beedaతెలుగుదేశంపార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆ పార్టీకి ఆర్ధికంగా తోడ్పాటు నందించిన వారిలో ఒకడు బీద మస్తాన్‌రావు. పార్టీ ప్రతిపక్షంలో వుందికదా అని చెప్పి తన దారి తాను చూసుకోలేదు. వ్యాపారవేత్త అయినా ఆయన తన స్వార్ధం చూసుకుని వుండుంటే అప్పుడే కాంగ్రెస్‌లో చేరడమో, వాళ్ళతో కలిసి పోయి తన పనులు చూసుకోవడమో చేసుండే వాడు. కాని, పార్టీ పట్ల వున్న చిత్తశుద్ధితో ఆయన తెలుగుదేశం లోనే ఉండిపోయాడు. 2014 ఎన్నికల్లో కావలి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రాజధాని కమిటిలో ఆయనను సభ్యుడిగా నియమించినా, ఇక్కడ ఆయనకు పనేమీ లేదు.

మొన్నటివరకు టీటీడీ ఛైర్మెన్‌ పదవి ఆశపెట్టుకుని వుండి నాడు. అయితే అదిప్పుడు పెండింగ్‌లో వుంది. బిఎంఆర్‌కు వచ్చే అవకాశాలు తక్కువే! అదీగాక టీటీడీ ఛైర్మెన్‌ రెండేళ్ళ పోస్టు. బీఎంఆర్‌కు రాజ్యసభకు వెళ్ళాలనే కోరిక బలంగా వుంది. టీటీడీ ఇస్తే రాజ్యసభను ఎగ్గొడతారు. కాబట్టి బిఎంఆర్‌ ఇప్పుడు టీటీడీ కంటే రాజ్యసభ వైపే మొగ్గు చూపుతున్నాడు.

త్వరలో రాష్ట్రం నుండి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది. ప్రస్తుత మున్న ఎమ్మెల్యేల సంఖ్యనుబట్టి తెలుగుదేశంకు రెండు, వైసిపికి ఒకటి దక్కుతాయి. ఈలోపు వైసిపి నుండి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయితే ఆ మూడోది కూడా తెలుగుదేశందే అవుతుంది. బీసీల కోటా నుండి బీద మస్తాన్‌రావు రాజ్యసభ కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి.

వచ్చే ఎన్నికల్లో కావలి నుండి పోటీ చేయడం కంటే కూడా రాజ్యసభకు పోవాలన్నదే ఆయన ఆలోచన. మరి చంద్రబాబు ఎంతవరకు ఆయన ఆశను నెరవేరుస్తాడో చూడాలి!

tddతిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని త్వరలో భర్తీ చేసే అవకాశా లున్నాయి. టీటీడీ ఛైర్మెన్‌ పదవి కోసం రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్‌లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఎంపీలకు టీటీడీ ఛైర్మెన్‌ ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో తెరపైకి కొత్త ఆశావహులొచ్చారు. ఇందులో నెల్లూరు జిల్లా నాయకులు కూడా ఉండడం విశేషం. 2014ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేసి గట్టి పోటీనిచ్చి ఓడిపోయిన మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నాడు. చంద్రబాబు మనసుపెట్టి ఆదేశిస్తే టీటీడీ ఛైర్మెన్‌గా పనిచేసి చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో అన్ని విధాలా నష్టపోయిన ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎటువంటి పదవులు ఇవ్వలేదు. పార్టీలో మాత్రం బాధ్యతలు పెంచారు.

రాజధాని కమిటీసభ్యులుగా వున్న బీద మస్తాన్‌రావు బీసీ వర్గాల తరపున టీటీడీ ఛైర్మెన్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయుడు బిఎంఆర్‌. పార్టీకి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు. పార్టీని కష్టకాలంలో వీడకుండా నడిచాడు. 2014 ఎన్నికల్లో కావలి నుండి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత రాజ్యసభ సీటును ఆశించాడు. అయితే అది నెరవేరలేదు. ఇప్పుడు టీటీడీ ఛైర్మెన్‌ పదవికి రేస్‌లో వున్నట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ టి.అనూరాధ పేరు కూడా మహిళా కోటాలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా వినిపిస్తోంది. జిల్లాలో ఎవరికి ఛైర్మెన్‌ పదవి వచ్చినా రాకున్నా వీరిలో ఒకరికి మాత్రం టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా అవకాశం రావచ్చు.

raviజిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ముఖ్యంగా బీసీ వర్గాల నుండి పెద్ద నాయకుడిగా వున్న బీద రవిచంద్రకే మూడోసారి తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

గత పదమూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడ్డప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా గాని, సామాజిక సమీకరణల కోణంలో గాని పార్టీ అధిష్టానం బీద రవి చంద్రనే అధ్యక్షుడిగా కొనసాగించడానికి నిర్ణయించింది. పార్టీకి పూర్తి విధేయుడు రవిచంద్ర. బి.సి వర్గాలలో పలుకుబడి, పరపతి వున్నోడు. జిల్లాలో నాయకు లందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. 2004కు ముందు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ప్రచారంలోకి వచ్చాడు. అయితే ఆ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్‌లోకి వెళ్లినా, రవిచంద్ర మాత్రం తెలుగుదేశంలోనే ఉండిపోయాడు. 2004 నుండి 2014 వరకు పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లు కూడా పార్టీని వీడకుండా పార్టీ కోసం పనిచేసాడు. పార్టీ పట్ల అతను చూపిన విశ్వాసం, విధేయతే ఈరోజు ఆయ నకు పార్టీలో పెద్దపీట వేసి గౌరవించింది.

ఇక రవిచంద్రను అధ్యక్షుడిగా కొన సాగించినట్లే పార్టీ జిల్లా ప్రధానకార్య దర్శిగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డిని కొనసా గించాలని నిర్ణయించారు. తెలుగుదేశం అనుబంధ సంఘాల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆనం వివేకా కొడుకు, కార్పొరేటర్‌ ఆనం రంగ మయూర్‌రెడ్డికి అప్పగించారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలిగా గత జడ్పీటీసీ ఎన్నికల్లో డి.వి.సత్రం నుండి వైకాపా అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశంలో చేరిన ముప్పాళ్ల విజేతను నియమించారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉదయగిరి నియో జకవర్గానికి చెందిన బొల్లినేని రామారావు (ఎమ్మెల్యే కాదు)ను, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరు, చింతారెడ్డిపాలెంకు చెందిన పెనేటి సునీల్‌కుమార్‌ను, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన మొహి ద్దీన్‌ను, బిసి సెల్‌ అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన పిఎల్‌ రావును, టిఎన్‌టియుసి అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన ఓబుళనాయుడును ఎంపిక చేశారు. తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కాకర్ల తిరుమలనాయుడునే కొనసాగించాలని నిర్ణయించారు.

Page 1 of 5

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter