pranithaఏం పిల్లో ఏం పిల్లడో' లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌.. ఎన్టీఆర్‌.. మహేష్‌ బాబు లాంటి సూపర్‌ స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది కన్నడ అమ్మాయి ప్రణీత. ఐతే 'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌ బస్టర్లో నటించినప్పటికీ ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలే లేవు. పోనీ సొంత ఇండస్ట్రీ శాండిల్‌ వుడ్లో అయినా చెప్పుకోదగ్గ అవకాశాలు ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో ఇక ఆల్టర్నేట్‌ కెరీర్‌ చూసుకుంటున్నట్లుంది ప్రణీత. సినిమాలకు సెలవిచ్చేసి బిజినెస్‌ వుమన్‌ గా మారడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంది. బెంగళూరులో ప్రణీత ఫుడ్‌ అండ్‌ బార్‌ బిజినెస్‌ ఛైన్‌ ప్రారంభిం చడం విశేషం. దాన్ని బెంగళూరుతో పాటు మరిన్ని నగరాలకు విస్తరించే పనిలో ఉంది ప్రణీత. ఐతే ఈ బిజినెస్‌ వరకే పరిమితం కాకుండా భవిష్యత్తులో సినీ నిర్మాణం చేపట్టాలని కూడా ఆమె భావిస్తోంది. ఐతే ఇప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని.. ఫుడ్‌ అండ్‌ బార్‌ బిజినెస్‌ లో డబ్బులు బాగా సం పాదిస్తే.. ప్రొడక్షన్‌ హౌజ్‌ మొదలుపెట్టి సినిమాలు నిర్మించే అవకాశాలు లేక పోలేదని ఆమె వెల్లడించింది. ప్రణీత ఫ్యామిలీలో చాలామంది డాక్టర్లు ఉన్నా రు. వాళ్లకు హాస్పిటల్‌ బిజినెస్‌ కూడా ఉంది. ఫుడ్‌ అయినా.. హాస్పిటల్‌ అయినా.. చాలా వరకు సాఫీగా సాగి పోయే వ్యాపారాలే. వాటి విూద దృష్టి పెట్టక సినిమాల నిర్మాణం అనే జూదం ఆడటం ఎందుకు అని జనాలు ప్రణీ తను హెచ్చరిస్తున్నారు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter