portదాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు దుగరాజపట్నంను ఎంపిక చేయడం తెలిసిందే! రాష్ట్ర విభజన బిల్లులో కూడా ఏపికి ఇచ్చిన హామీలలో దుగరాజపట్నంను పొందుపరిచారు. 2014 ఎలక్షన్‌లకు ముందు తిరుపతి ఎంపిగా వున్న చింతా మోహన్‌ ఈ పోర్టుకు హడావిడిగా శంకు స్థాపన చేయించాలని కూడా చూసారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ పోర్టుపై మీన మేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ పోర్టు ఇక్కడ కడితే వచ్చే లాభనష్టాలపై బేరీజు వేశారు. దుగరాజపట్నంకు సమీపంలోనే కృష్ణపట్నం పోర్టుతో పాటు చెన్నైలో రెండు పోర్టులు వుండడం, దీనికితోడు ఇస్రో, పర్యావరణ శాఖ అభ్యంతరాలు ఈ పోర్టుకు అడ్డంకిగా మారాయి. ఈ పోర్టు కట్టినా పెద్దగా ఆదాయం ఉండబోదని నీతిఅయోగ్‌ తేల్చిచెప్పింది. దీనిబదులు ఏపికి మరో రూపంలో ప్రయోజనం కల్పిస్తామని కేంద్రం చెప్పడంతో ఇక దుగరాజపట్నం పోర్టుకు తెరపడినట్లేనని భావించాల్సి వస్తోంది.

portగత యూపిఏ ప్రభుత్వంలోనే వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద ఓడరేవు మంజూరైంది. అయినా మధ్యలో ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. షార్‌ సెంటర్‌కు భద్రత సమస్య వస్తుందని ఇస్రో వాళ్లు ఆక్షేపణ చేసారు. అలాగే అటవీ, పర్యావరణశాఖ పరంగా కూడా అడ్డంకులొచ్చాయి. వీటన్నింటిని క్లియర్‌ చేసాకే గత యూపిఏ ప్రభుత్వం ఈ పోర్టుకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ పోర్టు నిర్మాణానికి యూపిఏ ప్రభుత్వంలో శంకుస్థాపన మాత్రం చేయలేకపోయారు. విభజన బిల్లులో కూడా దుగరాజపట్నం పోర్టును చేర్చడం జరిగింది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ పోర్టును సాధించే దిశగా గట్టి ప్రయత్నమంటూ జరగలేదు. ఈలోగా కొందరు నాయకులు మాత్రం ప్రకాశంజిల్లా రామాయపట్నం వద్దకు పోర్టును మార్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి దుర్భరంగా మారింది. ఐటి ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి. ఆంధ్రాకు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా వచ్చే అవకాశాలులేవు. చంద్రబాబు పుణ్యమా అని తెలుగు సినిమా పరిశ్రమ కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడిపోతుంది. చంద్రబాబు కొంత చొరవతీసుకుని వుంటే సినీ పరిశ్రమ వైజాగ్‌కో లేక నెల్లూరుజిల్లా కన్నా తరలి రావడానికి అవకాశముండేది. ఇక చంద్రబాబు అమరావతి రాజధాని అంటున్నాడుగాని అది ఈ కాలంవాళ్లు చూసేది లేదు, పెట్టేదీ లేదు. మన రాష్ట్రానికి ఉన్న అవకాశమల్లా పారిశ్రామికాభివృద్ధి. అది కూడా ప్రత్యేకహోదా వస్తే ఆ దిశగా అవకాశాలుంటాయి. ఈ పారిశ్రామిక ప్రగతికి కూడా ఎక్కువ అవకాశం ఉండేది నెల్లూరుజిల్లాలోనే. ఎందుకంటే ఇక్కడ భూముల సమస్య లేదు. రాజకీయ బెదిరింపులు ఉం డవు. ముఖ్యంగా చెన్నై-బెంగుళూరు, విశాఖ-చెన్నై కారిడార్‌లో నెల్లూరుజిల్లా ప్రధాన భాగంగా ఉండ బోతుంది. కృష్ణపట్నం పోర్టు వచ్చాక కర్నాటకలో వున్న పారిశ్రామికవేత్తలు సైతం తమ ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టునే ఆశ్రయిస్తున్నారు. చెన్నై, ఎన్నూర్‌పోర్టులు ఇప్పటికే రద్దీగా వుంటున్నాయి. విదేశాల నుండి వచ్చిన నౌక పదిరోజుల దాకా అన్‌లోడింగ్‌, లోడింగ్‌ కోసం సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. చెన్నై రోడ్లుపై నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ వుంటుంది. పరిశ్రమలకు రవాణా పెద్ద సమస్యగా వుంది. దీనివల్లనే చాలా కంపెనీలు తమ ఎగుమతులు, దిగుమతులను కృష్ణపట్నం పోర్టు ద్వారా సాగిస్తున్నాయి. చెన్నైసిటీ దగ్గరగా వుండడం, చెన్నై, రేణిగుంట ఎయిర్‌పోర్టులు దగ్గరగా వుండడం నెల్లూరు జిల్లాకు కలిసొచ్చే అంశం. కాబట్టి పారిశ్రామిక ప్రగతి ఇక్కడే ఎక్కువుగా కేంద్రీకృతం కాబోతుంది. ఈ నేపథ్యంలో దుగరాజపట్నంపోర్టు కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఈ ఓడరేవు కల ఈరోజు కాకున్నా రేపైనా సాకారం కావాల్సిందే!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • ఇసుకతో ఇక్కట్లు
    నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…

Newsletter