cm narayanaఓ పాత తెలుగు సినిమాలో చూసుంటాం. హీరో ఇంట్లోకి చుట్టంటూపుగా ఓ పెద్దావిడ వస్తుంది. పచ్చటి ఆ కుటుంబంపై ఆమె కళ్లు పడతాయి. ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతుంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు పెంచుతుంది. ఒకరినొకర్ని దూరం చేస్తుంది. పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతుంది. ప్రస్తుతం రాష్ర్టంలోని పసుపు పచ్చ పార్టీలో మంత్రి నారాయణది ఇదే పాత్ర.

లోకేష్ కు చదువు చెప్పే కోణంలో చంద్రబాబుకు, వారి కుటుంబసభ్యులకు నారాయణ దగ్గరయ్యాడు. క్రమంగా వారి ఆర్థిక వ్యవహారాల్లోనూ చొరపడ్డాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటరయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు ఇంట్లోనే కాకుండా తెలుగుదేశంపార్టీలోనూ నెంబర్ టూనంటూ పెత్తనం చేతికి తీసుకున్నాడు. చందరబాబు ఆయనకు బాగా అలుసిచ్చాడు. దీంతో నారాయణ రెచ్చిపోయాడు. పార్టీలో సీనియర్లను సైతం లెక్కచేయకుండా వారి మాటను గౌరవించకుండా చంద్రబాబుకు నేను ఏది చెబితే అది అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులంతా చాలా అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

2014ఎన్నికల ముందు దాకా కూడా నారాయణకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో లోకానికి తెలిసేది కాదు. అది వారింటి వరకే పరిమితమై ఉండేది. కాని ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాక నారాయణకు ఉపముఖ్యమంత్రి పదవినివ్వాలనే స్థాయిలో చంద్రబాబు ఆలోచించాడు. కాని చివరి నిముషంలో మనసు మార్చుకుని కె.ఇ.కృష్ణమూర్తితో పాటు కాపుల కోటాలో నిమ్మకాయల చినరాజప్పను కూడా డిప్యూటీ సీఎంను చేసాడు. అయినా నారాయణకు అత్యంత కీలకమైన మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖను కట్టబెట్టడమే కాక నూతన రాజధాని కమిటి ఛైర్మెన్ గా కూడా ఆయననే నియమించారు. పార్టీలో శివప్రసాద్, కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నాయకుల సలహాలను తీసుకోకుండా రాజధాని కమిటి ఛైర్మెన్ గా నారాయణను ఎంపిక చేయడం సీనియర్లలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. అయినా చంద్రబాబు మీదున్న గౌరవంతో వీళ్లు తమ బాధను వెళ్లగక్కలేకపోయారు. రాజధాని అధ్యయనం, పెట్టుబుడులు రాబట్టడం కోసం చంద్రబాబు బృందం జరిపిన సింగపూర్, జపాన్ పర్యటనల్లోనూ నారాయణ ఓవర్ యాక్షన్ చేయడం ఆ టీంలో వెళ్లిన మిగతా నాయకులకు నచ్చలేదు.

మొత్తంగా పార్టీలో నారాయణ వ్యవహారం పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరికిపెట్టినట్లయ్యింది. ముఖ్యంగా నారాయణ పోకడలు పార్టీని ఏళ్ల తరబడి కనిపెట్టుకున్న వారిని తరిమేసేలా, అవతల పార్టీలలో నుండి వచ్చిన వారికి పదవులిప్పించే స్థాయికి చేరాయి. ముఖ్యంగా నారాయణ సొంత జిల్లా అయిన నెల్లూరుజిల్లాలో మంత్రి చేసిన అపరిపక్వ రాజకీయాల గురించి తెలిసి సీనియర్ నాయకులు అసహ్యించుకున్నారు. నారాయణ వైఖరి మూలంగా చాలామంది మంత్రులు చంద్రబాబుకు దూరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది.

పార్టీలో సీనియర్ నాయకుడు కె.ఇ.కృష్ణమూర్తి. పద్ధతిగల మనిషి. కర్నూలుజిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి రాజకీయ యోధుడినే మోటుకుని నిలబడ్డ నాయకుడు. పార్టీలో చంద్రబాబు తర్వాత గౌరవించదగ్గ మనిషి. అలాంటి కె.ఇ.కృష్ణమూర్తికే నారాయణ వ్యవహారం నచ్చలేదు. నారాయణ పోకడలపై ఆయన నేరుగా చంద్రబాబునే నిలదీసి ఆయనను దారిలో పెట్టమని హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతేకాదు, నారాయణ మంత్రిగా వున్నంతకాలం నెల్లూరుజిల్లాలో అడుగుపెట్టనని కూడా కె.ఇ అన్నట్లు వినికిడి.

పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీ కోసం ఆస్థులమ్ముకుని అప్పులపాలైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ దఫా కూడా ఎమ్మెల్సీ రాకుండా చేయడానికి నారాయణ సర్వశక్తులొడ్డాడు. కాని కె.ఇ.కృష్ణమూర్తి గట్టిగా పట్టుబట్టాడు. సోమిరెడ్డి లాంటి వారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేసే వాళ్లకు మీపై నమ్మకముండదు అని చంద్రబాబుతో గట్టిగా వాదించి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.

పార్టీలో చంద్రబాబుకు వున్న ఇమేజ్ కు నారాయణ వల్ల డామేజ్ జరుగుతుంది. చంద్రబాబు గతంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాడు. సీనియర్ నాయకులకు ప్రాధాన్యతనిచ్చేవాడు. ఇప్పుడు ప్రతిదానికి నారాయణ మీద ఆధారపడుతున్నాడనే చెడ్డపేరొస్తుంది. నారాయణ కార్పొరేట్ మంత్రి. ఆయన ఆలోచనలు ఆ స్థాయిలో ఉంటాయి. ఆయన ఆలోచనలను బట్టి చంద్రబాబు పరిపాలన సాగిస్తే చీపురుపుల్ల పట్టుకుని గోదారిని ఈదడమే అవుతుంది. దివంగత నేత వై.యస్. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా తనకు అత్యంత సన్నిహితుడైన కె.వి.పి.రామచంద్రరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించాడు. చంద్రబాబు కూడా నారాయణను అలాగే పెట్టుకుని వుంటే పోయేది. లేదా రాజ్యసభకు పంపించి ఉండొచ్చు. ఇప్పుడు రాజ్యసభలో ఎక్కువమంది వ్యాపారులే ఉంటున్నారు. అనవసరంగా మంత్రిని చేసి పార్టీలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి తనకు తానే తలనొప్పిని తెచ్చుకుంటున్నాడు.

cmరాష్ర్ట శాసనసభ బడ్జెట్ సమావేశాలు మేధావులు, విజ్ఞానవంతులే కాదు, చదువులేని నిరక్ష్యరాసులు సైతం ఛీదరించుకునేలా జరిగాయి. ఆ విధంగానే ముగిసాయి. ఇందులో ఒక వ్యక్తిని, ఒక పార్టీని తప్పు పట్టలేము. అసెంబ్లీ సమావేశం కంటే హీనంగా నిర్వహించడంలో అందరికీ తలా కొంత పాత్ర వుంది. అయితే ఈ విషయంలో మెజార్టీవాటా మాత్రం అధికార తెలుగుదేశంపార్టీదే.

ఈ అసెంబ్లీ సమావేశాలు రచ్చరచ్చగానే కాదు రొచ్చురొచ్చుగా జరిగాయి కూడా. అనుభవజ్ఞులు, సమస్యలపై అవగాహన వున్న సీనియర్ లు సభలో మంత్రులుగా గాని, అధికార, ప్రతిపక్ష సభ్యులుగా గాని లేని కొరత స్పష్టంగా కనపడింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పే ఓపిక మంత్రులకు లేకుండా పోయింది. సమస్యలపై నిలదీసి ఓపిగ్గా సమాధానాలు రాబట్టే తీరిక ప్రతిపక్ష సభ్యులకు లేకుండా పోయింది. ఎంత ఎక్కువుగా రచ్చ చేస్తే అంత ఫోకస్ అవుతామని, టీవీలలో బాగా కనిపిస్తామనే ఫీలింగ్ ఎక్కువ మంది సభ్యులతో వుంది.

చంద్రబాబు మెహర్భానీ కోసం కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలు, దూషణల పర్వం చాలా అసహ్యంగా వుండింది. ఇలాంటి వారికా మనం ఓట్లేసి అసెంబ్లీకి పంపించింది అని ప్రజలు సిగ్గుపడేంతగా వుంటే, మీకంటే మేమేం తక్కువ తిన్నామా అంటూ కొందరు వైకాపా ఎమ్మెల్యేలు వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా వ్యవహరించారు.

ఈ సభలో ఇంకా ఎన్నో అపశృతులు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ పదేపదే మైక్ కట్ చేయడం, జగన్ ప్రసంగిస్తున్నప్పుడు నలుగురైదుగురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేచి గోల చేస్తున్నా స్పీకర్ వారిని అదుపుచేయలేకపోవడం, వీటికి నిరసనగా జగన్ సభకే నమస్కారం పెట్టి బయటకెళ్లి పోవడం. ఏ సందర్భమూ లేకుండా నీ అంతుచూస్తానంటూ ప్రతిపక్ష సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడం. మంత్రి పీతల సుజాత, వైకాపా ఎమ్మెల్యే రోజాల మధ్య రగడ, తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైకాపా ఎమ్మెల్యే కేశినేని నానిల మధ్య రభస సభా మర్యాదలను భ్రష్టు పట్టించాయి. వీళ్లు తిట్టుకున్న తీరు చూస్తే తరతరాలుగా వీరి మధ్య పాత కక్షలున్నాయనిపించక మానదు.

ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా వెల్లడైంది ప్రజల సమస్యలపై వివరణ ఇవ్వడంలో అధికారపార్టీ దారుణంగా విఫలమవడం. ప్రతిపక్షం ఎన్నో సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చింది. ప్రతిపక్ష నేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలలో పరిపక్వతతో వ్యవహరించారు. తన దృష్టికొచ్చిన సమస్యలపై పూర్తి వివరాలతో, ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసారు. ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వ కప్పదాట్లను ఎండగ్టటారు. రైతు ఋణమాఫీ, డ్వాక్రా ఋణాలు, అంగన్ వాడీల వేతనాలు, కరెంట్ ఛార్జీలు వంటి సమస్యలపై ఆయన పూర్తి సమాచారంతో మాట్లాడారు. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో జరిగిన వాదోపవాదాలలో జగన్ దే పైచేయిగా నిలిచింది. రాష్ర్టంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్లులు పెండింగ్ లో ఉన్నాయి. అదీగాక పట్టిసీమకు పైనే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను కేంద్రం మంజూరు చేసింది. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి జలాలను శ్రీశైలంకు మళ్లించి రాయలసీమకు నీళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాయలసమీమలో నీటి నిల్వకు ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. మరి పట్టిసీమ నీళ్లను శ్రీశైలంకు మళ్లిస్తే తెలంగాణ రాష్ర్టం కూడా ఆ నీటిని వాడుకునే వీలుంది. అసలే అప్పుల్లో వున్న మనం మన డబ్బును తగలేసి తెలంగాణకు నీళ్లివ్వడమేమిటి. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

మరోపక్క జగన్ కేసుల గురించి సభలో గంటలకొద్ది మాట్లాడి విలువైన సభా సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. కాని అధికారపార్టీ వారికి సమస్యలపై సమాధానం చెప్పే సహనం లేదు. ఇది చేసామని చెప్పడానికి అవకాశాలు కూడా లేవు. అందుకే సమావేశాలనే కంపు చేసి పెట్టారు.

cbnరాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి 8వ తేదీన నెల్లూరుకు వస్తున్నట్లు సమాచారం. ఆరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏసి స్టేడియంలో లక్షమంది మహిళలతో నిర్వహించే సదస్సులో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే ముత్తుకూరురోడ్డులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన అపోలో హాస్పిటల్ ను కూడా ఆయన ప్రారంభించే అవకాశాలున్నాయి.

Page 10 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter