munchutaroరాష్ట్ర రాజకీయాలలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి విషయాలలో క్లారిటీ వుంది. 2014లోనే కాదు వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు ఎలాగూ ఓట్లేయరు, కాబట్టి అవి డమ్మీలే! ఇవి పోటీలో వున్నా వచ్చేది నామమాత్రపు ఓట్లే!

అదికాకుండా ఇప్పుడు జనాలకు అర్ధం కాని పజిల్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో తిరుగుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన జెండా పట్టుకుని ప్రత్యక్షంగానే రాజకీయ యాత్రలు చేస్తున్నాడు. లక్ష్మీనారాయణే ఇంకా ఏ జెండా పట్టుకోలేదు. అతని అజెండా ఏంటో కూడా తెలియడం లేదు. కాని వచ్చే ఎన్నికల్లో బీజేపీకో లేదా టీడీపీకో పనిచేసే అవకాశముంది. లేదంటే పవన్‌కు తోడుగా జతకావచ్చు కూడా! గత ఎన్నికలకు రేపటి ఎన్నికలకు తేడా ఇదే! 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీకి పడ్డ బీజేపీ ఓట్లను ఈసారి ఆ పార్టీ చీల్చుకోవచ్చు. ఈ రూపంలో నష్టం ఎంతుండొచ్చో అప్పుడే చెప్పలేం. మరి లక్ష్మీనారాయణ, పవన్‌కళ్యాణ్‌లు ఎవరిని ముంచడానికి సిద్ధంగా వున్నారో తేలాల్సివుంది. లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరినా, ఏ పార్టీకి ప్రచారం చేసినా వైసిపికి వచ్చే నష్టం ఏమీ లేదు. జగన్‌ వ్యతిరేకులే లక్ష్మీనారాయణ అభిమానులవుతారు. ఆయన ఇంకా జనసేనకో, బీజేపీకో మద్దతునిస్తే ఎంతో కొంత తెలుగుదేశంకే నష్టం. 2014లో పవన్‌కళ్యాణ్‌ ఓటు తెలుగుదేశానికే పడింది. కాబట్టే ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం భారీగా సీట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన సొంతంగానే పోటీ చేయబోతోంది. మరి పవన్‌కళ్యాణ్‌ ఓట్లు తెలుగుదేశం, జనసేనల మధ్య చీలితే ఎవరికి నష్టం? పవన్‌ వల్ల జగన్‌కు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్‌ టీడీపీకే మద్దతు నిస్తే వైసిపికి నష్టం. పవన్‌ విడిగా పోటీ చేస్తే వైసిపికి కొంత లాభం. అసలు వైసిపికే మద్దతునిస్తే తెలుగుదేశాన్ని సులభంగా పడగొట్టొచ్చు. మొత్తంమ్మీద వీళ్ళిద్దరి వల్ల ఎవరికి మూడనుందో చూడాలి!

polavaramపోలవరం... ఆంధ్రప్రదేశ్‌కు వరం. తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులుండవు.

ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా ప్రధాన అంకం కాలువల నిర్మాణం. డ్యాం అన్నది ఒక చోట కట్టడానికి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాని ఏళ్ళ తరబడి కట్టాల్సింది, కొన్నేసిసార్లు కోర్టుల్లో కేసుల వల్ల ఆగేది కాలువల నిర్మాణమే! అదీగాక కాలువల నిర్మాణానికి భూసేకరణ కూడా పెద్ద సమస్య. దీన్ని పసిగట్టాడు కాబట్టే వై.యస్‌. ముందుగా పోలవరం కాలువలను మొదలుపెట్టించాడు. కాలువలు పూర్తయ్యాక డ్యాం నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ప్రణాళిక. దురదృష్టవశాత్తు 90శాతం కాలువలు నిర్మాణం జరగ్గానే ఆయన హఠాన్మరణం చెందారు. పోలవరం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. గత యూపిఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్‌ను చేర్చడం తెలిసిందే! 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆచరణలోకి తెచ్చింది. అయితే ప్రత్యేకహోదా డిమాండ్‌ను వదిలేసి ప్రత్యేకప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా తమకు అప్పగిస్తే తామే కట్టుకుంటామని చెప్పాడు. ఇది కేంద్రం మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో ఆ ప్రాజెక్ట్‌ మేం చేస్తామన్నాడో ఆ తర్వాత బీజేపీ నాయకులకు తెలిసింది. 16వేల కోట్ల అంచనాలను చంద్రబాబు 56వేల కోట్లకు తీసుకుపోయాడు. ఈ అంచనాలను చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేసారు. ప్రాజెక్ట్‌పై పెట్టిన ఖర్చుకు కేంద్రం యుసిఆర్‌లు అడగడం, పక్కాగా లెక్కలు చెప్పలేక చేతులెత్తేసిన చంద్రబాబు అసెంబ్లీలోనే పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యతను కేంద్రమే చూసుకోవాలని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న 'ట్రాక్స్‌ట్రాయ్‌' కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ పనులను నత్తనడకన సాగిస్తుంటే అప్పుడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీ జోక్యం చేసుకున్నారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేసిన నవయుగ ఇంజనీరింగ్‌ యాజమాన్యాన్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఒక్క ఏడాదిలో పోలవరం కాంక్రీట్‌ పనులను పూర్తి చేయగలరా అని వారిని అడిగాడు. అందుకు వాళ్ళు పాతరేట్లతోనే డ్యాం కాంక్రీట్‌ పని పూర్తి చేయడానికి అంగీకారం తెలిపారు. దీంతో ఎంఓయూ కుదిరింది. ఈ పనితో లాభం వస్తుందా లేదా అని ఆలోచించకుండా నవయుగ సంస్థ రంగంలోకి దిగింది. వేలమంది సిబ్బందిని, ఇంజనీర్లను, వేల సంఖ్యలో వాహనాలను, మిషినరీని సిద్ధం చేసింది. తక్షణమే కాంక్రీట్‌ పనులను మొదలుపెట్టింది. రేయింబవళ్ళు పనిచేస్తూ నితిన్‌గడ్కరీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ఇప్పుడు ఏ పని వేగవంతంగా జరుగుతున్నా అది నితిన్‌గడ్కరీ పుణ్యమే. పని ఆయనదైతే ఫోజులు మాత్రం చంద్రబాబువయ్యాయి. డయాఫ్రంవాల్‌ అంటూ శంకుస్థాపన... ప్రపంచ రికార్డు నిర్మాణం అంటూ పచ్చ మీడియాలో వార్తలు... సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో!

money studyవేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు... వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య. ప్రైవేట్‌ పాఠశాలల్లో పోటాపోటీగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాఠశాలలు తెరచుకుంటే ఒకటిన్నర నెలలుగా విశ్రాంతిలో వున్న స్కూలు బస్సులు మళ్ళీ రోడ్లపై విహరిస్తాయి.

Page 1 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter