nara ysఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌ భవనాలను, ఇంటిని వాస్తు ప్రకారం మార్పుచేయించుకున్నా అక్కడ కాలం కలిసి రాలేదు. అక్కడ ఓటు-నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్‌ను వదిలి రావాల్సి వచ్చింది. ఇక్కడ తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని కట్టించుకున్నా, ఇక్కడా తొలి రెండురోజుల్లోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన రెండో రోజే ఓటు-నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపమంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇక కొత్త అసెంబ్లీ భవనంలోనూ పాత సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతిపక్షం నోరు మూయించాలని అధికారపక్షం పన్నిన ఎత్తులను ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సమర్ధవంతంగా తిప్పి కొట్టారు. రాష్ట్రాభివృద్ధి గురించి కాకిలెక్కలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వానికి జగన్‌ గణాంకాలతో సహా వివరించి చుక్కలు చూపించాడు. వృద్ధిరేటులో అంకెలగారడీ సృష్టించిన చంద్రబాబుకు కలవరం తెప్పిం చాడు. ఏపి రాజధాని అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుం టున్నాం. సమావేశాలలో తొలిరోజే గవ ర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం లేని గొప్పలకు పోయింది. దేశం మొత్తం మీద జిడిపి రేటు 7.1శాతం ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం 12.23 శాతం ఉన్నట్లు చెప్పారు. పక్కరోజు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై జగన్‌ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకోగా, అధికారపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఈ సభలో జగన్‌ పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరించారు. అధికార పక్షం అతనిని రెచ్చగొట్టి సభను వాయిదా వేయించాలని చూసినా అతను ఏ మాత్రం అవకాశమివ్వలేదు. ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కలను తూర్పారబట్టారు. కేంద్రం జిడిపి రేటు 7.1శాతం వుంటే మన జిడిపి రేటు 12.23శాతం ఎలా వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు జిడిపి రేటులో మనకన్నా వెనుకబడి ఉన్నాయా? విభజన తర్వాత ఆదాయం వచ్చే హైదరా బాద్‌ను కోల్పోయాము... వరుసగా మూడేళ్ళ నుండి కరువులే... వర్షాలు లేవు, పంటలు లేవు, పండిన పంటలకు గిట్టు బాటు ధరలు లేవు. కనీసం మీ పాలనలో చేపలకు కూడా రేట్లు లేవు. మరి వ్యవ సాయం, మత్స్యశాఖల్లో అంతంత అభి వృద్ధి రేటును చూపించారు. మనం గొప్పగా వున్నామని లేని గొప్పలు చూపిం చడమెందుకు? దేశంలోనే మేము అందరి కంటే అగ్రస్థానంలో వున్నామని కాకిలెక్కలు చూపిస్తే, ఇక కేంద్రం మనకు నిధులెలా ఇస్తుందంటూ జగన్‌ వేసిన ప్రశ్నలకు అధి కారపక్షం సమాధానం చెప్పలేకపోయింది.

గవర్నర్‌ ప్రసంగంలోని ప్రతి అంశం పై జగన్‌ మాట్లాడారు. గవర్నర్‌ చేత అబ ద్దాలు చెప్పించారంటూ తాను చేసిన ఆరో పణలకు ఆధారాలు చూపించారు. జిడిపి వృద్ధి రేటును ఎండగట్టిన తీరులోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఉత్తుత్తిదేనని తేల్చారు. ప్రత్యేకహోదాను ఎత్తేస్తున్నారని ప్రభుత్వం అంటోందని, కాని జిఎస్టీ అమలు తర్వాత కూడా ప్రత్యేక హోదా అమలులో వున్న రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు అందించడానికి కేంద్రమే సన్నాహాలు చేస్తున్న విషయాన్ని ఆయన సభలో వివరించారు. అలాగే నదుల అను సంధానం పేరుతో జరుగుతున్న అవినీతిని కూడా ఆయన తూర్పారబట్టారు.

స్పీకర్‌ అరగంట సమయమే ఇచ్చినా దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కున్నారు. పదునైన ఆరోపణలు, వివరాలతో అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసారు. అసెంబ్లీలో జగన్‌ మాట, వ్యవహారశైలి కూడా ఎంతో హూందాగా వుండింది. సభలో మాట్లాడే ముందు ఆయన ప్రతి అంశాన్ని అధ్యయనం చేస్తున్నారు. తన ప్రసంగం మధ్యలో అప్పుడప్పుడు పంచ్‌లు వదులుతూ ఒకనాటి సభలో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి శైలిని తల పింపజేస్తున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter