bjp2014 ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు అంటే ప్రాంతీయ పార్టీలు ఎగబడే పరిస్థితి. నరేంద్ర మోడీ మేనియా అప్పట్లో ఆ స్థాయిలో వుండింది.

ఏపి, తెలంగాణలోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలని ఆనాడు ఇరు రాష్ట్రాల బీజేపీ నాయకులు భావించారు. కాని, చంద్రబాబు నాయుడు తెలివిగా పావులు కదిపాడు. నరేంద్ర మోడీ ఇమేజ్‌ను ఎలాగైనా వాడు కోవాలనిచెప్పి తన రాజకీయ గురువు రామోజీరావు ద్వారా రిలయన్స్‌ అంబానిని రంగంలోకి దించి, ఢిల్లీ స్థాయిలో పైరవీలు నడిపించి ఎట్టకేలకు ఆనాడు మోడీని టీడీపీతో పొత్తుకు ఒప్పించారు. దాని ఫలితాన్ని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అందుకున్నాడు. అనుభవిస్తున్నాడు.

అప్పుడు అందరి కళ్ళకు బీజేపీ ఐశ్వర్యారాయ్‌... అవే కళ్ళకు ఇప్పుడు కల్పనారాయ్‌లా కనిపిస్తుంది. దేశంలో నరేంద్రమోడీ వ్యతిరేక ఓటు పెరుగు తోంది. ఏపికిచ్చిన ప్రత్యేకహోదా హామీని తుంగలో తొక్కిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అది ఇంకా ఎక్కువుగా వుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ అయినా సరే ఓట్ల రూపంలో చాలా నష్టపోవాల్సి వుంటుంది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో పాటు నోట్లు రద్దు, జిఎస్టీ వంటి అంశాలు ఈ రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. కాబట్టి రాష్ట్రంలో ఆ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీపై ఈ వ్యతిరేకత పడుతుంది.

'ఓటు-నోటు' కేసు లేకుంటే చంద్ర బాబు బీజేపీతో ఎప్పుడో తెగదెంపులు చేసుకుని వుండేవాడు. ఆ కేసు భయం వల్లే వారితో కలిసుంటున్నాడు. ఇప్పుడైనా జగన్‌ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఉధృతం చేసాడు కాబట్టి, బీజేపీ మీద తాను కూడా ఫైట్‌ చేస్తున్నానని చెప్పడానికి తన ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయిం చాడు. ఆ కేసు భయంతోనే ఇంకా ఎన్డీఏను పూర్తిగా వదిలి రాలేదు. ఎన్నికల నోటిఫికే షన్‌ రాగానే ఆ పని కూడా చేసేస్తాడు. అప్పుడు కేసుల భయం అంతగా వుండదు కదా! చంద్రబాబు బీజేపీతో తెంచుకోవ డానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపు తాడు. ఎందుకంటే మొన్న యూపి ఉప ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటల్లాంటి రెండు లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనం. కాబట్టి బీజేపీతో కలిసి పయనించడానికి ఇక చంద్రబాబు సాహసం చేయకపోవచ్చు.

టీడీపీ వదిలేస్తే బీజేపీని వైసిపి తగులుకుంటుందని చాలాకాలం నుండి వూహాగానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపిలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడమంటే దారినపోయే దరిద్రాన్ని కేకేసి పిలవడమే! జగన్‌ అలాంటి పని చేయడు. అదీగాక ముస్లింలు, క్రిస్టియన్‌లే వైసిపికి పెద్ద ఓటుబ్యాంక్‌. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓటు బ్యాంకులో కొంత నష్టం తప్పదు. కాని జగన్‌ ప్రత్యేక హోదాను ఎవరైతే ఇస్తారో వారికి మద్దతు తెలుపుతామని ప్రకటించివున్నాడు. అది ఎన్నికల తర్వాత కావచ్చు... లేదంటే ఎన్ని కల ముందు కూడా కావచ్చు. అయితే వైసిపితో పొత్తు కోరుకుంటే ఎన్నికలలోపే కేంద్రం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే అవ కాశం వుంది. జగన్‌ పోరాటం వల్లే మేం దిగొచ్చి ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చామని కేంద్రం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు బీజేపీతో వైసిపి పొత్తు పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చినందు వల్లే బీజేపీతో కలుస్తున్నామని జగన్‌ చెప్పొచ్చు.

