andhra'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌'... గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా... మోడీ ప్రధాని అయ్యాక అందుకున్న సరికొత్త నినాదాలు. వీటిలో కొన్ని ఆచరణలో వున్నాయి, కొన్ని ప్రయోగంలో వున్నాయి. అయితే వీటన్నింటికి మించి శరవేగంగా విజయవంతమవుతున్న కార్యక్రమం 'కాంగ్రెస్‌ లెస్‌ ఇండియా'.

అవును. కాంగ్రెస్‌పార్టీ లేని భారత దేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఆలోచనలు పక్కాగా అమలు చేసే బీజేపీ సారధి అమిత్‌షాలు ఎంతో వ్యూహా త్మకంగా కృషి చేస్తున్నారు. ఉత్తరాదిన యూపీని మొదలుకొని దక్షిణాన ఏపి వరకు అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాలను పూర్తి స్థాయిలో జయించిన కమల దళం దృష్టి తాజాగా దక్షిణాది రాష్ట్రాలపై పడింది. కేంద్రంలో శాశ్వతంగా అధికారాన్ని నిలుపుకోవాలంటే దక్షిణ భారత దేశంలోనూ అత్యధిక సీట్లను గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీజేపీ కేరళలో ఓటుబ్యాంకును పెంచుకుంది. తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు కమలంకు కలి సొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమిళ నాడులో డిఎంకె, అన్నాడిఎంకెల మాదిరి గానే ఒక ప్రధానపార్టీగా పోటీ చేయ డానికి ఆ పార్టీ నేతలు పావులు కదుపు తున్నారు. ఇక కర్నాటకలో ప్రతిపక్షంగా వుంది. రేపు ఎన్నికలు జరిగాక అధికారం లోకి వచ్చే అవకాశముంది. అలాగే తెలం గాణలోనూ కాంగ్రెస్‌ను ధ్వంసం చేస్తే ప్రధానపార్టీగా ఎదగడానికి బీజేపీకి అవ కాశాలున్నాయి. అయితే అవకాశాలు వచ్చినా కూడా బీజేపీ విస్తరించనిది, ఎద గనిది ఆంధ్రప్రదేశ్‌లోనే! బీజేపీకి సొం తంగా విస్తరించే అవకాశం వచ్చిన ప్రతి సారి తెలుగుదేశం పొత్తు ఆ పార్టీకి శాపంగా మారింది. టీడీపీ చాటున బీజేపీ ఎదగలేకపోగా, క్రమంగా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ కేడర్‌ నిర్వీర్యమవుతూ వచ్చింది.

ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న రాష్ట్రాల్లో చొరబడడం బీజేపీకి కష్టంగా వుంది. అయితే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రా ల్లోకి సులభంగా ప్రవేశిస్తోంది. ఒక ప్రాం తీయపార్టీ, కాంగ్రెస్‌ వున్న రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ను తొక్కేసి బీజేపీ పాతుకు పోతోంది. 2014 ఎన్నికలప్పుడు ఏపిలో బీజేపీ బలపడేందుకు మంచి అవకాశ మొచ్చింది. రాష్ట్ర విభజన బిల్లు తేవడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఆత్మ హత్య చేసుకుంది. కాంగ్రెస్‌ తెచ్చిన విభజన బిల్లును అడ్డుకుని వుంటే 2014 ఎన్నికల లోనే ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడి వుం డేది. అదికాకపోయినా 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసివున్నా తెలుగుదేశం ఓడిపోయి వుండేది.అప్పుడు తెలుగుదేశం స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవడానికి ఆస్కారముండేది. ఆ ఛాన్స్‌ను ఆ పార్టీ నాయకులు వదులుకున్నారు. దక్షిణాదిలో పార్టీని విస్తరింపచేయాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఏపిపై కూడా బీజేపీ శ్రేణులు దృష్టి సారించాయని తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో రెండు ప్రాంతీయపార్టీలు టీడీపీ, వైసిపిలు బలంగా వున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ మాత్రమే ఫీల్డ్‌లో వుంటుంది. ఓడిన పార్టీ కేడర్‌ను తమ పార్టీలో కలుపుకుపోవాలనే ప్లాన్‌లో బీజేపీ వుంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ మళ్లీ తోక పార్టీలాగే అవుతుంది. కాబట్టి వచ్చే ఎన్ని కల్లో పొత్తు లేకుండా పోటీచేసి రాష్ట్రంలో ఉనికిని చాటుకోవడం ప్రధాన లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఓడిపోయినా కూడా ఆ పార్టీకి అవే చివరి ఎన్నికలు, ఆ పార్టీ స్థానం లోకి బీజేపీ ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది.

bjp tdp ysr2014 ఎన్నికల్లో బీజేపీకి బంపర్‌ మెజార్టీ వచ్చింది. ఆ పార్టీ ఒక్కదానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని మెజార్టీ మార్క్‌ సీట్లు వచ్చినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా మెజార్టీ ఉండడంతో ప్రభుత్వంపై మిత్రపక్షాల బెదిరింపులు, ఒత్తిళ్లు కూడా లేవు. చంద్రబాబు లాంటి వాళ్లకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లేకుండాపోయింది.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ఈసారి మాత్రం అన్ని సీట్లు రావు. మిత్రపక్షాలను కలుపుకోక తప్పదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉండేది తెలుగుదేశం, శిరోమణి అకాళీదళ్‌, శివసేన వంటి పార్టీలే! 2019 ఎన్నికల్లో మరికొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలను ఈ కూటమిలో చేర్చుకోక తప్పదు. ఈ క్రమంలోనే బీజేపీ మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే తెలుగుదేశం తమ మిత్రపక్షమే అయినప్పటికీ ఇక్కడ ప్రతిపక్షమైన వైసిపిని మాత్రం శత్రుపక్షంగా చూడడం లేదు. బీజేపీలో ఓ వర్గం నాయకులు తెలుగుదేశంను లైన్‌లో పెట్టుంటే, మరో వర్గం నాయకులు మాత్రం వైకాపాను లైన్‌లో ఉంచారు. అక్రమాస్తుల కేసుల సంగతి పక్కనపెడితే మోడీ మనసులో చంద్రబాబు కంటే జగన్‌కే ప్రాధాన్యత వుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలెందరో మళ్ళీ ఆమె కాళ్ల మీద పడ్డారు. కాని జగన్‌ నాలుగు పదుల వయసులోనే సోనియాను ఎదిరించాడు. ఆమె పెట్టించిన అక్రమకేసులను ఎదుర్కొన్నాడు. 16నెలలు జైలు జీవితం గడిపాడు. ఇదే జగన్‌ ఆమెతో రాజీపడిపోయి వుంటే ఈరోజు అతని మీద ఒక్క కేసు వుండేది కాదు.

చంద్రబాబుది నిలకడ లేని వైఖరి అని మోడీకి అనుభవపూర్వకంగా తెలుసు. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో తనను ముఖ్యమంత్రి కుర్చీ నుండి దించాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌ను మోడీ అప్పుడే మరచిపోగలడా? అదీగాక వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు చేయొచ్చు. ప్రధాని పీఠంపై మోజుతో చంద్రబాబే ఇక్కడ రింగ్‌ లీడర్‌ కావచ్చు. బీజేపీని గతంలో లాగే మతతత్వ పార్టీ అని విమర్శించి తెగదెంపులు చేసుకోవచ్చు. అదీగాక ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీది విజయమని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే బీజేపీ వాళ్లు రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీతోనూ సరసాలు కొనసాగిస్తున్నారు.

tdp bjpరాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులకు మధ్య చిచ్చు రగిలింది. ఈ చిచ్చును ఆరిపోనీయకుండా చేయడంలో ఎవరి వంతు పాత్రను వాళ్ళు పోషిస్తుండగా, ఇందుకు మేం సైతం ఓ సమిధను అందిస్తామంటూ నెల్లూరుజిల్లా తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా ముందుకొచ్చారు.

ఇటీవల కావలిలో ఇన్‌ఛార్జ్‌ మున్సిపల్‌ ఛైర్మెన్‌ గుండ్లపల్లి భరత్‌కుమార్‌పై తెలుగు దేశం నాయకులు దాడి చేయడం తెలిసిందే! దీనిపై ధ్వజమెత్తిన బీజేపీ నాయకులు పార్టీ నుండి దాడి చేసిన నాయకులను సస్పెండ్‌ చేసేలా చేయగలిగారు. అయితే అంతటితో వూరుకోలేదు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అయితే ఆయన ప్రభుత్వంపై అంతగా చెలరేగిపోవడానికి కారణం పైనుండి వచ్చిన సూచనలవల్లేనని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం అనుమతి లేకుండా క్రిందిస్థాయిలో వీళ్లు ఇంత దారుణంగా విమర్శలు చేయడానికి సాహసించలేరు. చంద్రబాబు పచ్చి అవినీతిపరుడని ఆయన విమర్శలు చేయడంతో నిప్పు రాజుకుంది. దీనిపై తెలుగుదేశం నాయకులు స్పందించారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బృందం ప్రెస్‌మీట్‌ పెట్టి సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్‌ అంటూ ఆరోపించింది. అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారంటూ విమర్శలు చేసింది.

మొత్తానికి ఇరు పార్టీల మధ్య నిప్పు పడింది. ఈ నిప్పును ఆర్పుతారో, లేక మంటలు ఇంకా ఎగిసిపడేలా చేస్తారో చూడాలి!

Page 1 of 11

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter