్లన్నా తెచ్చుకోవాలి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో క్రితంసారి వచ్చిన సీట్లు వస్తే చాలు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి మెజార్టీ సీట్లు వచ్చినా, రాయలసీమ జిల్లాలపై గతంలో వున్న పట్టును నిలుపు కోగలిగితే చాలు. వైకాపా అధికారానికి మార్గం సుగమం అయినట్లే!

రాష్ట్రంలో ఇక ప్రభంజనాలు, సానుభూతులు పనిచేయవు. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా సమీకరణలు పనిచేస్తాయి. కాబట్టి ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ప్రణాళికతో వెళ్ళ గలిగిన వాళ్లే వచ్చే ఎన్నికల్లో మొనగా ళ్లవుతారు.

haribabuకేంద్ర మంత్రివర్గ విస్తరణలో విశాఖపట్నం ఎంపి, ఏపి బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు ఎందుకు స్థానం దక్కలేదు? ఒక మిత్రుడు వేసిన ఈ ప్రశ్నకు ఒక రాజకీయ విశ్లేషకుడు ఇచ్చిన సమాధానం... విస్తరణలో మిత్రపక్షాలను తీసుకోలేదు కదా? ప్రశ్న వేసిన మిత్రుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి హరిబాబు బీజేపీ ఎంపీయే కదా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దానికి ఆ రాజకీయ పండితుడు చెప్పిన వివరణ... కంభంపాటి హరిబాబు పేరుకు బీజేపీ ఎంపీయే! ఆయన గెలిచింది ఆ పార్టీ కమలం గుర్తు మీదే! కాకపోతే ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఈ మూడేళ్ల నుండి వంటికి పసుపు పూసుకుని తిరుగుతున్నాడు. 2014లో టీడీపీతో బీజేపీ పొత్తు మాత్రమే పెట్టుకుంది. కాని, హరిబాబు మాత్రం బీజేపీని టీడీపీలో విలీనం చేసామన్నట్లుగా బాబు సేవలో లీనమైపోయాడు. ఏపిలో బీజేపీని గాలికొదిలేసి, తెలుగుదేశం సేవలో తరిస్తున్నాడు. చంద్రబాబు ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, చ్కెభజన చేస్తూన్నాడే గాని ఇదేమని ప్రశ్నించడం లేదు. ఇలాంటి నాయకుడికి కేంద్రమంత్రి పదవి ఇచ్చినా అది తెలుగుదేశంకు కేంద్ర కేబినెట్‌లో మూడో మంత్రి పదవి అవుతుందేగాని, ఏపిలో బీజేపీకి ఒరిగేదేమీ వుండదు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వుండరు. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం హరిబాబు చేసిందేమీ లేదు. తెలుగుదేశం బాగుంటే చాలనుకున్నాడుగాని, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన తన పార్టీ బాగుపడాలనుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వుండి కూడా పార్టీ అభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఆయన కంటే కూడా విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు వంటి నాయకులే ఎంతో నయం. తెలుగుదేశం ప్రజావ్యతిరేక విధానాలపై వాళ్ళు గళం విప్పారు. మిత్రపక్షం కాబట్టి అధికారపక్షం ఏ తప్పులు చేసినా మేం తాళం వేయాలనుకోలేదు. తమకు చేతనైనంతలో సభలోనూ, బయట ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రజల పక్షాన నిలిచే ప్రయత్నం చేశారు. కాని, హరిబాబు పార్టీ పరంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పార్టీ వాయిస్‌ వినిపించలేదు. కేవలం తెలుగుదేశం ఏజెంట్‌గానే మిగిలిపోయాడు. ఈయనకు మంత్రి పదవి ఇచ్చినా అది తెలుగుదేశంకు ఇచ్చినట్లే అవుతుందన్న భావనతోనే చివరి నిముషంలో ఆయనకు మొండి చేయి చూపినట్లుగా తెలుస్తోంది.

Page 1 of 42

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
  గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
 • తప్పెవరిది?
  నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
 • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
  చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
 • ఓటమి నేర్పిన పాఠమేంటి?
  గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
 • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter