passbookతన భూమి తాను సాగుచేసు కునేందుకు, తన భూమి తాను అమ్ము కునేందుకు, తన భూమిని తాను తాకట్టు పెట్టుకునేందుకు, తన భూమికి సంబం ధించిన ధృవీకరణ పత్రాలు పొందేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. మన రెవెన్యూ వ్యవస్థలో సాంప్ర దాయంగా వస్తున్న లోపాలు, అధికారుల పాపాలు వెరసి రైతులకు శాపాలవు తున్నాయి.

మన రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఒకే సర్వే నెంబర్‌, ఒకే పొలంతో ఇద్దరికి పట్టాలుంటాయి. ఇద్దరికీ 1బిలు ఇచ్చివుంటారు. గ్రామాలలో పొలాల వద్ద గొడవలు జరిగేది, ఒకర్నొ కరు కొట్టుకుని చచ్చిపోయేది ఇలాంటి వివాదాల వల్లే! రెవెన్యూ లోపాలలో ఒకటి చుక్కల భూములు. 1947కు ముందు పట్టాదారులుగా వుండి లింకు డాక్యు మెంట్లు కలిగి, శిస్తులు కట్టివున్నా కూడా రికార్డులలో చుక్కలు వున్నాయనే సాకుతో అలాంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చుక్కలు వున్న భూములకు సంబంధించి మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే ఆచర ణలో ఇది సాధ్యం కావడం లేదు. చుక్కలు వున్న భూములకు రైతులకు ఋణాలు గాని, వ్యవసాయ సబ్సిడీలుగాని ఇవ్వడం లేదు. సాగుచేస్తున్న భూములలో చుక్కలు వున్నాయంటూ సాకు చూపి ఎగ్గొడు తున్నారు. 'డాట్స్‌' వున్న భూములను ప్రభుత్వం అవసరమైతే సేకరించవచ్చు. అయితే రైతులకు ప్రత్యామ్నాయ భూము లను చూపించాల్సివుంది.

గ్రామాలలో పొలాలు చేతులు మారడం సహజం. ఒకరి నుండి ఒకరు కొనుగోలు చేస్తుంటారు. పొలాలు చేతులు మారి రిజిష్టర్‌ చేసుకున్నా కూడా 1బిలో పాతపేర్లే వస్తున్నాయి. అడంగల్‌, పాస్‌బుక్‌లు కొనుగోలు చేసిన వారి పేర్లతో మారినా 1బిలలో పేర్లు మారడం లేదు. భూమి యాజమాన్య హక్కుకు ఇప్పుడు 1బిలే కీలకం కావడంతో రైతులు ఆ దిశగా కూడా సమస్యలు ఎదుర్కొంటు న్నారు. ఇక పిత్రార్జితం భూములు కొనుగోలు చేస్తే... అడంగల్‌లోనూ ఇదే వస్తుంది.

రికార్డులలో లోపాల వల్ల భూముల వివరాలు సరిగా నమోదు కాకపోతుం డడం వల్ల ఋణాలు పొందడంలో గాని, వ్యవసాయ సబ్సిడీలను వినియోగించుకో వడంలో గాని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరకు రెవెన్యూ రికార్డుల లోపాల వల్లే చాలామంది రైతులు ఋణ మాఫీకి అర్హులు కాకుండా పోయారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • దండగ... పండగ...
  పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
 • చిలికి చిలికి... గాలివాన కానుందా?
  ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
 • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
  2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
 • సినిమానూ వదలని సెగ
  నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
 • నెల్లూరుజిల్లా ప్రగతిలో... వై.యస్‌. మార్క్‌ తప్పితే... బాబు బ్రాండ్‌ ఏది?
  మొన్న కోడూరుపాటు జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు కోటలు దాటాయి. గాల్లోనే మేడలు కట్టారు. 2019కల్లా దగదర్తి ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టులో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నుండి చెన్నై దాకా ఇండస్ట్రియల్‌…

Newsletter