ప్రస్తుతానికైతే రాష్ట్ర రాజకీయాలలో టీడీపీ, బీజేపీలు తన్నుకుంటున్నాయి. వైసిపి మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మా మద్దతు అనే స్టాండ్‌ మీద వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు ఎన్నికల దాకా అనుమానమే! ప్రత్యేకహోదా ఇవ్వకుంటే ఆ పార్టీతో వైసిపి కూడా కలవదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో భాజపాది ఒంటరి పయనమా? లేక జంట ప్రయాణమా? అన్నది చూడాలి!

pawanఈ పవన్‌ కళ్యాణ్‌కు ఏమైంది? చంద్రబాబుతో బెడిసిందా? ప్యాకేజీ గడువు ముగిసిందా? కొత్త ప్యాకేజీ కుదరలేదా? లేక తన అంతరాత్మను ప్రశ్నించుకుని వాస్తవ లోకంలోకి వచ్చాడా? 14వ తేదీ గుంటూరులో జరిగిన 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాన్ని విన్న వారందరినీ తొలిచి వేసిన ప్రశ్నలివే! పవన్‌ అందరికీ పూర్తి షాకిచ్చాడు.

నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రజలు గాని, రాజ కీయ విజ్ఞులు గాని పవన్‌ కళ్యాణ్‌ను ఒకే కోణంలో చూస్తున్నారు. ఆయన చంద్ర బాబు మనిషి... ఆయన ఎలా చెబితే అలా నడుచుకునే నాయకుడు. చంద్ర బాబుకు నొప్పి తెలియకుండా ఆయన బాధను పంచుకునే పార్టనర్‌... ఈ అభి ప్రాయాలు కలగడానికి కారణాలు లేకపో లేదు. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ, టీడీపీల తరపున ప్రచారం చేసాడు. ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత నాదేనన్నాడు. వాళ్ళు మాట తప్పితే ప్రశ్నిస్తానని హామీ ఇచ్చాడు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఇచ్చిన హామీ లను రెండు పార్టీలు కూడా తుంగలో తొక్కాయి. ప్రత్యేకహోదా ఇవ్వమని చెప్పాక పవన్‌కళ్యాణ్‌ నాలుగు చోట్ల మీటింగ్‌లు పెట్టి బీజేపీ మీద విమర్శలు చేసాడు. అంతవరకు బాగానే వుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరి గాయి. అరాచకాలు జరిగాయి. పుష్క రాలు, పట్టిసీమ పేరుతో దోపిడీ, పోల వరం పేరుతో అవినీతి, అమరావతి రాజ ధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, సెజ్‌ల పేరుతో పచ్చని పైర్లు పండే పొలాలు లాక్కోవడం, దళితులపై దాడులు, అధికా రులపై దౌర్జన్యం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం... ఇవేనా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు ఋణమాఫీతో పాటు ఏ ఒక్క హామీని సవ్యంగా అమలు చేయ లేదు.

ఒక విధంగా చెప్పాలంటే ఈ నాలు గేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల లోనూ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఇన్ని ప్రభుత్వ వైఫల్యాలున్నా పవన్‌ కళ్యాణ్‌ ఈ నాలుగేళ్లలో ఏరోజూ, ఏ సభలోనూ ప్రశ్నించిన దాఖలాలు లేవు.

మరి నాలుగేళ్ల తర్వాత ఆయనకు జ్ఞానోదయమైందో, లేక జెఎఫ్‌సి ద్వారా పరిచయమైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లాంటి వారి హితబోధలు పని చేసాయో ఏమో గాని 14వ తేదీ గుంటూరు సభలో తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గురి పెట్టాడు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిని ఎండగట్టాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేల దౌర్జన్యాలను ప్రశ్నించాడు. నాలుగేళ్లలో తొలిసారిగా తెలుగుదేశంపై ఆయన ఘాటుగా మాట్లాడాడు. రాష్ట్రంలో తెలుగు దేశం నాయకులు బరితెగించారు, 2019 ఎన్నికల్లో వైసిపిని ఎదుర్కోవడానికి నియో జకవర్గానికి పాతిక కోట్లు సిద్ధం చేసా మంటున్నారు. ఎంత బరితెగించి అవి నీతికి పాల్పడకపోతే ఇన్నేసి కోట్లు పోగేస్తారు. శేఖర్‌రెడ్డి కేసులో నారా లోకేష్‌ పేరుంది. కాబట్టే నరేంద్ర మోడీకి చంద్ర బాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మీద ఎన్నో అభియోగాలొచ్చాయి. పుండు మీద కారం చల్లడం ఎందుకని నేను ఇంత కాలం ఊరుకున్నాను, ఇక నుండి తెలుగు దేశం అవినీతిని ఎండగడతా అంటూ ఆయన నిప్పులు చెరిగాడు.

తెలుగుదేశం పార్టీకి పవన్‌కళ్యాణ్‌ పంచ్‌లు రివర్స్‌ షాకే! గుంటూరు వద్ద కొన్నిరోజుల క్రితమే పవన్‌ కళ్యాణ్‌ రెండెక రాలలో సొంత ఇంటి నిర్మాణానికి శంకు స్థాపన చేసాడు. చంద్రబాబుతో ప్యాకేజీలో భాగంగానే ఈ రెండెకరాల స్థలం ఇచ్చా రని సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈలోపే షాకిచ్చే విధంగా పవన్‌ మాట్లాడాడు.

నాలుగేళ్ళ క్రితం చేయాల్సిన పని పవన్‌ ఇప్పుడు చేసాడు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పవన్‌ పొత్తు ఉండదన్నది జగ మెరిగిన సత్యమే. ఈసారి తెలుగుదేశంకు ఓట్లేయండని పవన్‌ చెప్పినా ఓట్లు పడవు. జనసేన విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్‌ చీలుస్తాడనే నమ్మకముంది. వ్యతిరేక ఓటు జగన్‌కు పోకుండా పవన్‌కు డైవర్ట్‌ చేసే వ్యూహం కూడా వుండొచ్చు. చంద్ర బాబుపై బలంగా విమర్శలు చేస్తేనే జనం పవన్‌ను నమ్ముతారు. ఇద్దరి మధ్య ప్యాకేజీ ఒప్పందాలలో ఇది కూడా ఒక భాగమై వుండొచ్చని అనుమానించేవాళ్ళూ ఉన్నారు.

వారి అంతర్గత విషయాలు ఎలా వున్నా నాలుగేళ్లలో మొదటిసారి పవన్‌ కళ్యాణ్‌ ప్రజల తరపున మాట్లాడాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. నాలుగేళ్ళుగా ప్రజలు ఆయన నుండి కోరుకుంటున్నది ఇదే! కాకపోతే ఈ నాలుగేళ్లలో జరగాల్సిన అవినీతి, అక్రమాలన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఏ.పి ప్రజల చేతులు కాలాకా పవన్‌ ఆకుల కోసం పరుగెత్తి ఏం లాభం?

variనాలుగు పుట్ల ధాన్యం పండించాలంటే ఒక ఎకరాలో సేద్యం చేయాలి. దుక్కిదున్నే దగ్గర నుండి నారు ఏతలు మొదలుకొని నీళ్ళు, కరెంట్‌, ఎరువులు, పురుగుమందులు, కలుపు కూలీలు, చివరికి కోతల వరకు ఎట్లా లేదన్నా ఎకరాకు 25 నుండి 30వేల పెట్టుబడి అవుతుంది. దిగుబడికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఈ నాలుగు నెలల్లో పెట్టుబడి ఒకెత్తయితే, పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒకెత్తు. అకాల వర్షాల నుండి, ఈదురుగాలుల నుండి, చీడ, పీడల నుండి, సాగునీటి కొరత నుండి పైరును పసిబిడ్డలా కాపాడుకుని గట్టెక్కించాలి. ఇక్కడ రైతు పెట్టుబడితో పాటు అతని శ్రమ, అతని రిస్క్‌... అతని టెన్షన్‌... ఇన్ని కలిస్తేనే ఎకరాకు నాలుగు పుట్లు. అది కూడా బాగా వచ్చిందంటే! ఇప్పుడున్న ధరల ప్రకారమైతే పుట్టికి 15వేలు వేసుకున్నా ఎకరాకు 60వేలు చేతికొస్తుంది. పెట్టుబడి, దానికి వడ్డీలు తీసేస్తే రైతుకు మిగిలేది అంతంతమాత్రం. అంటే 4నెలల కాలంలో అతను పెట్టుబడి పెట్టి, శ్రమపడి సంపాదించినదానికంటే కూడా కేవలం రోజులతేడాలో దళారులు, మిల్లర్లు పెద్దగా శ్రమ లేకుండానే ధాన్యం కొనుగోలు ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. రైతు శ్రమతో రైతుల రిస్క్‌తో మిగతావాళ్ళంతా వ్యాపారం చేసుకుం టున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం 15,500రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. గత ఏడాది ఇదే సీజన్‌లో పుట్టి ధర 17వేల నుండి 20వేల దాకా పలికింది. ఈ ఏడాది రేట్లు బాగా తగ్గి పోయాయి. ఎకరా మీద రైతుకు పెట్టుబడి వ్యయం పెరగగా రాబడికి బాగా కోతపడింది. ధాన్యం నిల్వ చేసుకోవడానికి జిల్లాలో తగినన్ని గోడౌన్‌లు లేవు. దీంతో రైతులు చచ్చినట్లు వచ్చిన ధరకు పంటను అమ్ముకోవాల్సిందే! రైతుల చేతుల నుండి ధాన్యం పూర్తిగా వెళ్ళిపోయాక అప్పుడు రేట్లు పెరుగుతాయి. రైతు అన్యాయ మైతేనే కదా మిగతా వాళ్ళకు ఆదాయాలొచ్చేది!

Page 10 of 76

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter