bhargav reddyవిధి చాలా విచిత్రమైనదే కాదు... ఒక్కోసారి కిరాతకమైనది కూడా! అప్పుడప్పుడు కొందరి పట్ల చాలా కటువుగా వ్యవహ రిస్తుంది. ఒకే కుటుంబం మీద పగ పెంచుకున్నట్లుగా వుంటుంది. ఎంతో వెలుగు వెలిగిన కుటుంబాన్ని ఉఫ్‌మంటూ ఆర్పేస్తుంది. విధి రాత విసిరిన పాశానికి బలైపోయిన ఆ కుటుంబమే సన్నారెడ్డి గోపాలరెడ్డి కుటుంబం.

సన్నారెడ్డి గోపాలరెడ్డి అంటే ఎవరు? అనే సంశయం వస్తుంది. భార్గవ్‌ ఆర్ట్స్‌ అధినేత ఎస్‌.గోపాల్‌రెడ్డి అంటే ఆంధ్ర, తెలంగాణలో ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు హిట్‌ సినిమాల నిర్మాత అని! ఏ భార్గవ్‌ ఆర్ట్స్‌ పేరుమీదైతే... తెలుగు సినీ ప్రేక్షక లోకానికి మంగమ్మ గారి మనుమడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మువ్వగోపాలుడు, మాపల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు, మురళీకృష్ణుడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించారో... ఆ భార్గవ్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన వాకాడు మండలం పంబలి వద్ద సముద్రంలో మృతదేహమై తేలాడు. సముద్రపు అలల నుండి తన పెంపుడు కుక్కను రక్షించుకునే ప్రయత్నంలో ఆయన కూడా మృత్యువాతపడ్డట్లుగా తెలుస్తోంది.

వాకాడు మండలం గునుపాటిపాలెంకు చెందిన ఎస్‌.గోపాల రెడ్డి తొలుత సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వున్నారు. ఆ తర్వాత చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నిర్మాతగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. నెల్లూరోళ్ళకు సినీ రంగం కలిసిరాదనే సెంటిమెంట్‌ వున్నరోజుల్లో 'ఖైదీ' చిత్ర నిర్మాణం ద్వారా నెల్లూరుకు చెందిన నిర్మాత ఎం.తిరుపతిరెడ్డి మెగాస్టార్‌ చిరంజీవికి బ్రేక్‌ ఇస్తే, భార్గవ్‌ ఆర్ట్స్‌ ప్రొడ క్షన్‌లో ఎస్‌.గోపాల్‌రెడ్డి నిర్మించిన 'మంగమ్మగారి మనుమడు' చిత్రం బాల కృష్ణ సినీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. బాలకృష్ణకు మొదటి బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా ఇదే! సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలను సాధించిన గోపాల్‌రెడ్డి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లను ఎదుర్కొ న్నాడు. విధి చేతిలో తలవంచుతూ వచ్చాడు. కొన్నేళ్ళ క్రితం ఆయన భార్య క్యాన్సర్‌ వ్యాధితో మరణించగా, కొద్దికాలానికే తన సతీమణి లేదన్న మానసిక వ్యాధితో ఆయన కూడా మృత్యుఒడికి చేరాడు. వారి ఒక్కగానొక్క కూతురు సంసార జీవితంపై ఆసక్తి లేక సన్యాస జీవితాన్ని స్వీకరించింది. కాగా, ఇప్పుడు మిగిలివున్న కొడుకు భార్గవ్‌రెడ్డిని సముద్రం మింగే సింది. 'మురారి' అనే సినిమాలో చూపించినట్లు కుటుంబానికి కుటుంబమే ఏదో శాపానికి గురైనట్లుంది. గోపాలరెడ్డి ఎన్నో సినిమాలు తీసారు. కాని ఆయన కుటుంబంలో ఎదురైన సంఘటనలను మించిన విషాద చిత్రం ఇంకోటి ఉండదేమో!

ఏదేమైనా నెల్లూరీయులు గర్వించదగ్గ సినిమా నిర్మాత గోపాల్‌రెడ్డి. గతంలో ఆయన, నేడు ఆయన కొడుకు భార్గవ్‌ మరణం తీరని విషాదం. భార్గవ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది 'లాయర్‌'.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
  ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
 • తమ్ముడు తోడొచ్చేనా?
  మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • వైకాపాలో కుటుంబ రాజకీయం
  నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…

Newsletter