beeda brosనెల్లూరుజిల్లా దగదర్తి మండలం దామవరం వద్ద కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంజూరైన విమానాశ్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఇటీవల జిల్లాకొచ్చిన రాష్ట్ర ఇంధన, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ ప్రకటించడం బీద సోదరులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ప్రతిష్టకు ఇది సవాల్‌గా మారింది. ఎయిర్‌పోర్టు ఇక్కడ నుండి నిజంగానే ఎగిరిపోతే, దానిని నిలుపుకోలేని నిస్సహాయులుగా బీద బ్రదర్స్‌పై ముద్రపడుతుంది. కావలి నియోజకవర్గ ప్రజల్లో ఇది తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది.

2004-2014ల మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి గాని, మౌలిక సదుపాయాల కల్పనగాని అంతా నెల్లూరుకు దక్షిణం వైపే విస్తరిస్తూ పోయింది. కృష్ణపట్నం పోర్టు అయితేనేమీ, పవర్‌ప్రాజెక్టులైతేనేమీ, చింతవరం సెజ్‌, మేనకూరు సెజ్‌, మాంబట్టు సెజ్‌, శ్రీసిటీ... ఇత్యాది అభివృద్ధి కేంద్రాలన్నీ కూడా నెల్లూరు - తడల మధ్యే కేంద్రీకృతమై పోయాయి. ఆ టైంలో రాచర్లపాడు వద్ద ఇఫ్కో సెజ్‌కు శంకుస్థాపన జరిగినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కాని దివం గత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి దామవరం వద్ద ఎయిర్‌పోర్టును ప్రకటించి ఈ ప్రాంతవాసుల్లో, కావలి నియోజకవర్గ ప్రజల్లో ఆశలు మొలకెత్తించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు అన్నాకే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొంచెం ఆలస్యం గానైనా సరే ఇక్కడ ఎయిర్‌పోర్టు షురూ... త్వరలో విమానం ఎగరడం చూస్తాం అని జనం ఎదురుచూస్తున్న తరుణంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు రద్దు చేస్తున్నట్లు అజయ్‌జైన్‌ చేసిన ప్రకటన ప్రజలను నిరుత్సాహానికి గురిచేయడమే కాదు, రాజకీయంగా అధికార పార్టీలో వున్న బీద సోదరులకు నష్టం కలిగించేదే! ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగి, అది పరోక్షంగా బీద సోదరులనే దెబ్బతీస్తుంది. అందుకే బీద సోదరులు ఎగిరిపోయిందనుకున్న ఎయిర్‌పోర్టును సాధించడమే కాదు, దానికి శంకుస్థాపన చేయించి పనులు మొదలుపెట్టించి తమ పనితనం చాటుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు జరుపుతున్నారు.

raviజిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ముఖ్యంగా బీసీ వర్గాల నుండి పెద్ద నాయకుడిగా వున్న బీద రవిచంద్రకే మూడోసారి తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

గత పదమూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడ్డప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా గాని, సామాజిక సమీకరణల కోణంలో గాని పార్టీ అధిష్టానం బీద రవి చంద్రనే అధ్యక్షుడిగా కొనసాగించడానికి నిర్ణయించింది. పార్టీకి పూర్తి విధేయుడు రవిచంద్ర. బి.సి వర్గాలలో పలుకుబడి, పరపతి వున్నోడు. జిల్లాలో నాయకు లందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. 2004కు ముందు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ప్రచారంలోకి వచ్చాడు. అయితే ఆ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్‌లోకి వెళ్లినా, రవిచంద్ర మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయాడు. 2004 నుండి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు కూడా పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేసాడు. పార్టీ పట్ల అతను చూపిన విశ్వాసం, విధేయతే ఈరోజు ఆయ నకు పార్టీలో పెద్దపీట వేసి గౌరవించింది.

ఇక రవిచంద్రను అధ్యక్షుడిగా కొన సాగించినట్లే పార్టీ జిల్లా ప్రధానకార్య దర్శిగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డిని కొనసా గించాలని నిర్ణయించారు. తెలుగుదేశం అనుబంధ సంఘాల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆనం వివేకా కొడుకు, కార్పొరేటర్‌ ఆనం రంగ మయూర్‌రెడ్డికి అప్పగించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా గత జడ్పీటీసీ ఎన్నికల్లో డి.వి.సత్రం నుండి వైకాపా అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశంలో చేరిన ముప్పాళ్ల విజేతను నియమించారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉదయగిరి నియో జకవర్గానికి చెందిన బొల్లినేని రామారావు (ఎమ్మెల్యే కాదు)ను, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరు, చింతారెడ్డిపాలెంకు చెందిన పెనేటి సునీల్‌కుమార్‌ను, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన మొహి ద్దీన్‌ను, బిసి సెల్‌ అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన పిఎల్‌ రావును, టిఎన్‌టియుసి అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన ఓబుళనాయుడును ఎంపిక చేశారు. తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కాకర్ల తిరుమలనాయుడునే కొనసాగించాలని నిర్ణయించారు.

beedaతెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి కూడా బీద రవిచంద్రనే ఎన్ని కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నుండి ప్రకటన రావడమే మిగిలివుంది. పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్రను పక్కన పెట్టాల్సిన పరిస్థితి గాని, కొత్తవాళ్లకు అధ్యక్ష స్థానం అప్పగించాల్సిన అవసరం గాని లేకపోవడంతో మరోసారి బీదకు జిల్లా దేశం బాధ్యతలు తప్పకపోవచ్చు. ఒకవేళ బీద రవిచంద్ర నాకు వద్దని మొండికేస్తే మాత్రం కొత్తవారికి ఛాన్సుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అధ్యక్ష పదవిని ఆయన ఎందుకు వదులుకుంటాడు.

జిల్లాలో చంద్రబాబు కులసమీకరణలను బాగానే పాటించాడు. ఓట్ల పరంగా మెజార్టీ సంఖ్యాకులైన కాపుల నుండి మంత్రిగా నారాయణ వున్నాడు. అయితే ఇది రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం వున్న జిల్లా! మొదట మంత్రివర్గంలో ఈ జిల్లా నుండి రెడ్లకు స్థానం దక్కలేదు. దీంతో పార్టీలో రెడ్లను అణగదొక్కుతున్నారనే ఒక ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే చంద్రబాబు రాజకీయ మేధావి. ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు. కరెక్ట్‌ సమయంలో జిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రెడ్లకు ప్రాధాన్యతనివ్వడం లేదన్న ప్రచారానికి తెరదించారు. సోమిరెడ్డికి మంత్రి పదవిచ్చి పార్టీలోని రెడ్లలో వున్న అసంతృప్తిని తొలగించారు. అదే సమయంలో పార్టీలో బీసీలూ కీలకమే! ఈ వర్గానికి చెందిన బీద రవిచంద్రకు మంత్రిపదవి కాలింగ్‌ బెల్‌ కొట్టి, ఆయన లేచి వచ్చే లోపే సోమిరెడ్డి ఇంట్లో దూరినట్లయ్యింది. మంత్రి పదవి ఆశ ఆయనకు బాగానే అంటించి తీరా నీరు గార్చారు. ఇక మంత్రి స్థాయి పదవి జిల్లాలో ఇంకేముంటుంది. జిల్లా పార్టీ పెత్తనం ఇవ్వడమే బీసీలను గౌరవించడమవుతుంది. కాబట్టి అధ్యక్ష పోస్ట్‌లో రవిచంద్రనే కొనసాగిస్తారనడంలో సందేహం లేదు.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter