galpikaపట్టువదలని విక్రమార్కుడు ఉక్కపోత కారణంగా తెల్లారుజామున 5గంటలకే నిద్రలేచాడు. పొద్దున 9 గంటల నుండి ఎండ మండిపోతుండడంతో ఎర్లీ హవర్స్‌లో డ్యూటీ ముగించుకోవాలను కున్నాడు. అందుకే సీమా సెంటర్‌లో టీ తాగేసి పెద్దాసుపత్రికి కూడా పోకుండా నేరుగా బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వద్దకు చేరి శవం కోసం మాటు వేశాడు. ఓ గంట తర్వాత చీప్‌ లిక్కర్‌ ఎక్కువై లివర్‌ చెడిపోయి చని పోయిన వ్యక్తి ఫ్రెష్‌ శవం ఒకటి వచ్చింది. విక్రమార్కుడు ఆ శవాన్ని భుజాన వేసు కుని శ్మశాన వాటిక చుట్టూ తిరుగుతూ శవంలోని భేతాళుడిని పిలిచాడు. విక్ర మార్కుడి పిలుపుతో శవంలోని భేతా

ళుడు రియాక్టై... విక్రమార్క... ప్రజలు తమ వంటను ఇళ్లల్లో గ్యాస్‌ పొయ్యిల మీద కాకుండా, వీధుల్లో, రోడ్ల మీద ఎండ వేడిమితోనే పూర్తి చేస్తున్న ఎండలు కాస్తున్న రోజుల్లో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలితో కూడిన దయ కలుగుతోంది. ఈ శ్రమ తెలియకుండా వుండేందుకు నీకు లేటెస్ట్‌గా జరిగిన 'పచ్చ నేతల తిట్ల పారాయణం' స్టోరీ చెబు తాను విను అంటూ మొదలుపెట్టాడు.

నేను మారిన మనిషిని నేను మారిన మనిషిని అని చెప్పుకుంటుంటే ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా నమ్మి 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేసారు. 2004లో ఈ ఉద్యోగులే చంద్రబాబు ఓటమికి ప్రధాన పాత్రధారులు. పదేళ్ళ అధికార వియోగ శిక్ష భరించాక చంద్ర బాబులోనూ ఆ మాత్రం మార్పు వచ్చుం టుందిలే అని ఉద్యోగులు నమ్మారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు అధికారులను దుర్భాష లాడడం తగ్గించారు. 1995-2004 మధ్య సీఎంగా వున్న కాలంలో రోజుకో అధికారినైనా... 'నీ అంతు చూస్తా, నీ తాట తీస్తా' అని తిట్టందే చంద్రబాబుకు నిద్రపట్టేది కాదు. 2014లో అధికారం లోకి వచ్చాక రోజుకొకరిని కాదు కదా ఏడాదికొకరిని కూడా తిట్టలేదు. ఉద్యో గుల విషయంలో అంత మానవత్వమున్న మనిషిగా మారిపోయాడు. అయితే అధికారులకు అసలు సమస్య అక్కడే మొదలైంది. 1995 నుండి 2004ల మధ్య ప్రభుత్వంలో అధికారులను చంద్ర బాబు ఒక్కడే తిట్టేవాడు. 2014 నుండి చంద్రబాబు ఒక్కడే తిట్టడం లేదు. తెలుగుదేశంలో వున్న మిగతా నాయకు లందరూ అధికారులను దారుణంగా తిడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే వనజాక్షి అనే తహశీల్దార్‌ను ఇసుకలో జుట్టు పట్టుకుని ఈడ్చాడు. రాష్ట్రంలో చాలాచోట్ల అధికారులపై తెలుగు నాయ కులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తాజాగా విజయవాడలో రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు జులుం ప్రదర్శించారు. ఒక ఐపిఎస్‌ అధికారి అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టారు. బయటి రాష్ట్రానికి చెందిన ఓ ట్రావెల్స్‌ కంపెనీ బస్సు ప్రమాదం కేసుకు సంబంధించి ఉన్నది ఉన్నట్లు కాకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వలేదని గొడవపడ్డారు. మీడియాలో ఈ దౌర్జన్యం సంఘటనలు ప్రసారమయ్యాయి. సీఎం చంద్రబాబు కూడా టీవీలో ఈ సీన్‌లు చూసాడు. ఆయన అసలే ఛండశాస నుడు... జరిగిన సంఘటనపై ఆయన తీవ్రంగా ఆగ్రహించినట్లున్నాడు. వెంటనే కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్నలు ఆర్టీఏ కమిషనర్‌ వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పారు. తప్పు చేస్తే చంద్ర బాబు క్షమించడని, అధికారుల మీద దౌర్జన్యాలకు దిగితే ఆయన తన మన అనే బేధం లేకుండా చీల్చి చెండాడు తాడని తెలిసి కూడా తెలుగుదేశం నాయ కులు ఇలా అధికారుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నట్లు? చంద్రబాబు అంటే వీరికి భయం పోయిందా? లేక మేం ఏం చేసినా ఆయన పట్టించుకోడులే అనే నమ్మకం పెరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపో యావో నువ్వు కూడా ఏపిలో ఏదో ఒక శాఖకు కమిషనర్‌గా ఉంటూ తెలుగుదేశం నేతల చేత ఇదే విధంగా తిట్లు తింటావని హెచ్చరించాడు.

అప్పుడు విక్రమార్కుడు... భేతాళా... పులి పళ్ళున్నప్పుడే పరుగెత్తయినా జిం కను వేటాడగలదు. పళ్లూడిపోతే జింక ఎదురుగా వచ్చినా పీకేదేమీ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు టీత్‌లెస్‌ టైగర్‌ లాంటోడు. ఒకప్పటి ఛండశాసనుడు ఇప్పుడు 'శాంతి శాసనడు' అయ్యాడు. విజయవాడ ఘటన తర్వాత నీకు ఉండ వల్లిలోని సీఎం ఇంట్లో జరిగిన ఓ సన్ని వేశం చూపిస్తా చూడు అంటూ సెల్‌ఫోన్‌ తీసి ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసాడు. అందులో ఓ పోస్ట్‌ ద్వారా వచ్చిన ఓ సన్నివేశంపై క్లిక్‌ చేశాడు.

------------

అది చంద్రబాబు ఛాంబర్‌. చంద్ర బాబు ఎదురుగా కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్నలు ఉన్నారు. చంద్ర బాబు వారితో... ఆ ఆర్టీఏ కమిషనర్‌ను ఏమన్నా అన్నారా... అని ఒకింత భయం తోనే అడిగాడు. అంటాం... కావాలంటే తిడతాం... ఇంకా ఎక్కువైతే కొడతాం... అయితే... ఏమవుతుందంట... ఒక ఆర్టీఏ కమిషనర్‌నే కాదు... అన్ని శాఖల కమిషనర్‌లను కొడతాం... ఏమవుద్ది... అలా కొడితేనే అందరూ దార్లో వుంటారు, మీకు అలా చేయడం చేతకాదు, చేసే మాలాంటివాళ్ళను ఇక్కడకు పిలిచి అడుగుతుంటారు. దీనికేనా మమ్మల్ని ఇక్కడిదాకా పిలిచింది అని కేశినేని నాని కోపంగా అడిగాడు. అందుకు చంద్ర బాబు అతనితో... నువ్వే అంతలా కోప్పడితే ఎలా, ఏదో నిన్ను చూసి చాలా రోజులైందని పిలిపించాను, నిన్ను చూడా లనుకోవడం కూడా తప్పేనా అని బాబు అన్నాడు. బోండా ఉండి... చూడండి సార్‌, మీలా మెత్తగా వుంటే కుదరదు... అధికారులను ఎట్లబడితే అలా తిడతాం, అవసరమైతే కొడతాం... మనం బాధిం చాలి, వాళ్ళు భరించాలి. అది ఈ బోండా ఉమ రూల్‌. మీకు ఆసక్తి వుంటే చూడండి, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండండి అని ఘాటుగా అన్నాడు. అప్పుడు చంద్రబాబు... మీరు ఏమైనా చేసుకోండి, ఎవరినైనా తన్నండి, ఇబ్బంది లేదు. కాని ఆ మీడియా దెబ్బకు పార్టీ ప్రతిష్ట కోల్పోతోంది. కాబట్టి ఎవర్ని తిట్టినా, కొట్టినా సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారి 'సారీ' చెప్పండి, మిగతా అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు. అందుకు వాళ్ళు నిర్లక్ష్యంగా 'సరే సరే...' ఏదో నీ ఏడుపు కోసం ఆ 'సారీ' అయినా అంటూ లేచారు!

ఇక్కడితో సెల్‌ఫోన్‌లో సీన్‌ అయి పోయింది. తర్వాత విక్రమార్కుడే... తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్ళ పెత్తనమే నడుస్తోంది. చంద్ర బాబునాయుడు ప్రభుత్వాన్ని, పార్టీని కంట్రోల్‌ చేసే పరిస్థితి నుండి పడిపోయి పార్టీనేతలే ఆయన్ను కంట్రోల్‌ చేసే స్థితి వచ్చింది. చంద్రబాబే నేతలకు భయ పడుతుండడంతో అధికారుల మీద పచ్చతమ్ముళ్ళ దౌర్జన్యకాండ యధేచ్ఛగా జరుగుతోందని చెప్పాడు. ఆ సమా ధానానికి సంతృప్తి చెందిన భేతాళుడు శవాన్ని అక్కడే వదిలేసి పక్కనే వున్న సెల్‌ టవర్‌ ఎక్కేసాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • మూడేళ్ళు.... జిల్లాలో కనిపించని అభివృద్ధి ఆనవాళ్ళు!
    కలెక్షన్‌లలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన 'బాహుబలి' చిత్రాన్ని చూసిన తర్వాత అదే హీరో ప్రభాస్‌ నటించిన 'బుజ్జిగాడు' సినిమాను చూస్తే ఎంత చెత్త ఫీలింగ్‌ కలుగుతుందో, 2004 నుండి 2009 వరకు బాహుబలి లాంటి వై.యస్‌. పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలకు…

Newsletter