chandraతప్పు చేయనివాడిలో భయం కనిపించదు. తప్పు చేసినవాడి కళ్ళల్లో భయం కనిపిస్తుంది. తప్పు చేసినవాడి మాటల్లోనూ ఆ భయం దొర్లుతుంది. గుండెల్లో ఆ భయం ఏర్పడ్డప్పుడే నా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు, నా మీదకు వాళ్లొచ్చి నప్పుడు ప్రజలంతా నాకు రక్షణ కవచంలా ఏర్పడి నన్ను కాపాడుకోవాలనే మాటలు వస్తుంటాయి.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల కేసుల భయం పట్టుకుంది. ఆమధ్య 'ఓటుకు నోటు' కేసులో ఇరుక్కుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి కృష్ణా నది కర కట్టకు చేరుకున్నాడు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై మనకు పదేళ్ళ హక్కున్నప్పటికి, అక్కడి ఆస్తులలో వాటా వున్నప్పటికీ అన్నిటినీ వదిలేసి వచ్చాడు.

రాష్ట్రంలో జగన్‌ మండించిన ప్రత్యేకహోదా ఉద్యమం పుణ్యాన చంద్రబాబుకు బీజేపీతో స్నేహాన్ని వదులుకోక తప్ప లేదు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చాక బీజేపీపై విమర్శలు బాగానే చేసాడు. అంతేకాదు, కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటూ తెలుగుప్రజలకు పిలుపునిచ్చాడు. ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం వద్ద రికార్డై వున్నట్లు తెలుస్తోంది. ఈ నాలు గేళ్లలో చంద్రబాబు పాలనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్ళించడంతో పాటు పోలవరం పేరుతో అంచనాలను భారీగా పెంచడం, విదేశీ పర్యటనలు పేరుతో చేసిన దుబారా, రాజధాని పేరుతో చేసిన అక్రమాలు, పుష్కరాల పేరు చెప్పి కోట్ల నిధుల దుర్వినియోగం... వంటి పాయింట్లెన్నో వున్నాయి. అదీగాక చంద్రబాబు మీద 18 కేసులు స్టేలో వున్నాయి. ఓటు-నోటు కేసు సంగతి ఇంకా తేలలేదు. వీటన్నింటికి మించి రాష్ట్రానికి పంపిస్తున్న కొత్త కరెన్సీని డంపింగ్‌ చేసారనే ఆరోపణలున్నాయి. వీటిలో దేనిమీద దర్యాప్తు చేయిం చినా చంద్రబాబు ఎక్కడోచోట దొరికిపోతాడు.

నరేంద్రమోడీ, అమిత్‌ల జోడీ అంటే ఇప్పటికే చాలామందికి భయం పట్టుకుంది. తమను ధిక్కరించిన శశికళ చేత ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. పశుదాణా కేసులో లాలూ ప్రసాద్‌యాదవ్‌ చేత చిప్పకూడు తినిపిస్తున్నారు. వాళ్ళు పగబట్టి తనకూ ఆ గతి పట్టిస్తారేమోనని బాబు భయం. అందుకే తనను కాపాడం డంటూ ప్రజలను వేడుకుంటున్నాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter