sai pallaviజనరల్ గా హీరోలు హీరోయిన్లను తొక్కేస్తుంటారు.. హీరోయిన్ల బాధ కూడా అదే..! చాలాసార్లు తాము వెనకబడిపోతున్నామంటూ నిట్టూరుస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలను ధీటుగా ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు హీరోలను మించిపోతుంటారు కూడా..! ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇదే టైప్.! సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ జరిగితే హీరోయిన్స్ డుమ్మా కొట్టడం చాలా సార్లు చూస్తుంటాం. సినిమా చేసిన తర్వాత మిగిలిన వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు కొంతమంది హీరోయిన్లు బిహేవ్ చేస్తుంటారు. అయితీ ఇటీవల జరిగిన కణం అనే సినిమా ప్రమోషన్ కు హీరో నాగశౌర్య గైర్హాజరయ్యాడు. ఇది అందరినీ షాక్ కు గురిచేసింది. హీరో డుమ్మా కొట్టడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాగశౌర్య డుమ్మా కొట్టడానికి కారణం హిరోయిన్ సాయి పల్లవి అని తెలుస్తోంది. కణం సినిమాలో సాయిపల్లవిదే లీడ్ రోల్. సినిమా నిర్మాత మొదలు దర్శకుడి వరకూ అందరూ సాయిపల్లవి వెంటే నడిచారట. దీంతో నాగశౌర్య హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. మరోవైపు సాయిపల్లవి కూడా తానే హీరో, హీరోయిన్ అన్నట్టు బిహేవ్ చేసిందట. దీంతో నాగశౌర్యకు మండిపోయింది. అందుకే డుమ్మా కొట్టేశాడు. సాయిపల్లవి బిహేవియర్ పై రూమర్స్ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో ఎంసీఏ సినిమాకు సంబంధించి కూడా ఆమెపై ఇలాంటి టాక్సే వచ్చాయి. నానికి, సాయిపల్లవికి మధ్య గొడవలు వచ్చాయని, వాటిని నిర్మాత దిల్ రాజు సెట్ చేశాడని టాలీవుడ్ కోడై కూసింది. ఇప్పుడు నాగశౌర్యకు కూడా సాయిపల్లవి చుక్కలు చూపించిందనేది తాజా టాక్.

pooja hegdeప్రజంట్ టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ నుంచి గోల్డ్ లెగ్ గా ట్రాక్ మార్చిన బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు సరైన హిట్ లేదు.. అయినా ఆఫర్స్ వరద అగడం లేదు. మహేష్ నుంచి ప్రభాస్ వరకు అందరితో జోడి కట్టే ఛాన్స్ ని పట్టేసింది. ఇప్పటికే చెర్రీ మూవీలో చిందేసిన పూజా.. శ్రీనివాస్ తో కలిసి సాక్ష్యం చెప్పబోతుంది. మరి ఈ సారైనా తన సీన్ మారుతుందా?

 టాలీవుడ్ లో అప్పుడెప్పుడో ఎంట్రీ ఇచ్చి క్యూట్ హీరోయిన్ గా ఫోకస్ అయ్యింది పూజా హెగ్డే. ముకుంద, ఒకలైలా కోసం వంటి సినిమాలు హిట్ అవ్వకున్నా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులే పడ్డాయ్. తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన  పంథానే మార్చేసింది. అందాల ఆరబోతకు హద్దులు లేని పూజా... దేనికైనా రెడీగా ఉంటుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి  డీజే అంటూ కుర్రకారును ఫిదా చేసింది. దీంతో యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

టాలీవుడ్ లో ప్రజంట్ పూజకు సరైన హిట్ లేకపోయినా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయ్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం పూజా హెగ్డే ఎకౌంట్ లో పడిందనే ప్రచారం జరుగుతోంది. పూజా ఎక్కడో నక్కతోక తొక్కినట్లు ఉంది. ప్రభాస్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ప్రజంట్ ప్రభాస్ సాహో షూటింగ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవగానే కృష్ణంరాజు నిర్మాణంలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా పూజానే సెలెక్ట్ చేసినట్టు టాక్. ఇక మహేష్ 25వ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నాడు. ఇందులో కూడా పూజానే హీరోయిన్ అనేది టాక్. ఎలా చూసినా ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కీ దక్కలేదు. కానీ అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకుంది పూజా. త్వరలో ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రభాస్, మహేష్ సినిమాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. మరి వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ అయినా పూజా సీన్ మారే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లో వచ్చే టూ త్రీ ఇయర్స్ తన హవా నడిచే అవకాశం ఉంది.

srideviదాదాపు అయిదు దశాబ్దాల పాటు భారతీయ చిత్రపరిశ్రమను ఉర్రూతలూగించిన అగ్రతార శ్రీదేవి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో తనదంటూ ఓ ప్రత్యేకముద్ర వేసుకున్న అందాలతార... అతిలోక సుందరి.. అనంతలోకాలకు చేరిపో యింది. అశేష అభిమానజనానికి ఇక సెలవంటూ.. ఏ కన్నీళ్లూ.. ఏ శోకాలూ లేని దిగంతాలకో... ఏ దూర సుదూర తీర సరోవరాలవతలికో తరలివెళ్ళి పోయింది. ఆమె జీవితమంతా నటన లోనే ఉండిపోయింది.. 54 ఏళ్ళ జీవి తంలో 50 ఏళ్ళు నటనారంగంలోనే పండిపోయింది. నటించిన ప్రతి సన్ని వేశంలోనూ జీవించింది. దక్షిణాది,

ఉత్తరాది రాష్ట్రాలను అన్నిటినీ ఒకటి చేస్తూ, ప్రాంతాలకు భాషలకు అతీతంగా నటనా ప్రావీణ్యంతో భారతీయ నటనా రంగంలో ఆమె ఒక విశిష్ట తారగా అవతరించింది. అంతటి విశేషనటనాను భవం ఉన్న ఏకైననటి భారతదేశంలో ఒకే ఒక్క నటి... మహానటి.. శ్రీదేవి కావడం తెలుగువారి అదృష్టం.

శ్రీదేవి... ఈ పేరంటేనే తెలుగుసినీ జగత్తులో ఏదో తెలియని ఆనందం వెల్లి విరుస్తుంది. ప్రత్యేకించి శ్రీదేవి అభిమాను లకు ఆమె పేరంటేనే ఒక సంబరం. ఆమె సినిమాలు చూసి ఆనందించిన ఎందరో అభిమానుల హృదయాల్లో ఆమె అందాల నటిగా.. అత్యద్భుత నటీమణిగా నిలిచి పోయారు. గత నెల 24న ఆమె దుబాయ్‌లో ఓ వివాహానికి వెళ్ళి ఉండగా, హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌లో పడి మృతి చెందినట్లు దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వర్గాలు నిర్ధారించాయి. ఆమె మరణవార్త విని యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో గత నెల 28న అశేష జనవాహిని అశృనయ నాల మధ్య ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. శ్రీదేవి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక.. అభిమానజనం ఆమె భౌతికకాయాన్ని చూసి పెద్దపెట్టున రోదించారు. అందరూ శోక తప్త హృదయాలతో ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు తెలిపారు. భర్త బోనీకపూర్‌ ఆమె చితికి నిప్పంటించగా, శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ గుండెలవిసేలా విలపిస్తుండగా... దేశవ్యాప్తంగా తరలి వచ్చిన భారతీయ చిత్రపరిశ్రమ ప్రము ఖులు, ప్రత్యేకించి బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, నటీమణులు ఇతర ప్రముఖులు ఉప్పొంగిన కన్నీటితో వీడ్కోలు చెప్తుం డగా.. అందరి హృదయాలు బాధతో బరు వెక్కుతుండగా శ్రీదేవి అంతిమ సంస్కా రాలు యధావిధిగా జరిగిపోయాయి.

1963లో శివకాశిలో శ్రీదేవి జన్మించారు. 54ఏళ్ళ జీవితంలో దాదాపు 50ఏళ్ళ పాటు సినీలోకాన్ని ఏలిన ఇండి యన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి తెలుగమ్మాయే. ఆమె తల్లి రాజేశ్వరి స్వస్థలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్‌ తమిళనాడులోని శివ కాశిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం వారే. ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడే వారు కూడా. తల్లిదండ్రులు చెన్నైలో ఉండేవారు. ఈ నేపథ్యంలో శ్రీదేవికి నాలుగేళ్ళ వయసు నుంచే వెండి తెరపై బాలనటిగా నటించే అవకాశం వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సా హంతో 1967లో తొలిసారిగా ఆమె 'కందన్‌ కరుణై' అనే తమిళచిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 'బడి పంతులు' చిత్రంలో 'బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో

ఉన్నాడు' అనే పాటకు శ్రీదేవి చిన్నతనం లోనే అత్యద్భుతమైన నటన ప్రదర్శించి బాలనటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఆ తర్వాత హీరో యిన్‌గా ఎదిగారు. రెండు తరాల నటు లతోనూ అద్వితీయంగా నటించి అందరినీ తన నటనాచాతుర్యంతో మంత్ర ముగ్ధుల్ని చేశారు. 'అనురాగాలు, 'మా బంగారక్క', 'పదహారేళ్ళ వయసు' వంటి చిత్రాలతో ఆమె అద్వితీయమైన నటనతో ఎదుగుతూ అందరి ప్రశంసలూ అందు కున్నారు. ప్రేమాభిషేకం, వేటగాడు, కొండ వీటి సింహం, దేవత, ఆఖరి పోరాటం వంటి చిత్రాలతో ఆమె నటనా ప్రతిభ

ఉన్నత శిఖరాలకు చేరింది. తెలుగు తమిళ చిత్ర రంగాల మహానటులు ఎన్‌టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ వంటి నట దిగ్గజాలతో పాటు, మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో కలసి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకలోకాన్ని తన నటనాప్రతి భతో మురిపించి మెప్పించిన మహానటి శ్రీదేవి. బొబ్బిలిపులి, ప్రేమకానుక, కార్తీక దీపం ఇలా ఎన్నో చిత్రాలు ఆమె నటనా వైదు ష్యానికి నిదర్శనాలు. జగదేకవీరుడు -అతిలోక సుందరి చిత్రం మరో సూపర్‌ హిట్‌ కావడంతో, హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. విశ్వ విఖ్యాత నటుడు కమలహాసన్‌తో కలసి ఆమె నటించిన 'వసంత కోకిల', అకలి రాజ్యం వంటి చిత్రాలు చిత్ర పరిశ్రమ

ఉన్నంత కాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయేవే. తమిళ చిత్ర రంగంలోనూ అని తరసాధ్యమైన రీతిలో విఖ్యాత నటుడు రజనీకాంత్‌తో ఏకంగా 23 చిత్రాల్లో నటించారు, కమల్‌హాసన్‌తో కలసి 22 చిత్రాల్లో నటించారు. అటు తెలుగులోను ఇటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించి ప్రఖ్యాతి చెందారు. ఆ తర్వాత ఆమెకు హిందీ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. నటనను ఓ ఛాలెంజ్‌గా తీసు కుని, ఎంతో కృషి పట్టుదలతో ఆమె హిందీ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో అద్వితీయ ప్రతిభతో రాణించడం విశేషం. మవాలీ, తోఫా, మిస్టర్‌ ఇండియా, సద్మా, చాందినీ, చాల్‌బాజ్‌, ఖుదాగవా, లమ్హే తదితర చిత్రాల్లో శ్రీదేవి నటన అపూర్వం. అద్భుతం కూడా. ఇవన్నీ బాక్సాఫీసును బద్దలుకొట్టి రికార్డులు సృష్టించిన చిత్రాలే. శ్రీదేవి హీరోయిన్‌ అయితే చాలు ఆ సినిమా హిట్టే అన్న టాక్‌ అంతటా వచ్చే సింది. అందుకు తగ్గట్టుగానే ఆమె నటించిన అనేక చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. నిర్మాతలకు లాభాల రాశులు పోశాయి. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి అద్వితీయ అందాల నటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీదేవి ఇండియన్‌ లెజండరీ యాక్టర్‌గా, ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా విశ్వవిఖ్యాతిగాంచారు. ఎన్నెన్నో విశిష్టమైన పురస్కారాలను, ఘనమైన అవార్డులను ఆమె అందుకున్నారు. 2013లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 'పద్మశ్రీ' అవార్డును కూడా అందుకుని అటు తెలుగు వారికి, ఇటు భారతీయ చిత్రపరిశ్రమకు, నటనారంగానికీ మహానటి శ్రీదేవి ఎనలేని గౌరవం తెచ్చారు. 81 తెలుగు చిత్రా ల్లోనూ, 72 తమిళ చిత్రాల్లోనూ అద్వితీ యంగా నటించి, మరో 72 హిందీచిత్రా ల్లోనూ అమోఘమైన నటనతో ఖ్యాతి చెందారు. ఇవికాక, 25 మలయాళం చిత్రాల్లోనూ, 6కన్నడ చిత్రాల్లోనూ నటిం చారు. మొత్తంగా 254 చిత్రాల్లో ఆమె నటనా వైభవం వర్ణించేందుకు మాటలు చాలవు. (అయితే 'మామ్‌' ఆమె 300వ చిత్రంగా పేర్కొంటున్నారు. మధ్యలోని 45 చిత్రాల వివరాలు తెలియరాలేదు.) వీట న్నిటికీ ప్రధాన కారణం ఆమె నిబద్ధత, క్రమశిక్షణ, అంతులేని కృషి.. నటనా రంగంలో ఆమెకు అనితరసాధ్య మైన ఇంత ఘనకీర్తిని తెచ్చిపెట్టాయి. అత్యంత అమోఘమైన ఆమె నటనా చాతుర్యం భారతీయ సినీరంగానికే శిఖరాయమా నంలా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. హిందీ చిత్రాల నిర్మాత బోనీకపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినీ రంగానికి కొంతకాలం దూరమైనా, 2012లో తిరిగి ఆమె నటించిన 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' చిత్రం ఓ సంచలనంగా నిలిచింది. దశాబ్దాదల తర్వాత ఆమె మళ్ళీ మేకప్‌ వేసుకున్నప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా తన నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. సినీరంగ ప్రవేశం చేసిన రోజుల్లో తనకంటూ అప్పట్లో ఎవరి దన్నూ లేకపోయినా.. కేవలం స్వయంకృషితో, పట్టుదలతో నటనారంగంలో మెరుగులు దిద్దుకుంటూ, అనుభవపాఠాలు నేర్చుకుంటూ, తననుతనే తీర్చిదిద్దుకుంటూ జీవితంలో ఎంతో కష్ట పడి ఒక మహా నటిగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. తన ముద్దుముద్దు మాటలతో నటనకే అభినయం నేర్పించిన మహానటి.. ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి ఆమె దుబాయ్‌లో మరణించారు. శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా సర్వత్రా అందరి హృదయాల్లో నిండిపోయి వుంది. అదిగో ఆ నక్షత్రలోకంలోనూ జగజ్జేయమానంగా వెలుగులీనుతూ మిల మిలమెరిసే తారగా.. దివ్యతారగా.. ధృవ తారగా నిలిచిపోయింది. ఇండియన్‌ లెజండ్‌.. ఇండియన్‌ సూపర్‌స్టార్‌ శ్రీదేవి.. ఇక లేకపోవడం భారతీయ చలనచిత్ర రంగానికే తీరని లోటు. ఏనాటికీ తీరని.. ఒక విషాదమే!.. ఆ మహానటి కిదే.. మా కన్నీటి నివాళి!....

Page 1 of 18

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నారాయణను వదలని అనిల్‌
  మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
 • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
  వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆదాల ఏ పార్టీ ఆటగాడో?
  ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కొన్ని సెంటిమెంట్లున్నాయి. దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసినోళ్ళు తర్వాత ఎన్నికల్లో గెలవరని. ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తికి వెళితే ఓడిపోతారని... ఇలా కొన్ని సెంటిమెంట్లున్నాయి. అలాగే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ కూడా…

Newsletter