cm modiఅడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అయితే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుక్కుంటున్నా కేంద్ర ప్రభుత్వం పెట్టడంలేదు. అసలు ఆయన మాటనే పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని చంద్రబాబు ఎంత సాధారణంగా తీసుకుంటున్నాడో, కేంద్ర ప్రభుత్వం అంతకంటే సాధారణంగా తీసుకుంటోంది.

సిద్ధడు అద్దంకి పోనూ పోయాడూ, రానూ వచ్చాడు... అన్నట్లుగా వుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి ప్రధానితో చర్చించడానికై చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడు. ప్రధానితో సమావేశమయ్యాడు. ఒక వినతిపత్రం కూడా సమర్పించాడు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈయన ఇచ్చిన అర్జీని తీసుకుని చదివి చూస్తానని చెప్పి పంపించారు. ప్రత్యేకహోదా, లోటుబడ్జెట్‌, విభజన హామీలపై ప్రధాని నుండి ఎలాంటి స్పష్టమైన హామీ లేదు. నాయకులు సాధారణ ప్రజల నుండి అర్జీలను తీసుకుని ఎలా పక్కన పడేస్తుంటారో... చంద్రబాబు ఇచ్చిన అర్జీని కూడా ప్రధాని అలాగే పక్కనపెట్టాడు. కేవలం చంద్రబాబు బాకా ఊదే పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు ఢిల్లీలో కేంద్రాన్ని కడిగేసాడని, సీరియస్‌గా మాట్లాడాడని ఊదరగొట్టింది.

ఇంతకుముందులాగా ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పే పరిస్థితి లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికి బీజేపీని గద్దించే స్థితిలో తెలుగుదేశం లేదు. చంద్రబాబు గట్టిగా మాట్లాడితే వాళ్ళే బయటకు పొమ్మనేటట్లున్నారు. ఇప్పుడున్న పొజిషన్‌లో చంద్రబాబు కూడా వారితో కయ్యం పెట్టుకోలేడు.

ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనా విధానాలపై ప్రధాని మోడీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని దేశంలో సబ్సిడీల తగ్గింపుకు, దుబారా అదుపుకు ప్రాధాన్యతినిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ఆర్ధిక పరిపుష్టికి కృషి చేస్తున్నారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందనట్లుగా వున్న చంద్రబాబు పరిపాలనా పోకడలు మోడీకి నచ్చడం లేదు. అప్పుల్లో, ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి తాను సీఎంగా వున్నానన్న విషయం చంద్ర బాబు మర్చిపోతున్నాడు. అమెరికాలోని కొలంబియా రాష్ట్రానికో, జార్జియా రాష్ట్రానికో తాను ముఖ్యమంత్రిని అన్నట్లు ఆయన పోకడలున్నాయి. మితిమీరిన చంద్రబాబు దుబారా ఖర్చు సంగతి కేంద్రం దాకా వెళ్లింది. రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా వుందని, ప్రజా ధనాన్ని అక్రమమార్గాలలో లూఠీ చేస్తు న్నారని, అనవసరమైన ఖర్చులు ఎక్కు వుగా పెట్టేస్తున్నారనే విషయం రాష్ట్రం లోని బీజేపీ శ్రేణుల ద్వారా కేంద్రానికి చేరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి నేరుగా నిధులివ్వడానికి కూడా కేంద్రం సంసిద్ధంగా లేదు. ముఖ్యంగా 16వేల కోట్లు అంచనా వేసిన పోలవరం ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండింతలు చేసింది. కేవలం ప్రాజెక్టు పేరుతో దోపిడీ కోసమే అంచనా వ్యయాన్ని పెంచారని రాష్ట్ర బీజేపీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబుపై ప్రధాని మోడీకి నమ్మకం లేదు. మొదట నుండి కూడా చంద్రబాబు పట్ల ఆయన ఎడబాటు ధోరణితోనే వున్నారు. చంద్రబాబు ఆడంబరాలు ఆయనకు అస్సలు నచ్చడం లేదు. అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న హంగామా కూడా నచ్చడం లేదు. చంద్రబాబు ఏం అడిగినా కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు.

cm pmప్రత్యేక హోదా అంశం రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలకు బాటలు వేసింది. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తెలుగుదేశంపై ఎదురుదాడికి దిగారు. హోదా అపరసంజీవని కాదని చెప్పింది చంద్రబాబేనని, మళ్ళీ హోదాపై ఎలా విమర్శలు చేస్తారంటూ నిలదీస్తున్నారు.

అయితే ప్రత్యేకహోదా విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. చంద్రబాబు తొలి నుండి కూడా ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీ వైపే మొగ్గుచూపుతున్నాడు. హోదా వస్తే రాజకీయంతో సంబంధం లేకుండా రాష్ట్రం బాగుపడుతుంది. దానివల్ల ఆయనకేం లాభం. అదే ప్యాకేజీ క్రింద నిధులొస్తే పార్టీ వాళ్లు పంచుకోవచ్చు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు ఏనాడూ గట్టిగా అడిగింది లేదు. కాబట్టి కేంద్రం కూడా దీని గురించి సీరియస్‌గా తీసుకోలేదు. అదీగాక రాష్ట్రంలో తెలుగుదేశంకు దూరం కావాలనే ప్రయత్నాలలో బీజేపీ వుంది. ఏపిలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం ఆలోచన. కేంద్రం ఇచ్చే నిధులన్నింటికి చంద్రబాబు తన పేర్లు పెట్టుకుంటున్నాడు. రేపు ప్రత్యేకహోదా ఇచ్చినా ఇది నా ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటాడు. మిత్రపక్షంగా వుంటే బీజేపీ దానికి అడ్డు చెప్పలేదు. కాబట్టి తెలుగుదేశం నుండి వీలైనంత తొందరగా విడిపోయే ప్రయత్నాల్లో బీజేపీ వుంది. వైకాపా ఎమ్మెల్యేలు చాలా మంది తెలుగుదేశంలో చేరుతున్నారు. వైకాపా బలహీన పడితే ఆ పార్టీకి రాష్ట్రంలో రాజకీయ, ఆర్ధిక అండదండలు అవసరం. అవి బీజేపీ వద్ద ఉన్నాయి. వైకాపాతో పొత్తు పెట్టుకోవడమో, లేక ఆ పార్టీని విలీనం చేసుకోవడమో జరగొచ్చు. తెలుగుదేశంతో కలిసి వుంటే ఈ రాష్ట్రంలో బీజేపీ మరుగుజ్జు గానే వుంటుంది. వైసిపి బలహీనపడ్డాక ఆ పార్టీతో కలిస్తే బీజేపీ కూడా బలంగానే కనిపిస్తుంది. తెలుగుదేశం నుండి విడిపోయాక రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటూ మరిన్ని పథకాలను కేంద్రప్రభుత్వం ద్వారా ప్రకటింపచేస్తే ఆటోమేటిక్‌గా ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది. ఈ వ్యూహంతోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై బీజేపీ ముందుకు పోతున్నట్లుగా తెలుస్తోంది.

bjp ycpచంద్రబాబు... జగన్‌... ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ తమ పార్టీల జెండాలు రెపరెపలాడించాలనుకున్నారు. తెలంగాణ రాజకీయాలలోనూ కీలకంగా ఉండాలనుకున్నారు. వీరి ఆలోచనకు ప్రధాన కారణం హైదరాబాద్‌. ఈ నగరంలో ముస్లింల తర్వాత సీమాంధ్ర సెటిలర్స్‌దే ఆధిపత్యం. వ్యాపారం కూడా ఎక్కువ. సగం తెలంగాణ హైద్రాబాదే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో పట్టు కలిగి ఉండడమంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రాధాన్యత కలిగి ఉండడమే.

అందుకే చంద్రబాబు విభజన తర్వాత రెండు కళ్ల సిద్ధాంతాన్ని కనిపెట్టి తెలంగాణలో తిష్ట వేసుకుని కూర్చోవాలనుకున్నాడు. లోకేష్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించి తాను ఆంధ్రాను చూడాలనుకున్నాడు. జగన్‌ కూడా చెల్లెలు షర్మిళకు తెలంగాణను అప్పగించాడు. అయితే కేసీఆర్‌ ఇద్దరికీ కొరివికట్టెతో కాల్చినట్లు వాతపెట్టాడు. మొదట తెలంగాణలో తెలుగుదేశంను లేకుండా తుడిచిపెట్టేశాడు. ఓటు-నోటు కేసులో చంద్రబాబును ఇరికించేసి, ఆయనను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. రేవంత్‌రెడ్డి తప్ప మిగతా తెలుగుదేశం పెద్ద తలకాయలనన్నింటిని టిఆర్‌ఎస్‌లోకి లాగేశాడు. మొన్న గ్రేటర్‌ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం స్థితి, పరిస్థితి ఏంటన్నది తేటతెల్లమై పోయింది. తెలుగుదేశంతో పాటు మరో ఆంధ్రా పార్టీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ కూడా తెలంగాణలో చాప చుట్టేస్తోంది. ఆ పార్టీకున్న ఏకైక ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరాడు. మిగిలిన వాళ్లు కూడా గట్టిగా నెల, రెండు నెలల్లో టిఆర్‌ఎస్‌ గుడారంలోకి పోనున్నారు. తెలంగాణలో వైసిపి జెండాను త్వరలోనే ఎత్తేయడం ఖాయం. కేసీఆర్‌ పుణ్యమా అని చంద్రబాబు, జగన్‌లిద్దరూ తెలంగాణను వదిలేసి ఆంధ్రాపై దృష్టి పెడితే అంతకంటే కావాల్సిందేముంది.

Page 3 of 10

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter