godavari pushkaraluగాల్లో మేడలు కట్టడం, లోపల చిరుగుల బనియన్, డ్రాయర్ వేసుకున్నా పైన కోటూ బూటూ వేసుకోవడం చంద్రబాబుకు సరదా. లోపల లొట్ట వున్నా పైకి ఆకర్షణీయంగా కనిపించాలనేది ఆయన పాలసీ

1995-2004ల మధ్య రాష్ర్ట ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన చేసిన పనులన్నీ ఇలాంటివే. ప్రజలు వెళ్లే దారుల్లో తారురోడ్లకు గతిలేకపోయినా పశువులు నడిచే పొలాల్లోకి సిమెంట్ రోడ్లు వేయించిన ఘనాపాటీ చంద్రబాబు. 70శాతం మంది ప్రజలు బ్రతుకుదెరువు కోసం ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని ఎండగట్టి కేవలం నాలుగైదు శాతం మందికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ రంగం కోసం వేలకోట్లు తగలేసాడు.

ఇప్పుడన్నా పంధా మారిందా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి అయ్యింది మొదలు అన్నీ పైనపటారం పనులే. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనుల జోలికే పోవడం లేదు. సంక్రాంతి చంద్రన్న కానుక, రంజాన్ తోహా వంటివన్నీ తాత్కాలిక ఆకర్షణలే. ఇక రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి దిన దిన గండం నెలనెల ఆయుష్షుగా వుంది. ఓ రోడ్డుకో, కాలువకో, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కో వందకోట్లు మంజూరు చేయాలంటే వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి కరువు కాలంలో గోదావరి పుష్కరాలకు మాత్రం 1400కోట్లు మంజూరు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుష్కరాలు ఒక్క తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగేవి మాత్రమే కాదు. గోదావరి నదీ ప్రవాహ ప్రాంతాలన్నింటిలోనూ పుష్కరాలు జరుపుతారు. తెలంగాణలోనూ గోదావరి ప్రవహిస్తుంది. అలాగని తెలంగాణ సిఎఁ కేసీఆర్ పుష్కరాలకు ఇన్ని వందలకోట్లు మంజూరు చేయలేదే. పుష్కరాలను చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్వహించాడన్న కీర్తి కండువాను మెడలో వేసుకోవడానికే ఆయన ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 1400కోట్లు ఖర్చుపెట్టి చేసిన పనులు శాశ్వతం కాదు. ఇప్పుడు చేసిన కొన్ని పనులు మళ్ళీ 12ఏళ్లకు గాని ఉపయోగపడవు. అప్పటిదాకా ఈ పనులు నిలిచేవీ కావు. ఒకరకంగా వందలకోట్ల రూపాయలు గోదావరిలో వేసినట్లేననుకోవచ్చు.

chandruluచంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా చేయడానికే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినట్లున్నాయి. ఆయనను దోషిగా బోనులో నిలబెట్టడానికే ఈ ఎన్నికలను పెట్టినట్లుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి ఎవరివి వాళ్లు గెలుచుకునిపోయారు. చంద్రబాబుకు ఏమీ రాకపోయినా చివరికి దాని బురద మిగిలింది. దాన్ని కడుక్కోవడానికే ఆయన అవస్థలు పడుతున్నాడు.

ఓటు – నోటు కేసు క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొదట్లోనే రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన జైలులోనే వున్నాడు. తెలంగాణలో తెలుగుదేశాన్ని ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టాలనుకున్న కేసీఆర్ కు ఈ కేసు ఒక ఆయుధంగా దొరికింది. రేవంత్ రెడ్డి వద్ద దొరికిన తాడును పట్టుకుని ములాల్లోకి పోయారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం కోటరీని ఈ కేసులో ఇరికించే విధంగా ఆధారాలు సేకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో చాలా లోతుగా వెళ్లడమే కాక జాగ్రత్తగా వ్యవహరించింది. ఆదరాబదరా నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ లు చేయడం వంటివాటి జోలికి పోకుండా అన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు ఆదేశాలతో నిందితులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కోర్టు అనుమతితోనే అరెస్ట్ లు కూడా జరిగే అవకాశాలున్నాయి.

ఓటు – నోటు కేసులో సాంకేతిక విజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం బాగా వాడుకుంది. సెల్ ఫోన్ కాల్స్, సెల్ టవర్స్ పరిధిని బాగా ఉపయోగించుకున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపిలు సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే సండ్ర వీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేంద్రరెడ్డిలతో సహా డబ్బు సమకూర్చిన ఇతరుల అందరూ కలిపి 20మందిపై కేసు నోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేంద్ర రెడ్డికి నోటీసు జారీ చేసారు.

ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు సైతం బలంగా వున్నాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. అయితే ఆ మాటల్లో డబ్బు ప్రస్తావన రాలేదు. చంద్రబాబు అరెస్ట్ కు ఫోన్ సంభాషణ సరిపోదు. అయితే ఇంతకుమించిన బలమైన ఆధారాలు తెలంగాణ ఏసిబి అదికారులకు లభించాయనే సమాచార ముంది. చంద్రబాబు పాత్ర ఉంటే అరెస్ట్ చేసే విషయంపై కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు కోర్టు ఆదేశిస్తే గవర్నర్ కూడా అడ్డుపడే అవకాశాలు లేవు.

కేంద్రం ప్రేక్షక పాత్ర – ఓటు –నోటు కేసులో కంద్రం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఈ కేసు నుండి ఎలాగైనా చంద్రబాబును గట్టెక్కించాలన్నంత అభిమానం బీజేపీ నాయకులకు లేదు. ఈ కేసులో జోక్యం చేసుకుంటే ఆ బురద కొంచెం బీజేపీకి కూడా అంటుకుంటుంది. ఇప్పటికే లలిత్ మోడీ వివాదంతో ఆ పార్టీ సతమతమవుతోంది. కాబట్టి చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదీగాక కేసీఆర్ తో శత్రుత్వం ఆ పార్టీ అధిష్టానం కోరుకోవడం లేదు. కాబట్టి చంద్రబాబు స్వీయరక్షణ ఏర్పాట్లు చేసుకోక తప్పదు.

ప్రాంతీయ విద్వేషాలు – ఓటు – కోట్లు కేసు పూర్తిగా రాజకీయపరమైంది. తెలంగాణలో బలపడాలని చంద్రబాబు, తెలంగాణ నుండి ఈయనను తరిమేయాలని కేసీఆర్ లు ఆడుతున్న ఆటలో ఇదో భాగం. ఇరు రాష్ర్టాల ప్రజలకు దీంతో ఏ సంబంధమూ లేదు. కాని తెలంగాణలోకంటే ఎక్కువుగా ఆంధ్రాలోనే దీనిని ఇరు రాష్ర్టాల వివాదంగా మార్చే ప్రయత్నం జరగడం చూస్తున్నాం. చంద్రబాబు అధికారులను, పోలీసులను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ పోలీసులను మన రాష్ర్ట పోలీసుల చేత అడ్డుకోవాలనుకుంటున్నాడు. అదే జరిగితే ఇరు రాష్ర్టాల పోలీసుల మధ్య ఘర్షణ రేగి, అది ఇరు రాష్ర్టాలలో వున్న ప్రజలకు కూడా పాకుతుంది. అప్పుడన్నా కేంద్రం జోక్యం చేసుకుని కేసీఆర్ ను కట్టడి చేస్తుందని చంద్రబాబు ఆశ.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చంద్రబాబును జైలుకు పంపించే దాకా కేసీఆర్ నిద్ర పోయేటట్లు లేడు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తదుపరి సిఎం ఎవరు... అనేదానిపై కూడా పార్టీలో రసవత్తరంగా చర్చ జరుగుతోంది. అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు సిఎం పదవి నుండి దిగాల్సి వస్తే తెలుగుదేశంపార్టీకి కష్టాలు మొదలైనట్లే.

cm chanగడచిన వారంరోజుల్లో చంద్రబాబు ఒక్కసారైనా అనుకుని ఉంటాడు... 1999లో ఈ కేసీఆర్ కు ఒక్క మంత్రి పదవి పడేసి వుంటే ఈరోజు నాకు ఈ తలనొప్పి ఉండేది కాదుకదా అని. ఆరోజు చంద్రబాబు ఆ పని చేసుంటే ఒక్క ఆయన తలనొప్పే కాదు, తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు, రాష్ర్ట విభజన జరిగేది కాదు, మనకింత అవస్థ ఉండేదే కాదు. గతం గతం. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏడ్చి లాభంలేదు.

చంద్రబాబు తల, గడ్డం పండిన రాజకీయ యోధుడు. అశేష ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్ నే ఎందుకూ పనికిరాకుండా చేసిన ఘనుడు. తన రాజకీయ విద్యలతో ఎందరికో చుక్కలు చూపించాడు. మరెందరి రాజకీయ జీవితాలకో సమాధికట్టాడు. తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడని పెద్దలు చెప్పిన మాటలు అప్పుడప్పుడు నిజమవుతుంటాయి. తన రాజకీయ అస్ర్తశస్త్రాలతో ఎందరో నాయకులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ల తాగించిన చంద్రబాబుకే ఈఱోజు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ కూడా వుంది. కాని కేసీఆర్ ఆ రెండు పార్టీల జోలికి పోవడం లేదు. తెలుగుదేశంనే టార్గెట్ చేసుకున్నాడు. చంద్రబాబు తోకకు తాటాకు కట్టి హైదరాబాద్ నుండి తరిమేయడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఈ లక్ష్యంలో ఆయనకు రేవంత్ రెడ్డి వ్యవహారం వజ్రాయుధంలా దొరికింది.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5కోట్ల ఒప్పందంలో భాగంగా 50లక్షలు అడ్వాన్స్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసిబి కెమెరా కళ్లకు పక్కాగా దొరికిపోవడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. అయితే ఓటుకు 5కోట్లు కథ ఇక్కడితో ముగియలేదు. స్టీఫెన్ సన్ తో రేవంత్ రెడ్డి జరిపిన సంభాషణలో బాస్ నన్ను పంపించాడు అనేది వినపడింది. ఆ బాస్ ఎవరనేది అందరికీ పరోక్షంగా తెలిసినా సాక్ష్యాలతో సహా బయటపెట్టాలనుకున్నారు. ఎట్టకేలకు ఆ బాస్ ఎవరనేది కూడా తెలంగాణ ఏసిబి అధికారు బయటపెట్టేసారు. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన వివరాలు రికార్డయ్యాయి. స్టీఫెన్ సన్ ఫోన్ లోనే చంద్రబాబు మాటలను రికార్డయ్యాయి. స్టీఫెన్ సన్ ఫోన్ లోనే చంద్రబాబు మాటలను రికార్డు చేసారు. ఈ ఆధారాలను ఏసిబి అధికారులు మీడియా ముందు పెట్టారు. ఇక్కడితో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యాడు.

తెలఁగాణలో పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోయారు. దీంతో ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం ఆ పార్టీకి లేకుండా పోయింది. అయినా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేంద్రరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకోవడం కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా ఓ ఆరుమంది ఎమ్మెల్యేలను కొనాలనే దిశగా ప్రణాళిక రచించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ద్వారా డబ్బు సమకూర్చుకున్నట్లు, గరికపాటి రామ్మోహన్, సిఎం రమేష్ లు ఈ ఆర్ధిక వ్యవహారాలలో కీలకపాత్ర పోషించినట్లు కూడా తెలంగాణ ఏసిబికి ఆదారాలు లభించినట్లు తెలుస్తోంది. వీటిని ఆధారంగా చేసుకునే చంద్రబాబుతో సహా మరికొందరిపై కేసులు నమోదు చేసేందుకు తెలంగాణ ఏసిబి అదికారులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఒక ఓటు -5కోట్లు కథలో తన ఫోన్ వాయిస్ రికార్డు బయటపడగానే చంద్రబాబులో సైతం ఆందోళన నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తన ఫోన్ ను ట్యాపరింగ్ చేసారని, ఇది నేరమని ఆరోపిస్తున్నారు. కానీ ఆయన ఫోన్ ట్యాపరింగ్ చేయలేదని, ఆయన మాటాలను అవతల వ్యక్తి రికార్డు చేసారని తెలంగాణ ఏసిబి అధికారులు చెబుతున్నారు. దీనిని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మలిచే ప్రయత్నం కూడా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. అయితే ఆంధ్రాలోని విపక్షాలన్నీ చంద్రబాబు తీరును దుయ్యపడుతూ ఇది మీ వ్యక్తిగత వ్యవహారమని, రాష్ర్టాల మధ్య, ప్రజల మధ్య అంతరాలు సృష్టించ వద్దని చంద్రబాబుకు హితబోధ చేస్తున్నాయి.

ఈ వ్యవహారంలో చంద్రబాబు పై కేసు నమోదు చేయాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నాడు. చంద్రబాబుకు ఈ విషయం అర్ధమైపోయింది. ఆయనను కాపాడగలిగేది కేంద్రమే. అందుకే ఢిల్లీ వెళ్లాడు. అయితే అవినీతి లేని నీతివంతమైన పాలన అందిస్తానంటున్న నరేంద్రమోడీ ఆయనను ఆదుకోవడం కష్టమే.

ఇప్పటిదాకా చంద్రబాబు తనకు తాను ఆంధ్రా హజారేనంటూ చెప్పుకు తిరిగాడు. నీతికి నిలువెత్తు రూపానన్నాడు. నీతి, నిజాయితీలకు చొక్కా, ఫ్యాంటు వేస్తే అచ్చం చంద్రబాబులా ఉంటాడని తెలుగుదేశం నాయకులు చెబుతూ వచ్చారు. ఇంతకాలం జగన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనతో తెలుగుదేశం కేడర్ మొత్తం నిరుత్సాహంలో ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం పండగచేస్కో అన్నట్లుగా ఆనందంలో తేలిపోతున్నారు.

Page 9 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter