ap babuఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా హక్కు. దీనికోసం భిక్షమెత్తాల్సిన పని లేదు. కేంద్రం ముందు దేబిరించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో వున్న అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల సాక్షిగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న అవకాశం ఇది. గతంలో ఎన్నో రాష్ట్రాల విభజన జరిగింది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ పడినంత బాధ ఏ రాష్ట్రమూ పడలేదు. దీనిని బాధ అనడం కంటే క్షోభ అంటే సరిపోతుం దేమో! నెలలు నిండాక ప్రసవం ఎంతో హాయిగా ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్‌ విభజన మాత్రం నెలలు నిండకుండానే కడుపు కోసి బిడ్డను తీసినట్లుగా జరిగింది.

ఇలాంటి రాక్షసత్వ విభజనకు పూర్తిగా బలైంది ఆంధ్రరాష్ట్రం. ఎంత చేసినా, ఏం చేసినా ఈ రాష్ట్రం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. రాష్ట్ర విభజన సమయంలో సిపిఎం వంటి ఒకటి, అరా పార్టీలు తప్పితే మిగతా అన్ని పార్టీలు కూడా ఆంధ్రకు తీరని ద్రోహం చేసాయి. ఈ ద్రోహుల్లో మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ అయితే రెండో ముద్దాయి బీజేపీ. విభజన సమయంలో కాంగ్రెస్‌ మరీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని కనీసం విభజన బిల్లులో కూడా పొందుపరచలేదు. రాజ్యసభలో బిల్లును బీజేపీ అడ్డుకోబట్టయినా ఆ మాత్రం ఐదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామంటూ ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ వచ్చి హామీ ఇచ్చారు.విభజన సమయంలో కాంగ్రెస్‌ ద్రోహం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ చేసిన ద్రోహం మరుగునపడేలా బీజేపీ వ్యవహరిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసలు ప్రత్యేకహోదా అంశాన్నే పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదన్న సంకేతాలు వారి నుండి ఎప్పటినుండో స్పష్టంగా అందుతున్నాయి. వాళ్ల రాజకీయ కారణాలు వాళ్లవి. త్వరలో బీహార్‌ ఎన్నికలున్నాయి. అక్కడ కూడా ప్రత్యేకహోదా డిమాండ్‌ వుంది. ఏపికి ఇచ్చి బీహార్‌కు ఇవ్వకుంటే అక్కడ ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలగొచ్చు. ఏపి పక్కనే తమిళనాడు వుంది. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే ఆ ప్రభావం ప్రధానంగా పడేది తమిళ నాడు మీదే! ప్రత్యేకహోదా వస్తేనే తమిళ నాడులోని పరిశ్రమలన్నీ సరిహద్దుల్లోని నెల్లూరు, చిత్తూరుజిల్లాల వైపు తరలే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏపికి ప్రత్యేకహోదా రాకుండా అడ్డు తగులుతుంది. నరేంద్ర మోడీతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. లోక్‌సభలో, రాజ్యసభలో బీజేపీకి అన్నాడిఎంకె మద్దతు అవసరం. ఈ దృష్ట్యా కేంద్రంపై ఆమె పలుకుబడి కూడా పనిచేస్తుండొచ్చు.

ఏపికి ప్రత్యేకహోదా రాకుండా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రత్యేకహోదా సాధించడానికి పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న. ఆయన ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అయితే ప్రత్యేకహోదా కోసం మాత్రం కాదు. స్పెషల్‌ ప్యాకేజీ కోసం. ప్రత్యేక హోదా కోసం ఇంతవరకు చంద్రబాబు వైపు నుండి గట్టి ప్రయత్నమే జరగలేదు. ఒక్కసారన్నా గట్టిగా కేంద్రాన్ని అడిగింది కూడా లేదు. ప్రత్యేకహోదా కంటే ఆయన మనసంతా ప్రత్యేకప్యాకేజీ మీదనే వుంది.

ప్రత్యేకహోదా వస్తే ఏమవుతుంది... పరిశ్రమలు వస్తాయి, పన్నులు తగ్గుతాయి, గ్రాంట్‌లలో సబ్సిడీ వస్తుంది. దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలు ప్రయో జనం పొందుతారు. కాని తెలుగుదేశం వారికేం ప్రయోజనం. అదే ప్యాకేజీ అంటే. బీహార్‌కు ఇచ్చినట్లు లక్షాపాతిక వేల కోట్లు ఇచ్చినా... కళ్లు తిరిగే కమీషన్‌ ఖాయం. ప్రతి పనిలోనూ 10శాతం కమిషన్‌ అనే సంప్రదాయం ఎప్పట్నుండో వుంది. అది ఈమధ్య ఇంకా పెరిగింది. లక్షకోట్ల ప్యాకేజీ వచ్చినా తెలుగు సోద రులకు చేతినిండా చిల్లర కనిపిస్తుంది. అదే స్పెషల్‌ స్టేటస్‌ అయితే వీళ్ల చేతికొచ్చే దేమీ వుండదు.

అందుకే ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కోసమే చంద్రబాబు పాకులాడు తున్నట్లుగా తెలుస్తోంది.

chandraఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చి నట్లుగా బీహార్‌కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన లక్షాపాతిక వేల కోట్ల భారీ ప్యాకేజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుపై మరింత ఒత్తిడి పెంచనుంది. ఎన్నికల కోణంలో బీహార్‌కు కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చింది. అయితే రాష్ట్ర విభజన వల్ల బీహార్‌ కంటే ఘోరంగా తయారైన ఆంధ్రప్రదేశ్‌కు ఇంతవరకు స్పెషల్‌ ప్యాకేజీలేమీ లేవు. కేంద్రం నుండి ఇంతవరకు గట్టిగా నాలుగువేల కోట్ల సాయం కూడా అందలేదు. అసలు ఆంధ్ర ప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తున్నదే ప్రత్యేక హోదాను. కేంద్రం ఈ విషయంలో చేతు లెత్తేసింది. ప్రత్యేకహోదాను గట్టిగా అడగ లేకపోతున్నాడనే నింద చంద్రబాబుపై ఇప్పటికే వుంది. ఇప్పుడు కేంద్రం బీహార్‌కు భారీ ప్యాకేజీ ఇచ్చింది. ప్రత్యేకహోదా మాట అటుంచితే కనీసం బీహార్‌ తరహా ప్యాకేజీనైనా సాధించాలని చంద్రబాబు మీద విపక్షాలు ఒత్తిడిపెంచే అవకాశముంది.

nara modiప్రత్యేకహోదా చిచ్చు రాష్ర్ట ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తోంది. తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్యతో ఇది బాగా రగులుకుంది. టిడిపి, బీజేపీలు మినహా మిగిలిన విపక్షాలన్నీ ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను బాగానే తగులుకున్నాయి. రాష్ర్ట విభజనలో ప్రధాన పాపి కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ విభజన ఆ పార్టీని చారిత్రాత్మక దోషిగా నిలబెట్టింది. ఆరోజు విభనజ బిల్లులోనే ప్రత్యేకహోదా అంశాన్ని ఆ పార్టీ చేర్చి వుంటే ఈరోజు ఇన్ని సమస్యలుండేవి కాదు. ఆరోజు రాష్ర్టాన్ని తగలబెట్టింది కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు చేసిన పాపాలకు ప్రాయశ్చితం అన్నట్లుగా ప్రత్యేకహోదాపై ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ ద్రోహాన్ని రాష్ర్ట ప్రజలు అప్పుడప్పుడే మరచిపోలేరు.

అయితే ప్రత్యేక హోదాపై రాష్ర్టంలో పెరుగుతున్న ఆందోళనలు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషయంలో ఆయనది ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి. ప్రత్యేకహోదాపై కేంద్రంత తగవు పెట్టుకోలేదు. అలాగని రాష్ర్టంలో విపక్షాలకు సమాధానం చెప్పలేదు. ప్రత్యేకహోదా కేవలం రాజకీయ అంశమే కాదు, ప్రజలు కోరుకుంటున్న అంశం కూడా. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ పికాల లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్తులు తెలంగాణకిచ్చి అప్పుల చిట్టాను ఆంధ్ర ముఖాన పడేసారు. ఈ కష్టాల నుండి గట్టెక్కాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. కేంద్రం పార్లమెంటులో చెప్పిన ప్రకారం రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇస్తేగాని కొంతన్నా కోలుకునే పరిస్థితి ఉండదు. ప్రత్యేక హోదా వస్తే పన్నులు తగ్గుతాయి. ప్రజలపై కొంత భారం తగ్గుతుంది. పరిశ్రమలు, సెజ్ లు వస్తాయి. రాష్ర్టం అభివృద్ధి పరంగా ముందుకుపోతుంది. కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక ఏ రాష్ర్టానికి కూడా ఇది ఇచ్చేది లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ దుస్థితి వేరు... మిగతా రాష్ర్టాల పరిస్థితి వేరు. కేంద్రం దీనిని గమనించడం లేదు. అదేదో ముష్టి వాళ్లమన్నట్లు ఆర్థిక ప్యాకేజీ ఇస్తామంటున్నారు. అలాంటి ప్యాకేజీల వల్ల రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదు. రాష్ర్టం అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందే విధంగా అభివృద్ధి జరగాలి. దానికున్న ఏకైక మార్గం ప్రత్యేకహోదా.

అయితే, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశామే కనిపించడం లేదు. చంద్రబాబు అవసరమైన ప్రత్యేకహోదా, పోలవరం, జాతీయ విద్య, వైద్య సంస్థల ఏర్పాటు వంటి అంశాలను వదిలేసి ప్రజలకు ఎంతమాత్రం అవసరం లేని పుష్కరాలు, సింగపూర్ రాజధాని, పట్టిసీమ వంటి వాటిని పట్టుకుని వేలాడుతున్నాడు.

ప్రత్యేకహోదాపై చంద్రబాబు కళ్లు తెరవాలి. కేంద్రంతో పోరాడైనా ప్రత్యేకహోదా సాధించాలి. అవసరమైతే కేంద్రంతో తగువుకు, తెగదెంపులకు కూడా సిద్ధపడాలి. ప్రత్యేకహోదాపై ఆయన ఏ మాత్రం మౌనంగా వున్నా రాష్ర్ట ప్రజల దృష్టిలో కాంగ్రెస్ లాగే చరిత్ర హీనుడవుతాడు.

Page 8 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter