bore holeబోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదకరమని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది.

ఇటీవల తెలంగాణాలో ఒక చిన్నారి ఆడుకుంటూ పొరపాటున బోరుగుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో, నిరుపయోగంగా వదిలేసే బోరుగుంతల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. జిల్లాలోనూ, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో అనేక చోట్ల సాగునీటి కోసం పొలాల్లో బోర్లు తవ్వు కోవడం సాధారణ విషయమే. అయితే, భూగర్భజలాల నీటిమట్టం బాగా పడి పోవడంతో, ఎంత లోతుకు తవ్వినా బోరుకు నీరందకపోవడంతో ఇక చేసేది లేక ఆయా రైతులు ఆ బోర్లగుంతలను అలాగే వదిలేసి వెళ్తుంటారు. చివరికి అవే నరకానికి దారితీస్తుంటాయి. పొరపాటునో గ్రహపాటునో చిన్నపిల్లలెవరైనా కాలుజారి ఆ గుంతలోపడితే.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. వందల అడుగుల లోతుకు తవ్విన ఆ బోర్లలో పడితే ఎంత ప్రమాదమో ఆ తర్వాత తెలుసుకుని ఎంతగా బోరుమని విలపించినా పోయిన ప్రాణం తిరిగి రాదు. నుక, బోర్లు తవ్వే వారు ఎవరైనా సరే, బోర్లను నిర్లక్ష్యంగా వదిలిపెట్టకుండా, వాటిలో ఎవరూ పడ కుండా పూర్తిగా కట్టుదిట్టం చేయాల్సి

ఉంది. వరికుంటపాడు తదితర మెట్ట ప్రాంత మండలాల్లో సుమారు 3 వందల అడుగుల దాకా తవ్వినా నీళ్ళు రాకపోవ డంతో, పలుచోట్ల ఆ బోర్లగుంతలను పూడ్చకుండా అలాగే వదిలేసినట్లు గ్రామాల్లో వినవస్తోంది. బోర్ల గుంతలపై బండరాళ్ళు పెట్టడమో, గోనెపట్టలు కప్పడమో చేసినా.. అవేమిటో తెలియక పిల్లలు వాటిని తీసేయడం కూడా జరుగు తుంటుంది. వందలాది అడుగుల లోతు తవ్వేసి వదిలేసిన ఆ గుంతలో ఎవరైనా చిన్నపిల్లలు పొరపాటున పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసుకుంటున్న కూలీల పిల్లలు ఈ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కనుక, జిల్లాలో ఎక్కడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా ఉన్న తాధికారులు పటిష్టమైన చర్యలు తీసు కోవాల్సి ఉంది. బోర్లు తవ్వించుకునే రైతులకు అవగాహన కలిగేవిధంగా చెప్ప డమో, లేదా బోర్లు తవ్వేవారిని హెచ్చరించ డమో చేస్తే తప్ప ఈ సమస్య ఒక పట్టాన కొలిక్కి రాదు. ఎక్కడైనా బోర్ల గుంతలు నిర్లక్ష్యంగా వదిలేసినట్లు కనిపిస్తే ప్రజలు కూడా వెంటనే ఆ సమాచారాన్ని అధికా రులకు తెలియజేసేలా తుఫాన్‌ సెల్‌లాగా శాశ్వత ప్రాతిపదికన బోర్ల సమాచారంపై ఒక సెల్‌ కూడా ఏర్పాటు చేయడం మం చిది. గ్రామస్థాయి సిబ్బంది నుంచి లేదా గ్రామస్తుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఆ బోరును అధికారులు సంద ర్శించి దాని నుంచి ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలి. నిర్లక్ష్యాన్ని.. అలాగే వదిలేస్తే అది చివరికి పసిబిడ్డల ప్రాణాలనే పొట్టనబెట్టుకుంటుంది కనుక, ఇకనైనా తక్షణం బోర్ల గుంతలను పూడ్చి వేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరు ఎక్కడ బోర్లు తవ్వాలన్నా ముం దుగా అధికారుల అనుమతి తీసుకుని, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగ కుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, తవ్విన బోర్లను సంబంధిత అధికారులు లేదా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ బోర్లు తవ్వుతు న్నారో, వాటి పరిస్థితి ఏమిటో ఉన్నతాధి కారులు వెంటనే నివేదిక తెప్పించుకుని అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకో వాలని వారు కోరుతున్నారు. జరగరాని ఘోరం జరిగిపోయాక బోరుమనేకంటే, ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఎల్లవేళలా శ్రేయోదాయకం. ఏదేమైనా, బోర్ల తవ్వకం వల్ల ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. అంతే కాదు, ప్రమాదకరమైన నీటిగుంతలను కూడా గుర్తించి, వాటి వద్ద కూడా ప్రమా దాలు జరగకుండా ప్రమాదసూచికలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయి అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో బోర్ల వద్ద, నీటిగుంతల వద్ద అప్రమత్తంగా

ఉండేలా ఏర్పాట్లు చేసి, ప్రమాదాల నివా రణకు ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు శాశ్వతప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter