cmమీరు ప్రత్యేకహోదా ఇవ్వలేమన్నారు... మీరు ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీ నాకు చాలనుకున్నాను... దుగరాజపట్నం పోర్టు కుదరదన్నారు... అది నాకు సంబంధించిన పనికాదు కదా సరేనన్నాను. రాజధాని నిర్మాణానికి నిధు లిస్తామన్నారు... నేను సింగపూర్‌ లాంటి రాజధాని కట్టుకుంటుంటే దానికి నిధులివ్వకుండా మీరు చంబల్‌పూర్‌ లాంటి పట్టణాన్ని కట్టుకోమన్నట్లుగా ముష్టి విదిలిస్తున్నారు. అయినా సర్దుకున్నాను. పోలవరం ప్రాజెక్ట్‌పై నేను పెంచిన అంచనాలను ఓకే చేయకుండా పాత అంచనాలతోనే పనులు చేసి పెట్టాలన్నారు. ఇక్కడా రాజీపడ్డాను. ఇవన్నీ దేని కోసం... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతూ విభజన హామీలపై మీతో రాజీపడుతూ వచ్చింది ఎందుకోసం... మా రాష్ట్ర అసెంబ్లీ సీట్లను 175 నుండి 225కు పెంచుతారని. నా నెత్తిన పాలు పోస్తారని కదా... సీట్లు పెరిగితే ఎంచక్కా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు. వైసిపి నుండి ఆల్‌రెడీ వచ్చిన ఎమ్మెల్యేలకే కాదు, ఇంకా వచ్చే వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వొచ్చు. ఇదీ చంద్రబాబు మనోగతం.

ఆయన ఆశ, ధ్యాస అంతా కూడా నియోజకవర్గాల పెంపు మీదే వుంది. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచుతారనే ఆశతోనే ఇప్పటివరకు మోడీ ముందు సాగిలబడుతూ వచ్చాడు. అందుకోసమే కేంద్రం విభజన హామీలను అటకెక్కించినా ఇదేం పని అని అడగలేకపోయాడు. విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా ఫర్వాలేదు, సీట్లు పెంచితే చాలన్నట్లుగా వుండింది ఆయన వాలకం. ఇటీవల లేకలేక ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరికితే ఈయన పోయి రాష్ట్రానికి ఏం కావాలో అడక్కుండా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచమని అడిగొచ్చాడు.

అసెంబ్లీ సీట్లపెంపుపై కేంద్రం నుండి ఎలాంటి హామీ రాలేదు. భవిష్యత్‌లో పెంచుతారనే వాతావరణం కూడా కన పడ్డం లేదు. ఇక్కడే చంద్రబాబులో నిరాశా వాదం అలుముకుంటోంది. ఇది కూడా చేయకుంటే ఇక బీజేపీతో పొత్తు ఎందు కనిపిస్తోంది. నిరాశావాదాన్ని ఆయన ఈమధ్య తన మాటల్లో చూపించాడు కూడా! పొత్తు వద్దనుకుంటే దండం పెట్టి పోతామని చెప్పాడు.

రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ నాయకుల మధ్య తరచూ వివాదాలు రేగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో తెలుగుదేశంకు అమ్ముడు పోయిన వర్గం, వ్యతిరేక వర్గం అని రెండు న్నాయి. ఎంపీ కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలుగుదేశం అనుకూలవర్గంలో వున్నారు. వారు ఒక రకంగా తెలుగుదేశం నాయకులేనను కోవచ్చు. తెలుగుదేశంతో విభేదించే పురంధేశ్వరి, విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు లాంటి నాయకులు చంద్రబాబుపై ఒంటికాలితో లేస్తున్నారు. ప్రభుత్వ అవి నీతిని, చంద్రబాబు పార్టీ ఫిరాయింపు చర్యలను ఎండగట్టడంలో ఎప్పటికప్పుడు వీళ్ళు ముందుంటున్నారు.

ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీ- బీజేపీల మధ్య దూరం పెంచుతూ వచ్చాయి. రేపు కేంద్రం సీట్లు పెంచకుంటే ఆ దూరం మరింత పెరగొచ్చు కూడా! అది తెగదెంపులదాకా రావచ్చు. బీజేపీని దూరం చేసుకుంటే మైనార్టీలు దగ్గర అవుతారనే ఆశ చంద్రబాబులో వున్న ట్లుంది. ఆ దిశగానే ఆయన బీజేపీతో కటీఫ్‌కు సిద్ధం కావచ్చు. అయితే ఇక్కడ ఆయన ఇంకోదానికి కూడా సన్నద్ధం కావాల్సి వుంటుంది. ఓటు-నోటు కేసు ఏ క్షణమైనా మళ్ళీ తెరమీదకు రావచ్చు. అది రావడం జరిగితే రాష్ట్రంలో రాజకీ యాల సీన్‌ చాలా మారొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బీజేపీని దూరం చేసుకోవడమంటే... కోరి కొరివితో తల గోక్కోవడమే!

chandraమేం అధికారంలో ఉన్నాం... ఈ రాష్ట్రం మా ఇష్టారాజ్యం... భూములు కొల్లగొడతాం... ఇసుకను బొక్కేస్తాం... ప్రాజెక్ట్‌లు, పుష్కరాల పేరుతో వేలకోట్లు నొక్కేస్తాం... అడిగిన వాళ్లను పాతరేస్తాం... ఏం మీరు అధికారంలోకి వస్తే ఇలాగే చెయ్యరా...? రాష్ట్ర ప్రభుత్వం తీరిది. రాష్ట్రంలో తమ అవినీతి, అక్రమాలను ప్రశ్నించే వ్యవస్థే లేకుండా చేసుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న లక్ష్యం.

నేను మారాను... నేను మారిన చంద్రబాబును అని చంద్రబాబు పదేపదే చెప్పుకోవడం చూసాం. ఇప్పుడు నిజమేననిపిస్తోంది. చంద్రబాబు చాలా మారాడు. 1995 నుండి 2004 వరకు వున్న చంద్రబాబు వేరే... ఈ చంద్రబాబు వేరే! అప్పటి చంద్రబాబు అధికారంలో విచ్చలవిడితనాన్ని అంగీకరించేవాడు కాదు. మంత్రులను, ఎమ్మెల్యేలను అదుపులో ఉంచేవాడు. అడ్మినిస్ట్రేషన్‌ ఎంతో బాగుండేది. అప్పుడు కూడా చంద్రబాబు డిక్టేటర్‌లానే వ్యవహరించాడు. అయితే ఆ నియంత పాలన రాష్ట్రానికి ఉపయోగపడింది.

ఇప్పుడు మారిన చంద్రబాబు కూడా డిక్టేటర్‌లాగానే వ్యవహరిస్తున్నాడు. అయితే అది రాష్ట్రప్రగతికి కాకుండా వినాశానికి దోహదపడుతోంది. ఆయన అధికారం మత్తులో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న తన మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల కాకుండా ప్రతిపక్షం, ప్రజల పట్ల నియంతగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని, రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనే తపనతో ఫాసిస్టు ధోరణులను కనపరుస్తు న్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియాను మూయిస్తాననడం, వార్తలు రాసిన విలేకరుల మీద కేసులు పెట్టాలని బెదిరించడం ఎంతవరకు సమంజసం? తన ప్రభుత్వంలోని లోపాలను, చేస్తున్న పనుల్లో తప్పులను వేలెత్తి చూపకూడదా? ఇది నియంతృత్వమా? ప్రజాస్వామ్యమా? అమరావతి రాజధాని పెద్ద రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం. ఇది అందరికీ తెలిసిందే! అగ్ర రాజ్యాలు అమెరికా, జర్మనీ, చైనా, జపాన్‌ వంటి దేశాలే ఇప్పటి కిప్పుడు 50వేల ఎకరాల భూముల్లో రాజధానులు కట్టలేవు. వాళ్లకు అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఏపికి కూడా ఇప్పటికిప్పుడు 50వేల ఎకరాల రాజధాని అవసరం లేదు. గుంటూరులోనో, విజయవాడలోనో రేకులషెడ్లు వేసుకునైనా రాజధాని పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సత్యమైన పరిపాలనేగాని సింగపూర్‌ లాంటి రాజధాని కాదు. అధికారంలో కొచ్చాక తెలుగుదేశం నాయకులు మాత్రం అమరావతి రాజధానిని ఒక రియల్‌ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. రాజధాని ప్రాంతాన్ని ముందుగానే ఎంపిక చేసుకున్నారు. రాజధాని చుట్టు పక్కల ముందుగానే భూములు కొనుగోలు చేశారు. కొందరు నేరుగా కొనుగోలు చేయగా, మరికొందరు మంత్రులు, నేతలు బినామీల పేర్లతో పెట్టుకున్నారు. అయితే భూములు కొనడం తప్పు పట్టాల్సింది కాదు. కాని ఓపక్క పేదల భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో లాక్కుంటూ ఇంకోపక్క వీళ్లు భూములను కొనడమే ప్రశ్నిస్తున్నారు. భూములు కొనుక్కుంటే తప్పేంటని టీడీపీ నాయకులే ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజధాని రాకముందే అక్కడ భూములు కొన్నామంటున్నారు. గుంటూరు జిల్లా నాయకులు అమరావతి వద్ద భూములు కొన్నారంటే అర్ధముంది, ఇతర జిల్లాల తెలుగుదేశం నాయకులు కూడా గుంటూరు జిల్లాకు పరుగులు తీసి భూములు కొన్నారంటే.. అక్కడ రాజధాని వస్తుందన్న విషయం ముందుగా తెలుసు కాబట్టే కదా! ఒకవేళ వైకాపా అధికారంలోకి వచ్చున్నా రాజధానిని రియల్‌ వ్యాపారంగానే చూసుండేవాళ్లు. ఏ పార్టీకి కూడా ప్రాతివత్యం బ్రాండ్‌ ఇవ్వలేం కదా! వైకాపా వచ్చున్నా ఆ పార్టీ నాయకులు ముందు ఇదే పని చేసుండేవాళ్లు. పరిపాలనాపరంగా తమ వైఫల్యాలను కప్పి పుచ్చు కోవడం కోసం ప్రతి వైఫల్యానికి జగన్‌ను బాధ్యుడిని చేయడం చంద్రబాబుకు, వారి నేతలకు ఒక నైజంగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఒక నిరంకుశ వైఖరితో చంద్రబాబు ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తోంది.

పాపాల భైరవుడు నారాయణ

narayanaనారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను మున్సిపల్‌ మంత్రిని చేసిందే రాజధాని భూముల కోసం. మంత్రిగా రాష్ట్రంలో నారాయణ వెలగబెడుతున్నదేమీ లేదు. ఆయన ఎక్కువ సమయం అమరావతిలోనే గడుపుతున్నాడు. మొన్నటివరకు రైతుల నుండి భూములను గుంజుకోవడమే పని. ఓ పక్క రైతుల నుండి భూములు తీసుకుంటూ మరోపక్క రాజధాని చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి బినామీల పేరుతో పెట్టారు. నారాయణ భూములు కొనడం తప్పులేదు. అయితే రైతుల పొట్టకొట్టి భూములు కొనడాన్నే ప్రశ్నించాలి. అసలు మంత్రిగా లేకుంటే నారాయణ ఇంకెన్ని వందల ఎకరాలు కొనున్నా అడిగేవారుండరు. డబ్బులున్నాయి కాబట్టి కొనుక్కున్నామని చెప్పొచ్చు. కాని ఇప్పుడు రైతులను మోసం చేసి భూములను కొన్నట్లయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగే అన్ని లోపాలకు, పాపాలకు ప్రధానబాధ్యుడుగా ఆయనే కనిపిస్తున్నాడు. పాపాల భైరవుడన్న పేరు తెచ్చుకుంటున్నాడు.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter