chandraఏదైనా ప్రజలకు మంచి జరిగి నప్పుడు అది నా వల్లే జరిగిందని ప్రచారం చేసుకోవడం, చెడు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పుకోవడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య! హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద నుండి సింధు సాధించిన ఒలింపిక్‌ రజత పతకం వరకు అన్నీ కూడా ఆయన తన ఘనతలుగానే చెప్పుకుంటుంటాడు.

ఈ కోవలోనే పెద్దనోట్ల రద్దు క్రెడిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలనుకు న్నాడు. ప్రధాని నోట పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడక ముందే వెయ్యి నోటును రద్దు చేయాలంటూ ప్రధానికి చంద్రబాబు లేఖ వ్రాసాడు. చంద్రబాబు వ్రాసిన లేఖ మూలంగానే నరేంద్ర మోడీకి జ్ఞానోదయమై పెద్దనోట్లను రద్దు చేసా రంటూ తెలుగుదేశం నాయకులు మొదటి రెండు, మూడురోజులు ప్రచారం చేశారు. పెద్దనోట్ల రద్దు ఖ్యాతి దక్కితే ప్రజలు మోడీకే కాకుండా చంద్రబాబుకు కూడా జై కొడతారని భావించారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత మొదటి రెండురోజులు బాగానే ఉండింది. ఆ తర్వాత సెగ మొదలైంది. ప్రజలకు సమస్యలు తీవ్రమయ్యాయి. వ్యాపారాలు దెబ్బతినసాగాయి. కూలీ నాలి చేసుకునే వారికి పనులు లేకుండా పోయాయి. దీంతో ప్రజలు మోడీతో పాటూ పెద్దనోట్లు రద్దుచేయమని లెటర్‌ వ్రాసిన చంద్రబాబును కూడా తిట్టసాగారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిసాక ఎలాగూ అలవాటే కాబట్టి చంద్రబాబు ప్లేటు ఫిరాయించాడు. నా వల్లే పెద్దనోట్లు రద్దు అన్న మాటను వదిలేసి, కేంద్రంపై విమర్శలకు దిగాడు. తెలుగుదేశం నాయకులు కూడా పెద్దనోట్ల రద్దు క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేయడం మానేసారు. కేంద్రంపై చంద్రబాబు అసహనం ప్రదర్శిస్తే, ఆయన అనుచరులు ఆరోపణలకు శ్రీకారం చుట్టారు.

కాని ఎంత తప్పించుకుందామనుకున్నా పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలైతే ఆయనను బహిరంగంగానే ఆడిపోసుకుంటున్నట్లు తెలుస్తోంది.

chandraరాబోయే ఎన్నికలు ఏకపక్షంగా జరిగిపోవాలి. ప్రతిపక్షం ఉనికే కన పడకూడదు... ఇదే చంద్రబాబు తమ పార్టీ శ్రేణులకు చేస్తున్న ఉపదేశం. మరి ఎన్నికలు ఏకపక్షంగా జరిగేంత సీన్‌ రాష్ట్రంలో ఏముంది. ఏం అద్భు తాలు చేసాడని ప్రజలంతా కట్టకట్టు కుని తెలుగుదేశంకు ఓట్లేస్తారు. నీతి, నిజాయితీలతో పాటు తమ రాష్ట్రాలను అభివృద్ధి వైపు పరుగులు తీయించిన నరేంద్రమోడీ, నితీష్‌కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ల వంటి వాళ్లకే ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించడం సాధ్యం కాలేదు. వారి పరిపాలనతో పోలిస్తే చంద్రబాబుకు వారికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది.

ఇక్కడ అవినీతి తప్ప అభివృద్ధి ఆనవాళ్లు లేవు. మాటలు కోటలు దాటుతున్నాయేగాని ఆచరణాత్మక ప్రగతికి బాటలు లేవు. మరి ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు ఏకపక్షంగా ఓట్లేస్తారు. ఎప్పుడో 2019 ఎన్నికల దాకా ఎందుకు త్వరలోనే రాష్ట్రంలో 7 కార్పొరేషన్‌లకు, పలు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితోనే తెలుగుదేశం బండారం బయటపడబోతోంది. చంద్రబాబు చేతికందిన ఓ నిష్పాక్షిక సర్వేలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయట పడ్డాయి. తెలుగుదేశంకు కంచుకోట అంటున్న గుంటూరు, కాకినాడ కార్పొరేషన్‌ లలోనే తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదని ఆ సర్వే బయటపెట్టింది. విశాఖ కార్పొరేషన్‌లో సైతం తెలుగుదేశం పరిస్థితి ఆశాజనకంగా లేదని, చాలా పురపాలక సంఘాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొం దని ఆ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీలకు గాను కేవలం 58 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం తిరిగి గెలవగలిగే పరిస్థితి వుందని ఆ సర్వేలో వెల్లడి కావడంతో బాబుకు భయం పట్టుకుంది. అందుకే త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలను జాగ్రత్తగా ఎదుర్కో వాలని భావిస్తున్నాడు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ మాత్రం ఎదురుదెబ్బ తగిలినా తెలుగు దేశం పతనానికి అది ఆరంభమవుతుంది.

అయితే అధికారంలో వున్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికి రెండున్నరేళ్లే గడిచాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు వుంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ప్రజల ఓట్లు ఎంత ప్రభావం చూపుతాయో, అధికారం కూడా అంతే ప్రభావం చూపుతుంది. అదీకాకుండా ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కావు. పరోక్షంగా మేయర్‌, ఛైర్మెన్‌లను ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా కౌన్సిల్‌లో ఓటర్లే! కాబట్టి అధికారపార్టీకి నాలుగైదు సీట్లు తగ్గినా అదనపు సభ్యుల బలంతోనూ, లేదా ప్రతిపక్ష సభ్యులను కొనుగోలు చేయడం ద్వారానూ తమ పార్టీ వారిని మేయర్‌లు, ఛైర్మెన్‌లను చేయడం పెద్ద సమస్య కాదు. అయితే ఓటింగ్‌ ట్రెండ్‌ను బట్టి ఏ పార్టీ బలహీన పడు తుంది, ఏ పార్టీ బలపడుతుందని అంచనా వేయొచ్చు. ప్రజలు గుత్తసొత్తుగా ఓట్లేసేంత గొప్ప పనులేవీ చంద్రబాబు చేయలేదు. ఇంతవరకు తనకు, తన పార్టీవారికి పని కొచ్చే పనులే చేసుకున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగాను, అవినీతి ఘనంగానూ వుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ధనదాహం హద్దులు దాటింది. వీరి ధాటికి కాంట్రాక్టర్లు, పారి శ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారు.

చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం ఆయన చేయించుకున్న సర్వేలోనే తేటతెల్ల మైంది. పరిస్థితి ఇలాగే ఉంటే, అవినీతి ఇలాగే రాజ్యమేలుతుంటే చంద్రబాబు పై ప్రజల్లో విరక్తి పెరగడమేకాని తగ్గడం వుండదు.

psuhkarపుష్కరాలు... తరతరాలుగా వస్తున్న సంప్రదాయ సంబరాలు. ప్రకృతిని పూజించే హైందవ సంస్కృతి ప్రతీకలు. భారతదేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూనో, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులో కనిపెట్టినవి కావు. మన ఋషులు, ఆథ్యాత్మిక వేత్తలు, పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన సంప్రదాయ వేడుకలు.

మరిప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న హడావిడి చూస్తుంటే పుష్కరాలను కూడా ఆయనే కనిపెట్టాడేమోననిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు కంప్యూటర్లు నేనే తెచ్చాను, సెల్‌ఫోన్‌లు నేనే తెచ్చానని ఆయన చెప్పుకుంటుంటాడు. ఆ విధంగా పుష్కరాలను నేనే తెచ్చానని చెప్పుకునే అవకాశమైతే లేదు గాని, పుష్కరాలను కూడా ఒక రాజకీయ జాతరగా మార్చిన ఖ్యాతి మాత్రం ఆయనదేనని చెప్పుకోవచ్చు.

ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పుష్కరాలు జరిగే 12రోజులు ముఖ్యమంత్రే అక్కడ ఉండడం ఎప్పుడూ జరగలేదు. దీనిని బట్టి ఏపి సీఎం పని లేక ఎంత ఖాళీగా ఉంటున్నాడో అర్థమైపోతోంది. గోదావరి పుష్కరాలని చెప్పి 2వేల కోట్లు విడుదల చేశారు. తూతూ మంత్రంగా పనులు చేశారు. చేసిన పనులన్నీ కూడా తాత్కాలికమే! అవి కూడా నాణ్యతగా లేవు. ఇక మళ్ళీ పుష్కరాలొచ్చేది 12ఏళ్లకు. అప్పటికి ఈ చేసిన పనులేవీ ఉండవు. మళ్ళీ నిధులు... మళ్ళీ పనులు. ఈ రెండువేల కోట్లు గోదావరి నీళ్లలో చల్లినట్లే!

గోదావరి పుష్కరాల ఖర్చుపై విపరీతంగా విమర్శలు రావడం వల్లనేమోగాని... కృష్ణ పుష్కరాల ఖర్చును బయటకు పొక్కనీయడం లేదు. అయితే ఇక్కడా హంగూ ఆర్భాటం ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కృష్ణా నది పుష్కరాలు అప్పటికప్పుడు నిర్ణయించినవి కావు. ఏఏ సంవత్సరాలలో కృష్ణానది పుష్కరాలు వస్తాయన్నది వ్రాసి పెట్టుంటుంది. కాబట్టి పుష్కరాలకు సంబంధించిన పనులను ఏడాది కాలం నుండే తీరిగ్గా, నాణ్యంగా చేసి ఉండొచ్చు. కాని, ఇలా చేస్తే చంద్రబాబుకు 'కిక్‌' ఉండదేమో? కృష్ణ పుష్కరాల పనులను చాలా తక్కువ సమయంలో యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టించాడు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌లన్నీ కూడా తెలుగు తమ్ముళ్లకే దక్కాయి. ఎక్కువ పనులను నామినేషన్‌ల పద్ధతిలోనే కేటాయించారు. కేవలం నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి చేసిన పనులే ఇవి. ఇక ఆ పనులు ఎంత అధ్వాన్నంగా అఘోరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్కరాలు మొదలు కాకముందే పుష్కర ఘాట్లలో పగుళ్లు... వేసిన టైల్స్‌ లేచిపోవడం... వేసిన రోడ్లలో పగుళ్ళు... భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన ఓ సంప్రదాయ వేడుకను ప్రభుత్వం అవినీతికి వేదికగా మలచడమే జుగుప్స కలిగిస్తోంది. అసలు పుష్కరాల పేరుతో ఈ ప్రచారం, ఇంత హంగామా, ఇంత దోపిడీ అవసరమా? ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లు ఇవేమీ చంద్రబాబు ఇంట్లో జరిగే వేడుకలు కావు... ఈయన వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులను పుష్కరాలకు ఆహ్వానించడానికి! అలాగని ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నవి కావు... కృష్ణ పుష్కరాలే కర్నాటక, తెలంగాణలలోనూ జరుగుతాయి. దేశంలో మొత్తం 12 నదులు ప్రవహించే రాష్ట్రాలలో ప్రతి ఏటా కుంభమేళా అనో, పుష్కరాలనో ఈ వేడుకలు జరుపుతుంటారు. ఆ రాష్ట్రాల సీఎం లెవరూ పుష్కరాలకు ఇంత హంగామా చేయడం లేదు. పుష్కరాల పేరుతో విచ్చలవిడి అవినీతికి తెరతీయడం లేదు. అంతెందుకు మనపైన ఉన్న తెలంగాణనే చూద్దాం... అక్కడా మొన్న గోదావరి పుష్కరాలు జరిగాయి. ఎంత పద్ధతిగా జరిపారు. మనలాగా అక్కడ రెండు వేల కోట్లు ఖర్చుపెట్టలేదు. కాని గోదావరి పుష్కరాలను పవిత్రంగా జరిపారు. ఎక్కడా అవినీతి ఆరోపణలు లేవు. ఇప్పుడు కృష్ణ పుష్కరాలలోనూ వాళ్లు ఎలాంటి హంగామా చేయలేదు. అలాగని పుష్కరాల ఏర్పాట్లను పద్ధతిగా చేశారు. కాని చంద్రబాబు పుష్కరాలు మొదలు కాకముందే విజయవాడలో గుళ్లు, గోపురాలను, నాయకుల విగ్రహాలను కూలదోయించి... పుష్కరాల పవిత్రతకు ఉన్న అర్ధాన్నే మార్చేశాడు.

Page 2 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
  నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter