babuఆయన వేగంగా నడుస్తాడు... ఆయన వేగంగా పని చేస్తాడు... ఆయన కదలికలు వేగంగా వుంటాయి. ఆయన ఆలోచనలు వేగంగా వుంటాయి. ఏపిని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌లో వుంచాలన్నది ఆయన తాపత్రయం. ఏపిని ఆయన ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాడు... కాని ఈ రాష్ట్రం అక్కడిదాకా పోదు... ఇక్కడే వుంటుంది. కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిపోయింది. ఆయన వేగంగా ముందుకెళ్ళబట్టే దేశంలోనే ధనిక సీఎంల జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంకును సాధించాడు. ఆ విధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలపలేకపోయినా అత్యధిక సంపన్నుల సీఎంల జాబితాలో తాను మాత్రం మొదటి స్థానంలో నిలిచాడు.

ఇటీవల ఏడిఆర్‌ అనే సంస్థ నిర్వ హించిన సర్వేలో 177కోట్ల ఆస్తులతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం లోని 31మంది సీఎంలలో టాపర్‌గా నిలిచాడు. త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్‌ చివరి స్థానాన్ని దక్కించు కున్నాడు. రాష్ట్ర విభజనతో ఏపి ఆర్ధికంగా దెబ్బతింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పడిపోయాయి. ఈ సమయంలో చంద్రబాబు సంపద మాత్రం పెరిగింది. ఈ కిటుకేదో ప్రజలకు చెబితే వాళ్ళు ఆయన మార్గాన్నే అనుసరిస్తారు కదా! ఆస్తులపరంగా సీఎం నెంబర్‌వన్‌లో వుండి, అభివృద్ధిపరంగా రాష్ట్రం వెనుకబడిపోతే అది చంద్రబాబుకే నామోషీ అవుతుంది కదా!

chandraఎవరు సొమ్ము ఎవరు తింటున్నారు... ఎవరి సొమ్ముతో ఎవరు జల్సాలు చేస్తున్నారు... ఎవరి సొమ్మును ఎవరు కొల్లగొడుతున్నారు... ఎవరిని చూసి ఎవరు సిగ్గుపడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు నాయకులు సిగ్గుపడాల్నా? ఈ నాయ కుల ఉత్తుత్తి హామీలు నమ్మి ఓట్లేసినం దుకు ప్రజలు సిగ్గుపడాల్నా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు డాక్టర్‌ బెజ వాడ గోపాలరెడ్డిని మొదలుకొని నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నందమూరి తారక రామారావు, డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర రెడ్డి లాంటి గొప్ప నాయకులెందరినో చూసారు. రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్లెంతో కృషి చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవా లుగా ముద్రపడ్డ ఎన్టీఆర్‌, వై.యస్‌లు చేపట్టిన పథకాలైతే ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోయాయి. ఈ నాయకు లెవరూ తమకు ఓట్లేసిన ప్రజలను బాని సలుగా చూడలేదు. తమను తాము పాల కులుగా ఫీలవ్వలేదు. ప్రజలకు నిత్య సేవకులుగానే వాళ్ళు నడుచుకున్నారు. ప్రజలనే దైవంగా భావించారు. ప్రజల ఆత్మగౌరవానికి అత్యంత విలువ ఇచ్చారు. ఓట్ల రూపంలో వాళ్లెప్పుడు కూడా ప్రజ లను తక్కువ చేసి చూడలేదు. చులకన చేసి మాట్లాడలేదు.

అదేంటో కాని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం రాష్ట్ర ప్రజలు చాలా చులకనగా కనిపిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో తెలుగు దేశంపార్టీని గెలిపించాలంట. ఒకటి రెండు నియోజకవర్గాలలో టీడీపీ ఓడి పోతే, ఆ పార్టీకి ఓటేయని దానికి ప్రజలు సిగ్గుపడాలట... ఏం మాటలివి. ఓటు వేయని దానికి కాదు, 2014లో వేసిన దానికి చాలామంది సిగ్గుపడుతున్నారు. ఈ నాలుగేళ్లలో ఏం పొడిచారని ఓట్లేయాలి. అమరావతి రాజధాని అన్నారు, వేల ఎకరాల మాగాణి భూములను బీడుగా పెట్టారు. రాజధాని పేరుతో విదేశాలు తిరుగుతూ కోట్లాది రూపాయలు తగలేస్తు న్నారు. సెజ్‌ల పేరుతో పేదల భూములను లాగేస్తున్నారు. ఋణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చారు. దానిని తూతూ మంత్రంగా అమలు చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. వేలకోట్లు దుర్వినియోగమవుతున్నాయి. ప్రత్యేక హోదాను పోరాడి తేలేకపోయారు. కేంద్రం బాధ్యతగా పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ను నేను చేస్తానంటూ తీసుకుని దానిని త్రిశంకుస్వర్గంలో వుంచారు. అధికారపార్టీ నేతలే మహిళలు, దళితులపై యధేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచి గోరంత అయితే నష్టం కొండం తగా వుంది.

రాష్ట్రంలో ప్రజలు హర్షించేలా ఎగిరి గంతులేసేలా చంద్రబాబు పరిపాలనలేదు. 2004-09ల మధ్య సాగిన వై.యస్‌. పరి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీసింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలవాళ్ళు, ఆ కులం ఈ కులం అని లేకుండా అన్ని కులాల వాళ్ళు బాగు పడ్డారు. రాష్ట్రంలో ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. ఆయన పాలనలో అసంతృప్తికి లోనయినవాళ్ళు లేరు. ఆయన చేపట్టిన ప్రాజెక్ట్‌లు, సెజ్‌లు, తెచ్చిన పథకాల మూలంగా అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొం దారు. ప్రజలకు ఇంత మేలు జరిగితేనే 2009 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన సీట్లు 155. అది కూడా కంబైన్డ్‌ రాష్ట్రంలో... 294 అసెంబ్లీ సీట్లలో. నేను ఇంత చేసినా సీట్లు తగ్గాయని ఆయన ప్రజలను నిందించలేదు. నాకు ఓటేయనందుకు సిగ్గుపడండంటూ ప్రజలను దూషించలేదు. మనలోనే ఇంకా ఏదో లోపం వుందని భావించాడు. ప్రజల్లో మనపై ఇంకా కొంత అసంతృప్తి ఉంది, అదేదో తెలుసుకుని సరిదిద్దుకుందామని తన పార్టీ శ్రేణులకు చెప్పాడు. ప్రజల పట్ల వినయం అంటే అది. నాకు ఓటేయకపోతే మీరు సిగ్గు పడాలి... అని ప్రజలను ఒక నాయకుడు అనడం అంటే ఆయన దృష్టిలో ప్రజలు మనుషులుగా వున్నారా లేక జంతువు ల్లాగా, బానిసల్లాగా వున్నారా అన్నది అర్థం కావడం లేదు.

chandraఎవడబ్బ సొత్తయ్యా ఇది, నీ కొడుకు సొత్తునేమన్నా పెడు తున్నావా, మీరు తినేది ప్రజల సొమ్ము, సిగ్గుండాలి మాట్లాడ డానికి... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి లోక్‌సత్తా కన్వీనర్‌ జయప్రకాశ్‌ నారాయణ చేసిన వ్యాఖ్యలివి. నిజమే... ఎవరి సొత్తును ఎవరు తింటున్నారు. ప్రజల సొత్తును చంద్రబాబు తింటున్నాడా? లేక చంద్రబాబు సొత్తును ప్రజలు తింటున్నారా? చంద్రబాబు ఉండే బంగ్లా, తిరిగే హెలికాఫ్టర్‌, కూర్చునే ఛాంబర్‌, తీసుకునే జీతం... అంతా ఎవరి సొత్తు. ఈ రాష్ట్ర ప్రజల సొత్తు. మరి ఆయన ప్రజల సొత్తును తింటూ ఆ ప్రజలనే బద్నాం చేస్తాడా? ఆ ప్రజలనే నా సొత్తు తింటూ నాకు ఓట్లేయరా? అని బెదిరిస్తాడా?

చంద్రబాబుకు నంద్యాల ఉపఎన్నికల భయం బాగా పట్టుకుంది. ఇక్కడ ఓడిపోతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎంత వేగంగా మారుతాయో ఆయనకు తెలుసు. అందుకే నంద్యాలలో గెలుపు కోసం అడ్డ దారులు తొక్కడానికి సిద్ధమవుతున్నాడు. సభల్లో కూడా శృతిమించి తన స్థాయికి దిగజార్చి మాట్లాడుతున్నాడు. ఇటీవల నంద్యాలలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ విజ్ఞులను నోరెళ్లబెట్టేలా చేసింది. నేనిచ్చిన పింఛన్‌లు తీసుకుం టున్నారు, నేనిచ్చిన రేషన్‌ తీసుకుంటు న్నారు, నేను వేసిన రోడ్లపై తిరుగుతున్నారు. మరి నాకు కాకపోతే ఇంకెవరికి వేస్తారు ఓట్లు, నాకు ఓట్లేయకపోతే అవేమీ తీసు కోవద్దు... ముఖ్యమంత్రిగా వుండి చంద్ర బాబు మాట్లాడిన మాటలివి. భారత రాజ కీయ చరిత్రలో చంద్రబాబు కన్నా అధ్వా న్నంగా పనిచేసిన ముఖ్యమంత్రులొచ్చారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఇంత హీనంగా మాట్లాడలేదు.

భారత రాజకీయ చరిత్రలో ప్రజల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఏ నాయకుడూ సొంత ఆస్తులు అమ్మిన దాఖలాలు లేవు. ప్రజాసేవ కోసం సొంత ఆస్తులను దానం చేసిన నాయకు లున్నారు గాని, ఆ జాబితాలో మాత్రం చంద్రబాబు లేడు. రాజకీయాలలో మూడు రకాల నాయకులు కనిపిస్తారు. ప్రజల కోసం పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చి తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను కర్పూరహారతిలా కరిగించిన నాయకులు మొదటి రకం. ఉన్న ఆస్తులను కాపాడు కోవడానికి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు రెండో రకం. వట్టి చేతుల్తో రాజకీయాల్లోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మూడోరకం. దేశంలో ప్రస్తుత మున్న నాయకులు చాలామంది ఈ మూడోవర్గంలోకే వస్తారు. చంద్రబాబును అందులో నుండి వేరు చేయలేం. ఇది జగమెరిగిన సత్యం.

ప్రజల కోసం చంద్రబాబు సొంత ఆస్తులను అమ్మిన దాఖలాలు లేవు. ప్రజలు పన్నులు రూపంలో కట్టిన సొమ్మునే ఆయన జల్సాగా అనుభవిస్తున్నాడు. మరి ప్రజల సొమ్మును ఆయన తింటూ నా సొత్తు తింటున్నారని ప్రజలను ఏ విధంగా బెదిరి స్తారు. రోడ్లేసినా, పింఛన్‌లిచ్చినా, రూపా యికి కిలో బియ్యం ఇచ్చినా ప్రజలు కట్టే పన్నుల నుండే ఇస్తున్నారు గాని ఏ నాయ కుడి ఆస్తులు అమ్మి ఇవ్వడం లేదు.

తాను చేసిన అరకొర పనులకే చంద్ర బాబు ఇలా ప్రజలను బెదిరిస్తుంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు, పథ కాలు అమలు చేసిన స్వర్గీయ ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి, ఎంజిఆర్‌, ఎన్టీఆర్‌, వై.యస్‌.రాజశేఖర రెడ్డి, జయలలిత లాంటి నాయకులకు ప్రజలు జీవితాంతం ఓట్లేస్తూనే వుండాలి. వీళ్లు కూడా వాళ్ల సొంత డబ్బులతో పథకాలు చేపట్టలేదు. ఎవరు మంచి పనులు చేసినా అవి ప్రజల డబ్బుతోనే చేసారు. కాకపోతే వాళ్లు ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చుపెడితే, చంద్రబాబు పెట్టే ఖర్చంతా కూడా తన వారిని దృష్టిలో పెట్టుకునే ఖర్చు పెడుతు న్నట్లుగా ఉంటుంది.

ఈ దేశంలో ప్రజలెవరూ నాయ కులకు ఋణపడి వుండరు. ప్రజల సొమ్మును తిన్న నాయకులే ప్రజల పట్ల కృతజ్ఞులై వుండాలి. చంద్రబాబు ముందు ఆ సంగతి తెలుసుకోవాలి.

Page 1 of 15

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • బ్రదర్స్‌ దారెటు?
  ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి... ఆనం వంశంలో మొదటి తరం. ఆనం సంజీవరెడ్డి, ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం వివేకా, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం జయ, ఆనం విజయ... వీళ్ళంతా రెండోతరం నాయకులు... ఇప్పుడు మూడోతరం కూడా రంగంలో వుంది. ఆనం వెంకటరమణారెడ్డి,…
 • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
  దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
 • నగర కిరీటం జయకేనా?
  జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థితిగతుల గురించి అధిష్టానం నాలుగేళ్ళుగా పట్టించుకో లేదు. ఇష్టం వచ్చిన రీతిలో పదవులు ఇచ్చు కుంటూ పోయారు. ఒక వర్గాన్ని తొక్కడమే లక్ష్యంగా పనిచేసారు. రాజకీయాలలో ఎక్కడం, తొక్కడం లాంటివి మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే…
 • గుంతలా!..మత్యు గుహలా!..
  జిల్లాలోని చెరువులు దొరువుల్లో, నీటి గుంతల్లో మృత్యువు పొంచివుంటోంది. ఆ మృత్యువు ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. ఇటీవల సెలవుల్లో సరదాగా ఈతకు దిగిన పలువురు చిన్నారులను, యువకులను మృత్యువు పొట్టనబెట్టుకుంది. చెరువుల్లో ఎక్కడంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా గుంతలు…
 • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
  పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter